Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

భారత్‌ను ఒంటరి చేసే వ్యూహం!

$
0
0

చైనా ప్రధాని లీ కెక్వియాంగ్ ఇటీవల మనదేశంలో పర్యటించిన దానికి సంబంధించిన విశేషాలు, ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను కుదిపేస్తున్న స్పాట్ ఫిక్సింగ్ కళంకానికి సంబంధించిన వార్తలకు పోటీగా ప్రసార మాధ్యమాల్లో చోటు సంపాదించడానికి చాలా కష్టపడాల్సి వస్తోంది. నిజానికి ఉదాత్తత, పరిహాసాస్పదాల సమిశ్రీతంగా ఈ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారం నడుస్తోంది. చైనా ప్రధాని మనదేశంలో మూడు రోజుల పర్యటనకు రావడంలో పెద్ద లక్ష్యమే దాగుంది. దాదాపు మూడు వారాల పాటు లడక్ ప్రాంతంలో చైనా జరిపిన చొరబాటు కారణంగా తలెత్తిన సంక్లిష్ట పరిస్థితినుంచి అందరి దృష్టి మళ్ళించడమే లీ కెక్వియాంగ్ పర్యటన ముఖ్యోద్దేశం. విచిత్రమేమంటే ఈ చొరబాటు ఎంత వేగంగా చోటు చేసుకున్నదో...అంతే వేగంగా ఆశ్చర్యాన్ని కలిగించే రీతిలో మబ్బులు విడిపోయినట్టు విడిపోవడం విశేషమే! అయితే ఈ సందర్భంగా అనేక ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సి ఉంది. ఉదాహరణకు..వారు ఆవిధంగా చేయడం భారత నాయకుల నాడిని పసికట్టడానికా? లేక వారిని తప్పుదోవ పట్టించడానికా? లేక వాస్తవాధీన రేఖ వెంట భారత్ అభివృద్ధి పరుస్తున్న వౌలిక సదుపాయాలకు సంబంధించి పనుల వేగాన్ని గణనీయంగా తగ్గించడానికా? ఈ ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది. మరోకోణంలో ఆలోచిస్తే.. పరస్పరం రాజీ చర్చల ద్వారా సరిహద్దు సమస్యను పరిష్కరించడానికి, యత్నాలేవీ చేయడం లేదని, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి (పీఎల్‌ఏ)కు హామీ ఇవ్వడానికా? లేదా దేశీయంగా అభిప్రాయం ఎట్లా ఉన్నదని తెలుసుకోవడానికా?
లీ కెక్వియాంగ్ మనదేశంలో పర్యటించినప్పుడు అద్భుతమైన ప్రజా సంబంధాల నైపుణ్యాలను ప్రదర్శించారు. ముఖ్యంగా హావభావాల వ్యక్తీకరణ, చక్కటి సంభాషణా చాతుర్యాన్ని ఆయన ప్రదర్శించారు. కేవలం విభేదాల కంటే అభిసరణే గొప్పదన్న భావ ప్రకటన చేయడం నిజంగా అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ‘హిందీ-చీనీ భాయి భాయి’ పునరావృతమవుతున్నదా అని అనిపించేంతటి రీతిలో ఆయన వ్యవహార శైలి కొనసాగింది. భారత్ పట్ల వ్యవహరించే విషయంలో చైనీయుల్లో వచ్చిన మార్పు నిజమైనదేనా? లేక నేర్పుగా ప్రస్తుత అవసరాలను జాగ్రత్తగా మరింత పరీక్షకు లోను చేయడానికా? అనేది కూడా తేలాల్సి ఉంది. లీ భారత్ నుంచి వెళ్ళిపోయినా చర్చలు కొనసాగించే పరిస్థితిని కల్పించడం, ఆయనలోని నైపుణ్యానికి దృష్టాంతం.
