Quantcast
Viewing all articles
Browse latest Browse all 69482

50 శాతం సబ్సిడీపై విత్తనాలు

వికారాబాద్, మే 29: ప్రభుత్వం 50 శాతం సబ్సిడీపై అందిస్తున్న విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ డివిజన్ వ్యవసాయ సహా సంచాలకులు ఆర్‌ఎం దివ్యజ్యోతి తెలిపారు. బుధవారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం పచ్చరొట్టె విత్తనాలైన జనుము, జీలుగలు సిద్దంగా ఉన్నాయని, అసలు ధర 50 రూపాలకు కిలో కాగా సబ్సిడీపోను 25 రూపాయలకు అందిస్తున్నట్లు తెలిపారు. వికారాబాద్ మండలంతో పాటు పూడూర్, నవాబ్‌పేట మండలాల్లో విత్తనాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈప్రాంతంలో తరచుగా సాగుచేసే జొన్న, మొక్కజొన్న, కంది, మినుము, పెసర విత్తనాలు త్వరలో రానున్నాయని, వాటిని సైతం 50 శాతం సబ్సిడీపై అందించనున్నట్లు తెలిపారు. డివిజన్‌లో పత్తి విత్తనాల కొరత లేదని, డివిజన్‌లో ప్రస్తుతం 35 వేల బిటి విత్తనాల ప్యాకెట్లు సిద్దంగా ఉన్నాయన్నారు. విత్తనాల దుకాణదారులు బిటి విత్తనాల ప్యాకెట్లను 930 రూపాయలకు మించి అమ్మితే కఠినచర్యలు తీసుకుంటామన్నారు. బిటి విత్తనాల్లో మహికో, నూజివీడులోని రకాలతో పాటు ఇతర రకాలు ఉన్నాయని తెలిపారు. పూడూర్ మండలంలో 7662, నవాబ్‌పేట మండలంలో 1400 విత్తనాల ప్యాకెట్లున్నాయని తెలిపారు. రైతులు విత్తనాలు, ఎరువుల కోసం తప్పక పాస్‌పుస్తకాలు తీసుకురావాలని సూచించారు. డివిజన్‌లో ఎరువుల కొరత లేదని వివరించారు. వికారాబాద్ డివిజన్‌లో డిఎపి 360 టన్నులు, యూరియా 65, పొటాష్ 75, కాంప్లెక్స్ 275 టన్నులున్నాయని తెలిపారు. పూడూర్‌లో డిఎపి 17, పొటాష్ 12, యూరియా 4, కాంప్లెక్స్ 18 టన్నులున్నాయని తెలిపారు. నవాబ్‌పేట మండలంలో డిఎపి 17, కాంప్లెక్స్ 18, యూరియా 10, పొటాష్ 12 టన్నుల నిల్వలున్నాయని తెలిపారు.
విత్తనాలు, ఎరువుల విషయంలో ఎవరైనా కృత్రిమకొరత సృష్టించేందుకు ప్రయత్నిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. రైతుల సౌకర్యార్థ ఆగ్రోస్ రైతు సేవాకేంద్రాలతో పాటు వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లోను రైతులకు సేవలందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి పిఎసిఎస్‌లో ఎరువులను అమ్ముతున్నట్లు తెలిపారు. సమావేశంలో వికారాబాద్ మండల వ్యవసాయాధికారి వినె్సంట్ వినయ్‌కుమార్ పాల్గొన్నారు.
తెలంగాణపై కెసిఆర్, హరీశ్‌రావుకే చిత్తశుద్ధి లేదు
తార్నాక, మే 29: మహానాడులో టిడిపి అధినేత తెలంగాణకు కట్టుబడి ఉన్నామని తేల్చిచెప్పినప్పటికీ.. ఇస్తాము తెస్తాము అన్న కాంగ్రెస్ పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీపై బురదజల్లే ప్రయత్నాన్ని తెరాస దొరలు మానుకోవాలని టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఈడిగ ఆంజనేయులు గౌడ్ పేర్కొన్నారు. బుధవారం ఓయు ఆర్ట్స్ కళాశాల ముందు నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడుగుల గొడుగుగా నిలుస్తున్న తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయాలని ప్రాంతీయంగా బలంగా ఉన్న పార్టీని బలహీనం చేసి తాము లబ్దిపొందాలన్న దుర్భుద్ది తప్ప కెసిఆర్, హరీశ్‌రావుకు తెలంగాణాపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. తెలంగాణాకు ఏ విధంగా అడ్డుకాని తెలుగుదేశం పార్టీపై ఒంటికాలుపై లేచే కెసిఆర్, హరీశ్‌రావుకు వెయ్యి మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన సోనియాగాంధి జోలికి వెళ్లే దైర్యం ఎక్కడిదని అన్నారు.
కెసిఆర్, హరీశ్‌రావుల లోగుట్టును రఘునందన్‌రావు ఆధారాలతో సహా బయటపెట్టారని, రాబోయే 2014 ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. కెసిఆర్ అండ్ కంపెనీ తెలంగాణ కోసం చిత్తశుద్ధితో ఉద్యమం చేయాలని ఈడిగ హితవుపలికారు. కిరణ్‌గౌడ్ పాల్గొన్నారు.

ప్రభుత్వం 50 శాతం సబ్సిడీపై అందిస్తున్న విత్తనాలను
english title: 
v

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles