హైదరాబాద్, జూన్ 5: అహోరాత్రులు పట్టుదల, దీక్షతో లక్ష్యాన్ని గురిపెట్టి అనుకున్నది సాధించిన ఎమ్సెట్ టాపర్ల మనోభావం సమాజ సేవ, పేదరిక నిర్మూలన, ఉన్నత స్థాయి పదవులను అధిష్టించి సమాజంలో ఎంతో కొంత మార్పు తీసుకురావలనే తపన పడుతున్నట్టు టాపర్లు వ్యాఖ్యానించారు. మెడిసిన్ విభాగంలో టాపర్‌గా నిలిచిన వివి వినీత్ తాను మంచి వైద్యుడిగా పేరు తెచ్చుకుని పేదవారికి ఉన్నత ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందించాలన్నదే లక్ష్యంగా చెప్పగా, ఇంజనీరింగ్‌లో టాపర్‌గా నిలిచిన పి సాయి సందీప్ రెడ్డి మాత్రం మంచి యూనివర్శిటీలో ఇంజనీరింగ్ కోర్సులో చేరి ఐఎఎస్‌కు హాజరై కలెక్టర్ కావాలనే లక్ష్యాన్ని వ్యక్తం చేశాడు. విజయవాడకు చెందిన రోహిత్‌కుమార్ వెనుకోటి మెడిసిన్‌లో రెండో ర్యాంకు సాధించగా, ఎం. జగదీష్ రెడ్డి మూడో ర్యాంకు సాధించాడు. ఇద్దరూ చైతన్య నారాయణ మెడికల్ అకాడమిలో చదివిన వారే. విశాఖపట్టణానికి చెందిన ఎస్ ఎస్ కె వెంకటేష్ నాలుగో ర్యాంకు, వరంగల్ ఖాజీపేటకు చెందిన చెకూరి రిత్విక్ ఐదో ర్యాంకు సాధించాడు. కర్నూలు సిరివెల్లం మండలానికి చెందిన అవుతు ప్రవీణా ఆరో ర్యాంకు సాధించగా, వరంగల్ హనుమకొండకు చెందిన నోముల గౌతం రెడ్డి ఏడో ర్యాంకు సాధించాడు. విజయవాడ శ్రీ చైతన్య నారాయణ మెడికల్ అకాడమికి చెందిన సాయినాధం చిరంజీవి 8 వ ర్యాంకు సాధించగా, హైదరాబాద్ పంజాగుట్టకు చెందిన సూరపనేని ప్రజ్ఞ 9వ ర్యాంకు సాధించింది. హైదరాబాద్ అమీర్‌పేటకు చెందిన కలవపూడి సుకుమార్ 10వ ర్యాంకు సాధించాడు.
ఇక ఇంజనీరింగ్ విభాగంలో ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన పి సాయి సందీప్‌రెడ్డి తొలి ర్యాంకు సాధించగా, రెండో ర్యాంకును విశాఖ చైతన్య విద్యాసంస్థకు చెందిన గ్రంథి సృజన్‌రాజ్, మూడో ర్యాంకు విజయవాడ చైతన్య నారాయణ అకాడమికి చెందిన కోరగంజి గోకుల్, గుంటూరు బ్రాడిపేటకు చెందిన కాటూరి సాయి కిరణ్ నాలుగో ర్యాంకు సాధించాడు. విశాఖపట్టణం ఆసీల్‌మెట్టకు చెందిన వై జ్యోత్స్న ఐదో ర్యాంకు సాధించగా, హైదరాబాద్ రామాంతపూర్‌కు చెందిన వి వంశీకృష్ణ ఆరో ర్యాంకు సాధించాడు. మిర్యాలగూడ బంగారుగడ్డకు చెందిన వేగుళ్ల క్రాంతి ఏడో ర్యాంకు, ఖమ్మం రాజేశ్వరపురానికి చెందిన కందుల దినేష్ 8వ ర్యాంకు సాధించాడు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌కు చెందిన ఎ రవిచంద్ర 9వ ర్యాంకు సాధించగా, తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన బి. గౌరీశంకర్‌కు 10వ ర్యాంకు వచ్చింది.
