ఇస్లామాబాద్, జూన్ 1: లష్కరె తొయిబా కమాండర్ జఖ్వీర్ రెహ్మాన్ లఖ్వీ సహా ఏడుగురు పాకిస్తానీయుల ప్రమేయం ఉన్నట్టు అనుమానిస్తున్న ముంబయి దాడుల కేసు విచారణ మళ్లీ వాయిదా పడింది. కేసు విచారణకు సంబంధించి చీఫ్ ప్రాసిక్యూటర్ నియామకం జరగనందున జూన్ 15కు వాయిదా వేశారు. రావల్పిండిలోని తీవ్రవాద వ్యతిరేక కోర్టులో శనివారం కేసు విచారణకు వచ్చింది. అయితే న్యాయమూర్తి చౌదరీ హబీబ్ ఉర్ రెహ్మాన్ తదుపరి విచారణను 15కు వాయిదా వేశారు. కేసు విచారణను ఇస్లామాబాద్ కోర్టుకు బదిలీ చేయాలని దాఖలైన అభ్యర్థనపై కూడా న్యాయమూర్తి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ముంబయి దాడి కేసును చూస్తున్న చీఫ్ ప్రాసిక్యూటర్ జల్ఫీఖర్ అలీని మే 3న కొందరు కాల్చి చంపారు. ఆయన స్థానంలో ఫెడరల్ ఇనె్వస్టిగేషన్ ఏజన్సీ కొత్త ప్రాసిక్యూటర్‌ను నియమించాల్సి ఉంది. కేంద్రంలో ప్రభుత్వం మారడం వల్ల నియామకంలో జాప్యం జరిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
లష్కరె తొయిబా కమాండర్ జఖ్వీర్ రెహ్మాన్ లఖ్వీ సహా
english title:
mumbai
Date:
Sunday, June 2, 2013