Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

పాఠ్యపుస్తకాలు పంపిణీకి సిద్ధం:డిఇఓ

$
0
0

నంద్యాల, జూన్ 7: కర్నూ లు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలు తెరవగానే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని, 9లక్షల 30వేల పుస్తకాలు ఇప్పటికే ఆయా కేంద్రాలకు తరలించామని జిల్లా విద్యాశాఖాధికారి నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం నంద్యాల మం డలం పొన్నాపురం గ్రామంలో జరిగిన విద్యాసంబరాల ర్యాలీలో డిఇఓ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ జిల్లాకు 26లక్ష 30వేల పా ఠ్యపుస్తకాలు అవసరం కాగా, ప్ర భుత్వం వీటిని మూడు విడతలుగా అందిస్తోందని, మొదటి విడతగా ఇప్పటికే 9లక్షల 30వేల పాఠ్యపుస్తకాలు వచ్చాయన్నారు. ఈనెల 13వ తేదీలో గా స్కూలు యూనిఫారంలు విద్యార్థులకు అందిస్తామన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్యం పనులకు జిల్లా కలెక్టర్ ఒక్కోక్క పాఠశాలకు వెయ్యి రూపాయలు మంజూరు చేశారని, ప్రైవేటు పాఠశాలలకు ఉన్న టెక్నో, సెమ్, కా నె్సప్ట్ తదితర పేర్లు వెంటనే తొలగించాలని డిఇఓ ఆదేశించారు. మధ్యాహ్న భోజనం సక్రమంగా అందించాలన్నా రు. పాఠశాలలకు ఉపాధ్యాయులు సక్రమంగా వెళ్లాలని, లేకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. జిల్లాలో 32 మోడల్ పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. నంద్యాల డివిజన్‌లోని అన్ని ఉన్నత పాఠశాలల్లో పదవతరగతి పబ్లిక్ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించారని ఆయన సంతోషం వ్య క్తం చేశారు. విద్యాహక్కు చట్టం క్రింద ప్రైవేటు పాఠశాలల్లో 25శాతం పేద విద్యార్థులకు అడ్మిషన్లు చేసేందుకు అ వసరమైన అనుమతులు ఇంకా రాలేద ని డిఇఓ వివరించారు. బడిఈడు పిల్లలను బడుల్లో చేర్పిస్తామని, తల్లిదండ్రులు కూడా సహకరించాలని ఆయన కోరారు. స్వచ్చంద సంస్థలు కూడా బడిఈడు పిల్లలను గుర్తించి బడుల్లో చేర్పిస్తే ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఉంటాయన్నారు. ఎమ్మార్సీ భవనంలోని రికార్డులు పరిశీంచారు. డిప్యూటీ డిఇఓ తహేరాసుల్తాన్ మాట్లాడుతూ డివిజన్‌లోని అన్ని పాఠశాల్లో విద్యాసంబరాలు విజయవంతం చేస్తున్నామ ని, ఈ నెల 12 నుంచి సామూహిక అ క్షరాభ్యాసం చేస్తున్నామని వివరించా రు. వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని, నంద్యాల మండలానికి 18,760 మందికి స్కూలు యూనిఫారంలు, 26,690 పాఠ్యపుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, రెండు, మూడు విడతలుగా పాఠ్యపుస్తకాలు అందిస్తామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఇఓ ఆనందప్రభాకర్, వెంకటేశ్వర్లు, దానమయ్య, తదితరులు పాల్గొన్నారు.

