ఉప్పల్, మే 29: ప్రభుత్వ సీలింగ్ భూముల పరిరక్షణకు ఘట్‌కేసర్ మండల రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. మండలం పరిధిలోని పర్వతాపూర్ గ్రామంలో సర్వే నెంబర్ 1, 10, 11లో గల సీలింగ్ భూములను పరిశీలించారు. కబ్జాలలో ఉన్న ఇట్టి భూములను స్వాధీనం చేసుకోవడానికి బుధవారం ప్రభుత్వ భూముల సూచిక బోర్డులను సిబ్బందిచే ఏర్పాటు చేయించారు. కోట్ల విలువైన భూములను రక్షించి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రజాప్రయోజనాలకోసం కేటాయించడానికి శాయశక్తులా కృషి చేస్తానని తహశీల్దార్ దేవుజీ అన్నారు. పీర్జాదిగూడ, మేడిపల్లి, కాచివానిసింగారం, బోడుప్పల్, చెంగిచర్ల గ్రామాలలో ఉన్న ప్రభుత్వ భూముల పరిరక్షణకు సత్వరంగా చర్యలు తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
చెరువులను సైతం...
భూగర్భ జలాలను అందించే చెరువులను కబ్జా చేయకుండా ఎఫ్‌టిఎల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తహశీల్దార్ దేవుజీ అన్నారు. చెరువులలో మట్టితో నింపి కబ్జాచేసి అక్రమ నిర్మాణాలను చేపట్టారని వచ్చిన ఫిర్యాదులపై స్పందించారు. పీర్జాదిగూడ, పర్వతాపూర్, బోడుప్పల్, చెంగిచర్ల, మేడిపల్లి చెరువులను సందర్శించారు. కబ్జాకాకుండా ఎప్పటికప్పుడు గట్టి నిఘా ఉందని, కబ్జాచేస్తే అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వ సీలింగ్ భూముల పరిరక్షణకు
english title:
s
Date:
Thursday, May 30, 2013