చైనాలో ఐదోతరం నాయకత్వాన్ని ‘చిట్టచివరి తరం’గా పరిగణిస్తారు. ఎందుకంటే 1966లో మావో జెడాంగ్ సాంస్కృతిక విప్లవాన్ని ప్రారంభించినప్పుడు, ప్రస్తుత నాయకత్వం ప్రాథమిక లేదా మాధ్యమిక పాఠశాలల్లో విద్యాభ్యాసం కొనసాగించేవారు. దశాబ్దం పాటు కొనసాగిన ఈ విప్లవంలో, ఎన్నో జీవితాలు నాశనమైపోయాయి, సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపడమే కాదు ఆర్థికంగా గందరగోళ పరిస్థితులకు దారితీసింది. మావో మరణం తర్వాత 1977లో ఉన్నత విద్యకు ద్వారాలు తెరచినప్పుడు 11.6మిలియన్ సంఖ్యలో యువకులు కళాశాల విద్యలో మొదటి, రెండవ సంవత్సరాల్లో చేరడానికి ముందుకు వచ్చారు. కానీ వీరిలో కేవలం మూడు శాతం మందికి మాత్రమే కళాశాలల్లో ప్రవేశం లభించింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారిని 1982 నాటి వర్గంగా పరిగణిస్తారు. వీరిలో ప్రస్తుత చైనా అధ్యక్షుడు గ్జి జిన్‌పింగ్, ప్రధాన లీ కెక్వియాంగ్‌లు కూడా ఉన్నారు. నాలుగోతరం చైనా నాయకత్వంలో ఎక్కువగా ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు ఉండేవారు. ఇక ఐదోతరం నేపథ్యం వారికి పూర్తి భిన్నం. వీరంతా రెండు రాజకీయ ప్రత్యర్థి గ్రూపులకు చెందినవారు. గ్జి వంటి ‘యువరాజు’లను పరిశీలిస్తే వీరి పూర్వీకులు మావోకు సన్నిహితంగా మెలిగిన వారేనని స్పష్టవౌతుంది. వీరంతా ప్రజాకర్షక గ్రూపుగానో లేక ‘తౌన్‌పై’ వర్గంగానో ఉన్నారు. లీ కెక్వియాంగ్ ఈ గ్రూపునకు చెందినవాడు.
ప్రైవేటీకరణను, మార్కెట్‌ను మరింత సరళతరం చేయడం, ఆర్థిక సామర్ధ్యం, దేశీయ భూమిని మరింతగా అభివృద్ధి పరచడం, ఉన్నత స్థాయి ప్రగతి సాధన కావాలని గ్జి వాంఛిస్తున్నారు. ఇక లీ విషయానికి వస్తే, నిరుద్యోగం, గృహనిర్మాణం, సామాజిక భద్రత, నెట్‌వర్క్ వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తారు. ‘‘20 రోజుల్లో ఉపాధి’’ అనే పేరిట లీ ప్రకటించిన పథకం, కుటుంబ సభ్యులు లేనివారికి ‘చైనీయుల ఎన్‌ఆర్‌ఈజీఎ’ వంటిది. ఇప్పుడు టోక్యో నుంచి వాషింగ్టన్ వరకు అడికే ప్రశ్న ఒక్కటే. డెంగ్ గ్జియావోపింగ్ ఆదేశించిన ‘శాంతియుతంగా అభివృద్ధి సాధన’ విధానాన్ని ప్రస్తుత నాయకత్వం వదిలేసిందా? మొత్తం మూడు ప్రాంతాల విషయంలో చైనీయులు పట్టుబడుతుండమే విచారకరం. నిజంగా ఇది ఆందోళన కలిగించే అంశం. వీటిలో మొదటిది తూర్పు చైనా సముద్రంలోని ‘శంకాకు’ దీవులు. రెండవది దక్షిణ చైనా సముద్రంలోని, భారతీయ ఎల్‌ఎసి వద్ద ‘నైన్-డాష్’ సరిహద్దు రేఖను చైనా నిర్ధారిస్తోంది. చైనా నుంచి వస్తున్న సంకేతాలను పరిశీలిస్తే అవి పరస్పర విరుద్ధంగా ఉన్నట్టు ద్యోతకమవుంది. ఇక చైనా రక్షణ బడ్జెట్ ఏటా పదిశాతం చొప్పున పెరుగుతూ వచ్చి, 2013 ఆర్థిక సంవత్సరంలో అధికారికంగానే 114.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. వాస్తవిక లెక్కలు పరిశీలిస్తే పెకి వెల్లడించిన దానికంటే దాదాపు యాభైశాతం అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది.
