కర్నూలు, జూన్ 7: జిల్లాలో పాఠ్య పుస్తకాల కొర త ఏర్పడింది. జిల్లాకు 26,56,121 పుస్తకాలు అవసరం వుం డగా ఇప్పటికి కేవలం 9,90,145 పుస్తకాలు మాత్రమే వచ్చా యి. ఇందులో గత ఏడాది మిగిలిన పుస్తకాలు 65,472 పుస్తకాలతో కలిపి మొత్తం 10,55,617 పుసకాలు మాత్రమే వున్న ట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 51 మండలాలకు పుస్తకాలు చేరాయి. మొత్తం 100 శాతంలో కేవలం 37.28 శాతం మాత్రమే పంపిణీ పూర్తయింది. మరో రెండు రోజు ల్లో మిగిలిన రెండు మండలాలకు జిల్లాలో వున్న పుస్తకాలు చేరే అవకాశం వుంది. ఈ ఏడాది 4,5,8,9 తరగతులకు పా ఠ్యపుస్తకాలు మారడంతో సరైన సమయానికి హైదరాబాద్ నుంచి జిల్లాకు పుస్తకాలు అందలేదని తెలుస్తోంది. పాఠశాలలు ఈ నెల 12వ తేదీ పునఃప్రారంభం కానున్నాయి. పాఠశాలల ప్రారంభం నాటికి పుస్తకాలు విద్యార్థుల చేతుల్లో వుండేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పినప్పటికీ దాన్ని నెరవేర్చడంలో విఫలమయ్యారు. ఇంకా జిల్లాకు 16,65,976 పుస్తకాలు రావాల్సి వుంది. రాష్ట్ర సిలబస్‌కు అనుగుణంగా ఈ ఏడాది నుంచి ప్రారంభమయ్యే మోడల్ స్కూళ్లకు కూడా అధికారులు పుస్తకాలను పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో ఇంకా 62.12 శాతం పుస్తకాలు పంపిణీ కావాల్సి వుంది. ముఖ్యంగా పదవ తరగతి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అవసరం వుండగా ఇంత వరకూ సగానికి పైగా పుస్తకాలు రాకపోవడం పట్ల ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించారని, ఈ ఏడాది గత ఏడాది రికార్డును బద్దలకొట్టేలా విద్యార్థులకు తర్ఫీదు ఇస్తామని ఉపాధ్యాయులు ఉత్సహంగా వుండగా పుస్తకాలు సకాలంలో జిల్లాకు రాకపోవడం వల్ల వారు నిరుత్సాహానికి గురికావాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది పలు మండలాల్లో పుస్తకాలు ఆలస్యంగా రావడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే.
కోవెలకుంట్ల ఖ్యాతిని ఢిల్లీకి
చాటిన మహనీయుడు బివి
కోవెలకుంట్ల, జూన్ 7: కోవెలకుంట్ల ఖ్యాతిని ఢిల్లీ వరకూ తీసుకెళ్లిన ఘనత మాజీ స్పీకర్, ఉపముఖ్యమంత్రి బివి సుబ్బారెడ్డిదే అని, ఆయన మనవడు కోవెలకుంట్ల మాజీ సర్పంచ్ బివి నాగార్జున రెడ్డి పేర్కొన్నారు. సుబ్బారెడ్డి వర్ధంతి సందర్భంగా శుక్రవారం స్థానిక పబ్లిక్ పార్కులోని ఆయన విగ్రహానకి ఆయన కుటుంబీకులు, పట్టణ ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాడు ఎన్నికల్లో రెండు సార్లు ఏకగ్రీవంగా ఎన్నికైన ఘనత ఆయనకే దక్కిందని, అలాగే 8 సంవత్సరాలు సభాపతిగా, రెండు పర్యాయాలు ఉప ముఖ్యమంత్రిగా పదవులు చేపట్టారని, దీంతో ఈ ప్రాంతం ఖ్యాతి ఢిల్లీ వరకూ చేరిందన్నారు. అలాగే జై ఆంధ్ర ఉద్యమం రూపకర్త కూడా అయిన బివి పేరు ఈ ప్రాంతంలో అవుకు రిజర్వాయర్‌కు పెట్టడం సమంజసమే అన్నారు. ఇప్పటికైనా ఆయన సేవలు గుర్తించి రిజర్వాయర్‌కు బివి పేరు పట్టినందుకు హర్షం వ్యక్తం చేశారు. అలాగే రిజర్వాయర్ వద్ద బివి సుబ్బారెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి గడ్డం రామకృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ కానాల చంద్రశేఖరరెడ్డి, బివి వేణుగోపాల్‌రెడ్డి, బి.సూర్యనారాయణరెడ్డి, కోవెలకుంట్ల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవీంద్రనాధరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, గాండ్ల పుల్లయ్య పాల్గొన్నారు.
గురుకులంలో ఇంటర్
ప్రవేశానికి కౌనె్సలింగ్
కర్నూలుటౌన్, జూన్ 7: నిరుపేద విద్యార్థుల కోసం ప్రభుత్వం వేల కోట్ల రుపాయలు ఖర్చు చేస్తూ గురుకుల కళాశాలలను నడిపిస్తుంది. ఈ కళాశాలలో చదివేందుకు 2013-14 విద్యా సంవత్సరానికి శుక్రవారం చిన్నటేకూరు గురుకుల కళాశాలలో ప్రిన్సిపాల్ ఓబులేసు ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూలో సి.బెళగల్, అరికెర, జూపాడుబంగ్లా కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఓబులేసు మట్లాడుతూ 3 కళాశాలల్లో ఎంపిసి-80, బైపిసి-80, సిఇసి- 80 సీట్లకు గానూ 896 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా ఇంటర్వ్యూలు నిర్వహించామన్నారు. ఇంటర్వ్యూలో విద్యార్థి వద్ద ఏ సర్టిపికెట్ లేకున్నా ఎంపిక చేయలేదన్నారు. దరఖాస్తు తీసుకునే సమయంతోనే ఒరిజనల్ సర్ట్ఫికెట్లతో హాజరవ్వాలని సూచించామన్నారు. విద్యార్థులను గ్రేడ్ ప్రకారం ఎంపిక చేశామని ఎస్సీ 87 శాతం, ఎస్టీ 6 శాతం, బిసి 5 శాతం, ఓసి 2 శాతం ప్రకారం హాస్టళ్లలో చదువుకున్న విద్యార్థులను ఎంపిక చేశామన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు రౌత్, మోహన్, బలరాముడు, చంద్రశేఖర్, ఓబయ్య పాల్గొన్నారు. అయితే 10 తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించినప్పటకీ ఒరిజినల్ సర్ట్ఫికెట్లు లేని విద్యార్థులు కొందరు నిరాశతో వెనుదిరిగారు. తర్వాత ఒరిజినల్ సర్ట్ఫికెట్లు అందజేస్తామని అధికారులను వేడుకున్నా ఫలితం లేకపోయింది.