Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

సముద్రంలో వేటకి వెళ్లి జాలరి గల్లంతు

$
0
0

శింగరాయకొండ, జూన్ 7: సముద్రంలో వేటకి వెళ్లి ఓ జాలరి గల్లంతై, మరో ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరిన సంఘటన శుక్రవారం మధ్యాహ్నం ప్రకాశం జిల్లా శింగరాయకొండ మండల పరిధిలో జరిగింది. మత్స్యకారులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని ఊళ్లపాలెం పంచాయతీ బేసిన్‌పల్లెపాలెంకు చెందిన వాటుపల్లి అంజయ్య, గొల్లపోతు భుజంగరావు, పొన్నాడి సుధాకర్, నాయుడు నాగరాజు అనే నలుగురు మత్స్యకారులు గురువారం రాత్రి సముద్రంలో వేటకు బయలుదేరారు. సముద్రంలో పది కిలోమీటర్ల మేర లోపలికి వెళ్లిన అనంతరం వలలతో చేపలు పడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు బోటుకి రంధ్రం పడి ఆకస్మాత్తుగా బోటులోకి నీరుచేరడంతో నలుగురు బోటుతో వెనుదిరిగారు. అయితే మధ్యలోనే బోటు పూర్తిగా మునిగిపోవడంతో నలుగురిలో వయస్సులో పెద్దవాడైన వాటుపల్లి అంజయ్య (55) ఈదలేక మధ్యలోనే గల్లంతైనట్లు సురక్షితంగా బయట పడిన మత్స్యకారులు తెలిపారు. మిగిలిన ముగ్గురు ఈదుకుంటూ శుక్రవారం మధ్యాహ్నం ఉలవపాడు మండలం కరేడు తీర ప్రాంతానికి సురక్షితంగా చేరుకున్నారు. గల్లంతైన జాలరి కోసం మత్స్యశాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం తెలుసుకున్న తహశీల్దార్ అంబటి వందనం మత్స్యకారులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

విలాసాలకు దూరంగా ఉండి
పట్టుదలతో చదవకపోతే భవిష్యత్ ప్రశ్నార్థకం
సీనియర్ సివిల్ జడ్జి మోహన్‌కుమార్
ఒంగోలు , జూన్ 7 : విలాసాలకు దూరంగా ఉండి పట్టుదలతో విద్యను అభ్యసించకపోతే విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని సీనియర్ సివిల్ జడ్జి మోహన్‌కుమార్ హెచ్చరించారు. ఉజ్వల భవిష్యత్ కోసం విద్యార్థులు ఉత్తమ కోర్సులు ఎంపిక చేసుకోవాలని సూచించారు. బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సంస్థ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరే విద్యార్థుల కోసం శుక్రవారం స్వాతి కల్యాణ మండపంలో అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు బ్రిలియంట్ సంస్థ అధినేత న్యామతుల్లా బాషా అధ్యక్షత వహించారు. ముఖ్య అతిధిగా హాజరైన జడ్జి మోహన్ కుమార్ మాట్లాడుతూ నేటి కంప్యూటర్ యుగంలో పోటీతత్వం పెరిగి పోయిందని ఈ నేపధ్యంలో విద్యార్థులు ఉజ్వల భవిష్యత్ కోసం ఎంపిక చేసుకోవాల్సిన విద్య, కోర్సుల బాధ్యత యువత చేతుల్లోనే ఉందన్నారు. పట్టుదల లేకపోతే భవిష్యత్తే లేదన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా , మంచికి దగ్గరగా ఉండాలని విద్యార్థులకు పిట్టకధ రూపంలో చక్కగా వివరించారు. ఆత్మీయ అతిధులుగా హాజరైన జెయన్‌టియు కాకినాడ యూనివర్సిటీ ఫ్రోఫెసర్స్ యువి రత్నకుమారి, డి నీలమ ఇంజనీరింగ్ కోర్సుల ప్రత్యేకతలు, వాటి బహుళ ప్రయోజనాలు అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. త్వరలో ఒంగోలులో జెయన్‌టియు శాఖను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వెయ్యి మంది విద్యార్థులను పెద్ద ఎత్తున సమీకరించి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినందుకు సంస్థ అధినేతను అభినందించారు. గౌరవ అతిధులుగా హాజరైన టి రవి కుమార్, వెల్ విషర్ శంకర్ విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌పై అవగాహన కల్పించాలరు. అధ్యక్షత వహించిన న్యామతుల్లా బాషా మాట్లాడుతూ బ్రిలియంట్ సంస్థ విద్యార్థుల ప్రగతి కోసం ఎల్లప్పుడూ నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుందన్నారు. త్వరలో వెబ్ కౌన్సిలింగ్ పై అవగాహన కల్పించడం కోసం మెగా సెమినార్‌ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలు, యూనివర్సిటీ సీనియర్ ఫ్రొఫెసర్స్ పాల్గొంటారని, భారీగా స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