చైనా ప్రదాని లి కెక్వియాంగ్ భారత్ పర్యటన, బర్మా (మయన్మార్) అధ్యక్షుడు థాన్ ష్వెన్ వాషింగ్టన్‌కు వెళ్ళడం..దక్షిణాసియా ప్రాంతలో నెలకొన్న సంక్లిష్ట పరిస్థితులకు సంకేతం. ఇక అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు హమిద్ కర్జాయ్...లీ కెక్వియాంగ్ పాకిస్థాన్‌కు వెళ్ళక ముందునుంచే మనదేశంలో ఉన్నారు. మొట్టమొదటి చైనా-అమెరికా సదస్సులో పాల్గొనడానికి, చైనా అధ్యక్షుడు గ్జి, వచ్చే జూన్ నెలలో కాలిఫోర్నియాకు వెళ్ళనున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా ‘‘ భ్రమణ కీలకం’’గా భావిస్తున్న దాన్ని ‘‘పునర్ సమతుల్యం’’అంటూ తిరిగి సరికొత్త చిహ్న రూపాన్నిచ్చి, ట్రాన్స్-పసిఫిక్ భాగస్వామ్యంతో సమీకృతం చేయడం ఇంకా అమెరికా పరిశీలనలో ఉంది.
లీ మన దేశాన్ని సందర్శించినప్పుడు మొత్తం ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు జరిగినప్పటికీ, అవేం అంత ప్రాధాన్యత కలిగిన అంశాలు కావు. ఎగువ బ్రహ్మపుత్ర జలాలపై ఆనకట్టలను నిర్మించే సమయంలో, నది దిగువ భాగంలో ఉన్న భారత్ హక్కులను గౌరవిస్తూ సంప్రదింపులు జరపడానికి చైనానేతలు సిద్ధంగా లేరు. రెండు దేశాల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న వాణిజ్య అసమతుల్యతను పరిశీలించి వాటిని పరిష్కరించేందుకు మొత్తం మూడు వర్కింగ్ గ్రూపులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చైనాకు మనం ఎగుమతి చేసే వస్తువులకంటే దిగుమతి చేసుకునేవి మూడురెట్లు అధికంగా ఉన్నాయి. మొత్తం మూడు ప్రాంతీయ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటే మంచిదని లీ సూచించారు. ఆసక్తి కలిగించే అంశమేమంటే.. బంగ్లాదేశ్-చైనా-ఇండియా-మయన్మార్ కారిడార్ ఏర్పాటు చేయాలన్న దానిపై రెండు దేశాలూ సంతకాలు చేశాయి. మరి మయన్మార్ అధ్యక్షుడు ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడితో చర్చలు జరిపేందుకు ఆ దేశంలో ఉన్నారు. మన దేశంలో వౌలిక సదుపాయాల వృద్ధి లేకుండా 2015 నాటికి 100 బిలియన్ డాలర్లమేర వాణిజ్య లక్ష్యం పెట్టుకోవడం, చైనాకే లాభదాయకం. చైనా కంపెనీలకోసం పారిశ్రామిక మండళ్ళను ఏర్పాటు చేయడం, సరిహద్దుకు ఇరువైపులా పెద్ద ఎత్తున వర్తక కార్యకలాపాల నిర్వహణ వంటివి అద్భుతమైన ఆలోచనలే. కానీ భారత పొరుగు దేశాలకు ప్రచ్ఛన్నంగా సహాయపడుతూ, ఎక్కడికక్కడ దిగ్బంధించాలన్న దురుద్దేశంతో ముందుకు పోతున్న చైనా ప్రవర్తనను కట్టడి చేయడానికి ఇవి