న్యూఢిల్లీ, జూన్ 3: యాసిడ్ దాడిలో మృతిచెందిన బాధితురాలి కుటుంబ సభ్యులకు మహారాష్ట్ర ప్రభుత్వం కేవలం 2 లక్షల రూపాయల పరిహారం ప్రకటించడంపై బిజెపి సీనియర్ నేత సుష్మా స్వరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది యాసిడ్ దాడి బాధితులను అవమానించడమేనని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ముంబయిలో కొత్తగా నర్సు ఉద్యోగంలో చేరేందుకు మే నెల 2న ప్రీతి రాఠి (23), ఆమె తండ్రితో కలిసి ఢిల్లీ నుంచి రైలులో ముంబయికి బయలుదేరింది. బాంద్రా టెర్మినస్‌లో దిగిన అనంతరం ప్రీతి రాఠిపై దుండగుడు జరిపిన యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడింది. ముంబయిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది. ఇలావుండగా ప్రీతి మృతదేహం సోమవారం ఢిల్లీ చేరుకుంది. తమ కుమార్తె మృతికి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ప్రీతి కుటుంబ సభ్యులు మహారాష్ట్ర హోం మంత్రి ఆర్.ఆర్. పాటిల్‌కు ఆదివారం విజ్ఞప్తి చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున పాటిల్ రెండు లక్షల పరిహారాన్ని అందజేస్తామని ప్రకటించారు. ఈ కేసును సిబిఐకి అప్పగించామని, దాడికి పాల్పడినవారిని వదిలేది లేదని పాటిల్ స్పష్టం చేశారు.
2 లక్షల పరిహారంపై సుష్మా స్వరాజ్ ఆగ్రహం
english title:
sushma
Date:
Tuesday, June 4, 2013