లండన్, జూన్ 1: మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో ఇంగ్లాండ్‌పై న్యూజిలాండ్ శుభారంభం చేసింది. మార్టిన్ గుప్టిల్ అజేయ సెంచరీతో కదం తొక్కడంతో ఈ జట్టు మొదటి వనే్డలో ఇంగ్లాండ్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 227 పరుగులు సాధించింది. కెప్టెన్ అలిస్టర్ కుక్ 30, వోక్స్ 36, జొనథాన్ ట్రాట్ 37, జో రూట్ 30 చొప్పున పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో సౌథీ 37 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. మెక్‌క్లీనగన్, నాథన్ మెక్‌కలమ్ చెరి రెండు వికెట్లు కూల్చారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 46.5 ఓవర్లలో ఐదు వికెట్లకు 231 పరుగులు చేసింది. గుప్టిన్ 123 బంతులు ఎదుర్కొని, ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 103 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడం విశేషం. రాస్ టేలర్ 54 పరుగులతో రాణించడంతో కివీస్ సునాయాస విజయాన్ని నమోదు చేసి, సిరీస్‌పై 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది.
* ఇంగ్లాండ్‌పై కివీస్ గెలుపు
english title:
century
Date:
Sunday, June 2, 2013