రైతు సంఘం రాష్ట్ర 20వ మహాసభలకు
ముస్తాబవుతున్న ఒంగోలు
ఏర్పాట్లలో నిమగ్నమైన కార్యకర్తలు
మహాసభల నిర్వహణకు 10 బృందాల ఏర్పాటు
ఒంగోలు, జూన్ 7 : ఒంగోలులోని సాయి గార్డెన్స్‌లో ఈనెల 9, 10, 11 తేదీల్లో నిర్వహించే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 20వ రాష్ట్ర మహాసభలకు ఒంగోలు నగరం ముస్తాబవుతుంది. రాష్ట్రంలోని అన్నీ జిల్లాల నుండి వస్తున్న రైతు ప్రతినిధులకు స్వాగతం పలుకుతూ ప్లెక్సీలు, తోరణాలను అలంకరిస్తున్నారు. ఈపాటికే రైల్వేస్టేషన్, నెల్లూరు బస్టాండ్, చర్చి సెంటర్ , అద్దంకి బస్టాండ్ సెంటర్, ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ కూడళ్ళల్లో ఎర్ర తోరణాలతో మస్తాబు చేశారు. నగరంలోని ప్రధాన కూడళ్ళల్లో రైతు సంఘం రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయాలంటూ పెద్దపెద్ద ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. గత 10 రోజులుగా మహాసభలు విజయవంతం చేయాలంటూ నగరంలోని అన్నీ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి లక్ష కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇదిలా ఉండగా రాష్ట్ర మహాసభల విజయవంతం కోసం పది టీములు ఏర్పాటు చేశారు. ఈ మహాసభలకు వచ్చే ప్రతినిధులకు వసతులు కల్పించడానికి జి శ్రీనివాసులు, భోజనాలు ఏర్పాట్ల కోసం చీకటి శ్రీనివాసరావు, హాల్ ఏర్పాట్ల కోసం కంకణాల ఆంజనేయులు, ముగింపు సందర్భంగా జరుగు బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్ల కోసం జివి కొండారెడ్డి, నగరంలో అలంకరణ కోసం డి వెంకట్రావు, ర్యాలీ నిర్వహణ కొరకు పి హనుమంతరావు, కళా రూపాలు ప్రదర్శనల కోసం వెల్లంపల్లి ఆంజనేయులను కన్వీనర్లుగా టీములు ఏర్పాటు చేశారు. వీటితోపాటు మెడికల్ , బుక్ స్టాల్స్‌కు సంబంధించిన టీములను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ టీములన్నీ గత వారం రోజులుగా విస్తృతంగా మహాసభల విజయానికి కృషి చేస్తున్నాయి.

రెండు మోటారు సైకిళ్లు ఢీకొని
ముగ్గురికి గాయాలు
పుల్లలచెరువు, జూన్ 7: ఎదురెదురుగా వస్తున్న రెండు మోటారు సైకిళ్లు ఢీకొని ముగ్గురు గాయాలపాలైన సంఘటన శుక్రవారం మండలంలోని పిడికిటివారిపల్లె గ్రామసమీపంలో చోటుచేసుకుంది. వివరాల మేరకు మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన ఆవుల సుబ్బారెడ్డి, రామలింగయ్య ఎర్రగొండపాలెం నుండి మోటారుసైకిల్‌పై కొత్తూరు వస్తుండగా గంగవరం గ్రామానికి చెందిన వారు మరో మోటారు సైకిల్‌పై ముగ్గురు వస్తుండగా మార్గమధ్యంలోని పిడికిటివారిపల్లె గ్రామసమీపంలో ఎదురుగా ఢీకొనటంతో కొత్తూరు గ్రామానికి చెందిన ఆవుల సుబ్బారెడ్డికి తీవ్రగాయాలై కాలు విరిగిపోయింది. మరో ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. సుబ్బారెడ్డి పరిస్థితి విషమించటంతో 108 సహాయంతో ఎర్రగొండపాలెం తరలించి అక్కడ నుండి మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట తరలించారు. మరో ఇద్దరిని ఎర్రగొండపాలెంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
వెలుగొండ ప్రాజెక్ట్ సొరంగ పనులు పరిశీలించిన జెసి
పెద్దదోర్నాల, జూన్ 7: మండలంలోని కొత్తూరు గ్రామం వద్ద జరుగుతున్న పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ రెండవ సొరంగ పనులను శుక్రవారం ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ యాకోబ్‌నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా కోస్టల్ ప్రతినిధి శివనారాయణ ఏర్పాటు చేసిన లోకల్ ట్రైన్‌లో రెండవ సొరంగంలోకి వెళ్లి టనె్నల్ బోర్ మిషన్‌ను, పరికరాలను పరిశీలించారు. మిషన్ పనితీరు, యంత్రాల పరికరాలను, సొరంగాన్ని జెసి పరిశీలించారు. అయితే కొల్లంవాగుకు 18 కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని తవ్వాల్సి ఉండగా, 8.827 కిలోమీటర్లు తవ్వారు. రెండవ సొరంగం 7.915 కిలోమీటర్ల దూరం తవ్వారని జెసికి వివరించారు. వీరి వెంట సిఇఓ గంగాధర్‌గౌడ్, ఆర్డీవో ఎం రాఘవరావు, ఎన్‌ఎస్‌బి కోస్టల్ ఇన్‌చార్జి రామ్మోహనరావు, ప్రాజెక్ట్ మేనేజర్ శివనారాయణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గ్లోరియా, ఇఇ భూషణబాబు, డిఇలు విజయలక్ష్మి, ప్రసాదు, ప్రేమకుమార్, ఎఇలు వెంకటకృష్ణ, మల్లికార్జున,శ్రీనివాసరావు, సంజీవకుమార్, దోర్నాల ఎమ్మార్వో రాజరాజేశ్వరి, మార్కాపురం ఎమ్మార్వో షరీఫ్ తదితరులు ఉన్నారు.

- మరో ముగ్గురు సురక్షితం -
english title: 
fishing

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>