రూ. 99కే 9 రకాల కూరగాయలు
* రైతుబజార్‌లో విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్
కర్నూలు, జూన్ 7: కూరగాయల ధరలు ఆకాశన్నంటుతున్న తరుణంలో నిరుపేదలకు తక్కువ ధర కు అందజేయడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రూ. 99 కే 9 రకాల కూరగాయల విక్రయ కేంద్రాన్ని శుక్రవారం కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి ప్రారంభించారు. నగరంలోని సి.క్యాంపు రైతుబజార్‌లో కర్నూలు మార్కెటింగ్‌శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని కలెక్టర్ జెసి కన్నబాబుతో కలిసి ప్రారంభించి వినియోగదారులకు కూరగాయల కిట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్కెటింగ్ శాఖ రూ. 140 విలువ చేసే తాజా కూరగాయలను కేవలం రూ. 99కే ఇస్తుందని, దీని వల్ల పేద, మధ్య తరగతి ప్రజలకు రూ. 50 ఆదా కావడమే కాకుండా బాగా ఉపయోగకరంగా వుంటుందన్నారు. కూరగాయల సాగు విస్తీరం తగ్గి కూరగాయల ధరలు విపరీతంగా పెరగడం వల్ల మార్కెటింగ్ శాఖ తరుపున నేరుగా రైతులతో కొనుగోలు చేసి తక్కువ ధరకే వినియోగదారులకు అందజేస్తుందన్నారు. ఈ కేంద్రాన్ని నిరంతరం కొనసాగించడానకి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందులో టమోటాలు కిలో, ఉల్లిగడ్డలు కిలో, ఆలుగడ్డలు అర కిలో, వంకాయలు అర కిలో, బెండకాయలు అర కిలో, దొండకాయలు అర కిలో, పచ్చిమిరపకాయలు పావు కిలో, మునక్కాడలు-4, ఆకుకూరలు 5 కట్టలు అందిస్తామన్నారు. అనంతరం కర్నూలు జిల్లా పౌర సరఫరాల శాఖ సి.క్యాంపు రైతుబజార్‌లో మిల్లర్ల సహకారంతో తగ్గింపు ధరకే నిత్యావసరాల సరుకులు అందిస్తోన్న విక్రయ కేంద్రాన్ని జెసి, కలెక్టర్ తనిఖీ చేశారు. వినియోగదారులకు అందిస్తున్న సోనామసూరి బియ్యం ఒక రకం కిలో రూ. 31, మరో రకం కిలో రూ. 33 లకు విక్రయిస్తుండగా తూకాలను పరిశీలించి, బియ్యం విక్రయాలపై ఆరా తీశారు. కలెక్టర్ వెంట మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు వెంకటేశ్వరరెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి బహదూర్‌సాహెబ్, ఉద్యానశాఖ సహాయ సంచాలకులు రాజానాయక్, సతీష్ ఉన్నారు.

పాఠశాలల్లో అధిక ఫీజులు
వసూలు చేస్తే చర్యలు
* కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి హెచ్చరిక
కర్నూలు స్పోర్ట్స్, జూన్ 7: జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ప్రవేశ రుసుము, ఇతర ఫీజుల కింద అధిక మొత్తాలు వసూలు చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి హెచ్చరించారు. అధిక ఫీజుల వసూలుపై ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో శుక్రవారం కలెక్టరేట్‌లో డిఇఓ నాగేశ్వరరావుతో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహించడం నిబంధనలకు విరుద్దమని, ప్రవేశ రుసుము వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనలకు విరుద్దంగా ప్రవేశ రుసుము వసూలు చేసే విద్యాసంస్థలను డిప్యూటీ డిఇఓలు తనిఖీ చేయాలని ఆదేశించారు. అధిక డోనేషన్లు వసూలు చేసినట్లయితే తల్లిదండ్రులు టోల్ ఫ్రీ నెంకు ఫిర్యాదు చేయాలన్నారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం గుర్తింపు లేని పాఠశాలలను మూసి వేయాలని, ఒక పాఠశాలకు అనుమతి తీసుకుని అదనపు పాఠశాల నిర్వహిస్తే చర్యలు తప్పవన్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ ఉత్తర్వులు నెంబర్ 1 ప్రకారం పాఠశాలలు నడిచేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డిఇఓలకు కలెక్టర్ సూచించారు. చట్ట ప్రకారం అర్థ కిలో మీటర్ పరిధిలో పాఠశాల, పాఠశాలకు వ్యత్యాసం వుండాలని, అలాగే పాఠశాల పరిధిలో ఇతర స్కూళ్లు అభ్యంతర ధ్రువపత్రం లేని స్కూళ్లను పరిశీంచాలని డిఇఓను ఆదేశించారు. సమావేశంలో కర్నూలు, ఆదోని డిప్యూటీ డిఇఓలు శైలజ, పాండురంగస్వామి, విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఎరువుల కొరత రానివ్వం..
* సొసైటీ చైర్మన్ విశ్వనాథరెడ్డి
ఉయ్యాలవాడ, జూన్ 7: మండల పరిధిలోని రైతులకు సొసైటీ ద్వారా రసాయనిక ఎరువుల కొరత రానివ్వమని ఉయ్యాలవాడ సొసైటీ చైర్మన్ బుడ్డా విశ్వనాథరెడ్డి పేర్కొన్నారు. సొసైటీ కేంద్రంలో శుక్రవారం పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సొసైటీకి ఇఫ్‌కో కంపెనీకి చెందిన 20:20 రకం 10 టన్నులు, 10:26 రకం 10 టన్నులు సరఫరా అయ్యాయని తెలిపారు. 20:20 రకం 50 కిలోల బస్తా రూ. 880, 10:26 రకం 50 కిలోల బస్తా రూ. 1080లుగా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే విక్రయిస్తామని ఆయన తెలిపారు. సొసైటీ పరిధిలోని గ్రామాలకే కాకుండా మండలంలోని ప్రతి గ్రామానికి చెందిన ప్రతి రైతుకు రసాయనిక ఎరవులు అందించేందుకు సిద్ధంగా వున్నామన్నారు. కార్యక్రమంలో సిఇఓ రాముడు, నరసింహుడు పాల్గొన్నారు.

కర్నూ లు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలు తెరవగానే
english title: 
deo

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>