అమెరికన్ల జీవన విధానాన్ని, వారి ఆలోచనలను, అభిప్రాయాలను కేవలం ఆరు బడా పెట్టుబడిదారి సంస్థలు నిర్దేశిస్తున్నాయనే సత్యం ఆశ్చర్యం కలిగించినా ముమ్మాటికీ నిజం. ప్రస్తుతం అమెరికన్‌ల శ్వాస, ధ్యాస, ఆలోచనలను నియంత్రిస్తూ నిర్దేశిస్తున్నది జి.ఇ, న్యూస్‌కార్ప్, డిస్నీ, వయాకామ్, టైమ్ వార్నర్, సిబిఎస్ వంటి బడా పెట్టుబడిదారీ సంస్థలే. అమెరికా మీడియాలో 90 శాతం కేవలం ఈ ఆరు సంస్థల చేతులలోనే ఉన్నాయి. మీడియా ప్రాముఖ్యతను ఈ ఆరు బడా పెట్టుబడిదారుల సంస్థలు గుర్తించినట్టుగా ఇతరులు ఎవరూ గుర్తించలేదు. 1983లో అమెరికా మీడియా మొత్తం 50 కంపెనీల అధీనంలో ప నిచేసేవి. అదే 2011 నాటికి మీడియా యావత్తు కేవలం ఆరు సంస్థల కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయింది. జి.ఇ కంపెనీకి ప్రస్తుతం అమెరికాలో 24 టెలివిజన్ స్టేషన్లు ఉన్నాయి.కామ్‌కాస్ట్ అనే కేబుల్ నెట్‌వర్క్ ఉంది. ఎన్.బి.సి అనే శాటిలైట్ ఛానల్‌ను నిర్వహిస్తుంది. యూనివర్సల్ పేరిట అతి పెద్ద స్టుడియో కలిగి వుండడమే కాకుండా పలు హాలీవుడ్ చిత్రాలను నిర్మిస్తుంది. ఫోకస్ ఫీచర్స్ అనే శాటిలైట్ ఛానల్ కోసం పలు కార్యక్రమాలను రూపొందిస్తోంది.
న్యూస్ కార్ఫ్ సంస్థ ఫాక్స్ పేరిట బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీని, న్యూస్ ఛానల్‌ను నిర్వహిస్తున్నది. ఈ సంస్థకు 277 టెలివిజన్ స్టేషన్లు ఉన్నాయి. న్యూస్ కార్ఫ్ ప్రసారాలు అమెరికాలోని 96 శాతం గృహాలకు అందుబాటులో ఉంటాయి. ఆసియా ఖండంలో విశేష ప్రాచుర్యం పొందిన స్టార్ టీవీ దాని అనుబంధ శాటిలైట్ ఛానల్స్ న్యూస్ కార్ప్‌కు చెందినవే. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాల్‌స్ట్రీట్ జర్నల్, న్యూయార్క్ పోస్ట్ (అమెరికా), సన్ (ఇంగ్లండ్), ది ఆస్ట్రేలియా (ఆస్ట్రేలియా)లను ప్రచురిస్తున్నది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ట్వంటీయత్ సెంచరీ ఫాక్స్ అనే హాలీవుడ్ చిత్ర నిర్మాణ, పంపిణీ సంస్థలు, స్టుడియోలు న్యూస్ కార్ప్‌కు చెందినవే. ఈ సంస్థ 2010లో 875 మిలియన్ డాలర్లు పన్ను ఎగవేయడం గమనార్హం. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన డిస్నీలాండ్ సృష్టికర్తలే డిస్నీ కంపెనీ నిర్వాహకులు. డిస్నీ ఆధ్వర్యంలో ఎబిసి, ఇఎస్‌పిఎన్, ఫిక్సార్, మిరామ్యాక్స్ వంటి పలు శాటిలైట్ ఛానల్స్ పనిచేస్తున్నాయి. ఈ సంస్థ ఆధ్వర్యంలో 277 రేడియో స్టేషన్లు, ఎనిమిది టెలివిజన్ స్టేషన్లు పనిచేస్తున్నాయి. మార్వెల్ స్టుడియో పేరిట హాలీవుడ్ చిత్రాలను నిర్మిస్తున్నది. వయాకామ్ సంస్థనుంచి ఎంటివి, నిక్ జూనియర్, సిఎంటి వంటి 16 శాటిలైట్ ఛానల్స్ పనిచేస్తున్నాయి. బెట్ నెట్‌వర్క్ పేరిట కేబుల్ ప్రసారాలను అందచేస్తుంది. దీని అధీనంలో మొత్తం 160 నెట్ వర్క్‌లు పనిచేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 600 మినియన్ల మందికి ఈ సంస్థ కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయి. పారావౌంట్ పిక్చర్స్ పేరిట స్టుడియోను నిర్వహించడంతోపాటు, పలు హాలీవుడ్ చిత్రాలను నిర్మిస్తూ ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేస్తున్నది. టైమ్ వార్నర్ సంస్థనుంచి పీపుల్, టైమ్ ఎంటర్‌టైన్‌మెంట్ వీక్లీవంటి 22 పత్రికలు విడుదల అవుతున్నాయి. సిఎన్‌ఎన్, హెచ్‌బిఓ, టైమ్ వంటి శాటిలైట్ ఛానల్స్ ఉన్నాయి. కొలంబియా బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ పేరిట రేడియో ప్రసారాలను అందచేస్తుంది. వార్నర్ బ్రదర్స్ పేరిట స్టుడియోతోపాటు, పలు హాలీవుడ్ చిత్రాలను నిర్మిస్తున్నది.సిబిఎస్ సంస్థ ఆధ్వర్యంలో 29 టెలివిజన్, 130 రేడియో స్టేషన్లు పనిచేస్తున్నాయి. షోటైమ్, స్మిత్ సోసియన్, జియాపార్టీ, 60 మినిట్స్ వంటి శాటిలైట్ ఛానల్స్‌ను నిర్వహిస్తున్నది. ఈ ఆరు సంస్థలకు చెందిన మీడియాలో పనిచేస్తున్నది కేవలం 232 మంది మీడియా ఎగ్జిక్యుటివ్‌లు మాత్రమే కావడం గమనార్హం. అంటే ఈ 232 మంది మీడియా ఎగ్జిక్యుటివ్‌లు అందించే సమాచారం మీదనే 277 మిలియన్ల అమెరికన్‌లు ఆధారపడి ఉన్నారన్న మాట. ఈ ఆరు సంస్థలు కేవలం మీడియా వ్యాపారంకే పరిమితం అనుకుంటే పొరపాటే అవుతుంది. ఈ సంస్థలకు గుండుసూదినుంచి భారీ యంత్రాల వరకు తయారుచేసే పలు వ్యాపారాలు ఉన్నాయి.
అమెరికన్ల జీవన విధానాన్ని, వారి ఆలోచనలను, అభిప్రాయాలను కేవలం ఆరు బడా పెట్టుబడిదారి సంస్థలు
english title:
a
Date:
Saturday, June 1, 2013