టాపర్లు వీరే
మెడిసిన్
ర్యాంకు పేరు మార్కులు వెయిటేజీ
1 వి వెంకట వినీత్ 158 99.06
2 రోహిత్‌కుమార్ ఎనుకోటి 157 98.55
3 ఎం.జగదీష్‌రెడ్డి 157 98.51
4 ఎస్‌ఎస్‌కె వెంకటేష్ 156 98.13
5 చేకూరి రిత్విక్ 156 98.00
6 అవుతుప్రవీణ్ 155 97.66
7 ఎన్ గౌతమ్‌రెడ్డి 155 97.61
8 సాయినాధం చిరంజీవి 155 97.57
9 ఎస్ ప్రజ్ఞ 155 97.53
10 సుకుమార్ కలవపూడి 155 97.45
ఇంజనీరింగ్
ర్యాంకు పేరు మార్కులు వెయిటేజీ
1 పి.సాయి సందీప్ 154 97.06
2 గ్రంథి సృజన్‌రాజు 152 96.25
3 కె గోకుల్ 152 96.17
4 కాటూరి సాయి కిరణ్ 151 95.78
5 వై జ్యోత్స్న 151 95.78
6 వి వంశీకృష్ణ 152 95.75
7 వి క్రాంతి 151 95.74
8 కె.దినేష్ 151 95.70
9 ఎ.రవిచంద్ర 151 95.66
10 బి.గౌరీశంకర్ 151 95.61
రేపు ఓయు
డిగ్రీ ఫలితాలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 5: ఉస్మానియా యూనివర్శిటీ ఆధీనంలోని డిగ్రీ ఫలితాలను 7వ తేదీ ఉదయం 11.30 గంటలకు విడుదల చేస్తున్నట్టు పరీక్షల కంట్రోలర్ ప్రొఫెసర్ టి భిక్షమయ్య తెలిపారు. ఫలితాలను వర్శిటీ విసి ప్రొఫెసర్ ఎస్ సత్యనారాయణ విడుదల చేస్తారని ఆయన పేర్కొన్నారు.
‘కిలాడి’ సంధ్యపై కేసు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 5: ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలను ఇప్పిస్తామని చెబుతూ నిరుద్యోగుల నుంచి లక్షలాది రూపాయలు సొమ్ముచేసుకున్నట్లు వచ్చిన ఆరోపణలతో భీమవరంకు చెందిన కిలాడీ సంధ్యపై హైదరాబాద్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషనరేట్‌లో తనకు పలుకుబడి ఉందని చెప్పి డబ్బులు వసూళ్లు చేస్తోందని బుధవారం మీడియాలో రావడంతో సంబంధిత ఉన్నతాదికారులు వెంటనే స్పందించారు. దీంతో ఎపిపిఎస్‌సికు చెందిన అధికారులు హైదరాబాద్ సిసిఎస్ డిప్యూటీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఇలా ఉండగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలను రద్దు చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించినట్లు వచ్చిన వార్తలను ముఖ్యమంత్రి కార్యాలయం ఖండించింది. కాగా పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు చెందిన సభ్యుడు సీతారామరాజుతో పాటు సంధ్యను పట్టుకోవడానికి సిసిఎస్ పోలీసులు రెండు బృందాలను ఏర్పాటు చేశారు.
7న మంత్రివర్గ భేటీ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 5: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 7న సాయంత్రం నాలుగు గంటలకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.కె. మహంతి ఒక నోట్ జారీ చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డి.ఎల్. రవీంద్రారెడ్డిని మంత్రి పదవి నుండి తొలగించిన తర్వాత జరుగుతున్న మొదటి మంత్రివర్గ సమావేశం ఇది. డిఎల్‌ను తొలగిస్తూ, సిఎం తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. డిఎల్ తొలగింపుపై మంతివర్గ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. డిప్యూటీ ముఖ్యమంత్రి రాజనర్సింహ ఈ అంశంపై సమగ్ర చర్చ జరగాలని పట్టుబట్టే అవకాశం ఉన్నట్టు తెలిసింది.