ఏమాత్రం పనిచేయవు. పశ్చిమ దేశాలకు చెందిన మధ్యవర్తులతో వ్యవహరించినప్పుడు, దక్షిణాసియాలో సంబంధాలు తిరిగి సక్రమమైన గాట్లో పెట్టే పని మీది కాదంటూ భారత్ అధిక్షేపణ తెలుపుతూ వస్తున్న నేపథ్యంలో, లీ .. మనదేశంతో పాటు పాకిస్తాన్‌లో కూడా పర్యటించడానికి ఏమాత్రం సంకోచించకపోవడం గమనార్హం. అసలు చైనాను నమ్మాలా? వద్దా? అనేది ఇప్పటికీ ఒకపెద్ద చిక్కు ప్రశే్న! కొద్ది రోజుల క్రితం జపాన్ డిప్యూటీ ప్రధాని టారొ అసో న్యూఢిల్లీలో మాట్లాడుతూ, ఆసియా-పసిఫిక్ దేశాలకు చెందిన ప్రజాస్వామ్య దేశాలు చైనాతో వేటికవే ప్రత్యేకంగా వ్యవహరిస్తున్నాయన్న మాటలో వాస్తవం ఉంది. మన ప్రధానమంత్రి కార్యాలయం ఉద్దేశం కూడా అదే సముచితమన్న భావనలో ఉన్నదేమో!
లీ మన దేశంలో పర్యటించినప్పుడు చిరునవ్వులు, ఉపశమనం కలిగించే మాటల ద్వారా ఆకట్టుకోవడానికి ప్రయత్నించారు. కానీ దీని వెనుక జపాన్, అమెరికాలనుంచి భారత్‌ను వేరు చేయాలన్న వ్యూహం దాగివున్నదనేది నిష్టుర సత్యం. సరిహద్దు విషయంలో తాను ఏదైతే స్థిరంగా భావిస్తున్నదో దాన్ని నిరోధించే అవకాశాలను వమ్ము చేయడానికే చైనా..్భరత్‌తో తేనెపూసిన కత్తి మాదిరిగా వ్యవహరించడానికి నేపథ్యం. ఈ వాదనను తిరస్కరించడమంటే, 20వ శతాబ్దపు ప్రచ్ఛన్న యుద్ధకాలంలో స్టాలిన్ అనుసరించిన విధానాన్ని మరచిపోవడమే. ఎక్కడైతే చర్చలకు తావులేదో..కేవలం సంఘర్షణ మాత్రమే పరిష్కారమో.. అక్కడ 1945 తర్వాతి కాలంలో స్టాలిన్ ఇదే విధానాన్ని ప్రోత్సహించాడు. యూరప్‌లో ఎంత వీలైతే అంత భూభాగాన్ని కాజేయడానికే ఈ ప్రణాళికను అమలు జరిపాడు! ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మన్మోహన్ సింగ్ జపాన్ పర్యటన ద్వారా ఆ దేశాన్ని అక్కున చేర్చుకోవడం ఒకవైపు, రెండో వైపు చైనాకు షేక్‌హ్యాండ్ ఇవ్వడం మరోవైపు ఎంతవరకు సంబంధాలను సమతుల్యం చేస్తాయనేది వేచి చూడాల్సిందే. ఇప్పటికే జపాన్..చైనా నుంచి తనపెట్టుబడులను ఉపసంహరించుకోవాలన్న నిశ్చయానికి వచ్చింది. దీని వెనుక ఆర్థిక రాజకీయ కారణాలున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ జపాన్‌కు మరింత పూసుకొని తిరగకుండా, ఇదే సమయంలో చైనాపై మరింత విద్వేషాన్ని పెంచుకోకుండా..ఉదార, సరళీకృత రాజకీయాలు, ఆర్థిక పరంగా సమతుల్యంగా వ్యవహరిస్తూ పథ ప్రదర్శకుడిగా మెలగాల్సిన అవసరం ఉంది.

ఫీచర్
english title: 
main feature
author: 
- కె.సి. సింగ్

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>