బర్మింగ్‌హామ్, జూన్ 1: చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొంటున్న టీమిండియా శుభారంభం చేసింది. వామప్ మ్యాచ్‌లో శ్రీలంకను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక మూడు వికెట్లకు 333 పరుగుల భారీ స్కోరు చేయగా, భారత్ మరో ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అందుకుంది. విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్ సెంచరీలు సాధించి, భారత్‌ను విజయపథంలో నడిపించారు.
టాస్ గెలిచిన భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకోగా, బౌలర్లు అద్భుతంగా రాణిస్తారన్న అతని అంచనా తల్లకిందులైంది. లంక ఓపెనర్లు కుషాల్ పెరెరా, తిలకరత్నే దిల్షాన్ చెలరేగిపోయారు. కుషాల్ 94 బంతుల్లో 82, దిల్షాన్ 78 బంతుల్లో 84 పరుగులు చేసి, మిగతా బ్యాట్స్‌మెన్‌కు ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఇచ్చేందుకు రిటైర్డ్ హర్ట్ అయ్యారు. మహేల జయవర్ధనే (30), కుమార సంగక్కర (45), చండీమల్ (46) కూడా లంక భారీ స్కోరుకు సహకరించారు. మూడు వికెట్లకు లంక 333 పరుగులు సాధించగా అప్పటికి తిసర పెరరా 26, దిల్హార 6 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు.
లంక తమ ముందు ఉంచిన 334 పరుగుల లక్ష్యాన్ని అందుకోవడానికి బరిలోకి దిగిన భారత్ కేవలం ఐదు పరుగుల వద్ద శిఖర్ ధావన్ వికెట్‌ను కోల్పోయింది. అతను ఒక పరుగు చేసి దురదృష్ట వశాత్తు రనౌటయ్యాడు. అనంతరం విరాట్ కోహ్లీతో కలిసి మురళీ విజయ్ స్కోరును పెంచే ప్రయత్నం చేశాడు. అయితే అతను 30 బంతుల్లో 18 పరుగులు చేసి, షామిందా ఎరాంగ బౌలింగ్‌లో లాహిరు తిరిమానేకు చిక్కి వెనుదిరిగాడు. రోహిత్ శర్మ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేక తిసర పెరెరా బౌలింగ్‌లో నువాన్ కులశేఖర చక్కటి క్యాచ్ పట్టుకోగా అవుటయ్యాడు. 62 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన భారత్‌కు విరాట్ కోహ్లీ అండగా నిలిచాడు. సురేష్ రైనాతో కలిసి జట్టు స్కోరును వంద పరుగుల మైలురాయిని దాటించాడు. రైనా 34 పరుగులు చేసి సుచిత్ర సేనానాయకే బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ దశలో దినేష్ కార్తీక్ సాయం కోహ్లీకి లభించింది. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 186 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. 144 పరుగులు చేసిన కోహ్లీని చండీమల్ క్యాచ్ పట్టగా ఎరాంగ అవుట్ చేయడంతో 296 పరుగుల వద్ద భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. చివరిలో దినేష్ కార్తీక్, కెప్టెన్ ధోనీ 18 బంతుల్లో 41 పరుగులు జోడించి, భారత్‌ను విజయపథంలో నడిపారు. దినేష్ కార్తీక్ 81 బంతుల్లో అజేయంగా 106 పరుగులు చేయగా, ధోనీ 17 బంతుల్లో 18 పరుగులు సాధించాడు. శ్రీలంక భారీ స్కోరును చూసిన తర్వాత భారత్ విజయం అసాధ్యంగానే కనిపించింది. అయతే, తొలుత కోహ్లీ క్రీజ్‌లో నిలదొక్కుకొని సెంచరీతో జట్టు ను ఆదుకోగా, ఆతర్వాత దినేష్ కార్తీక్ అజేయ సెంచరీతో రాణించాడు. వీరిద్దరే భారత్ విజ యంలో కీలక పాత్ర పోషించాడు. బౌలర్లపై అపారమైన నమ్మకం ఉంచిన భారత కెప్టెన్ ధోనీకి నిరాశ మిగిలింది. వామప్ మ్యాచ్‌లోనే పరిస్థితి ఇలావుంటే, ఇక చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌ల్లో ఏ విధంగా ఉండవచ్చనే అనుమా నం అభిమానులను వేధిస్తున్నది. అయతే, బ్యాట్స్‌మెన్ రాణించడం అందరికీ ఊరట కలి గించే అంశం. ముఖ్యంగా కోహ్లీ ఫామ్‌లోకి రావడం శుభ సూచకం.
వామప్ మ్యాచ్‌లో శ్రీలంకపై ఐదు వికెట్ల తేడాతో టీమిండియా విజయం
english title:
india wins
Date:
Sunday, June 2, 2013