సుజిత్, ప్రగ్య జైస్వాల్, ఎరికా ఫెర్నాండెజ్ ముఖ్య తారలుగా సుజిత్ ఆర్ట్ కమర్షియల్స్ పతాకంపై సి.కళ్యాణ్ సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం ‘డేగ’. ఈ చిత్రానికి కుమార్ రావిళ్ళ దర్శక, నిర్మాత. ధరన్‌కుమార్ సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రానికి సంబంధించిన పాటలు విడుదలయ్యాయి. దర్శకుడు వి.వి.వినాయక్ ఆడియో సీడీని ఆవిష్కరించి హీరో శ్రీకాంత్‌కు అందజేశారు. ఈ సందర్భంగా సమర్పకులు సి.కళ్యాణ్ మాట్లాడుతూ- ‘‘ తమిళంలో కోటిన్నర పెట్టి తీస్తున్న సినిమాలు 5కోట్లు వసూలు చేస్తున్నాయి. ఈ వరవడి మన తెలుగులో కూడా రావాలి. గత రెండేళ్లుగా డబ్బింగ్ చిత్రాల పేరుతో దాదాపు 10 నుంచి 12 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాను. మనల్ని మనమే ప్రోత్సహించుకోవాలనే ఉద్దేశ్యంతో ఇకపై చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా ఏడాదికి మూడు సినిమాలు చేయాలనుకుంటున్నాను. ఇటీవలే ‘ప్రేమకథా చిత్రమ్’తో విజయాన్ని అందుకున్న జె.ప్రభాకర్‌రెడ్డితో మరో చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నాను. పూర్వం సినిమాలు పరాజయం పాలైనా దర్శకులకు, నిర్మాతలు అండగా నిలిచేవారు. దర్శకులు కూడా గౌరవంతో ఉండేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక సినిమా పరాజయం పాలైతే దర్శకులను పట్టించుకోవడంలేదు. ఈ ధోరణి మారాలి. అప్పుడే చిత్రసీమకు మంచి రోజులు వస్తాయి’’అని చెప్పారు. సంగీత దర్శకుడు ధరన్‌కుమార్ మాట్లాడుతూ-‘‘ సంగీత దర్శకుడిగా నాకు ఇది తొలి చిత్రం. ఇందులో మూడు పాటలున్నాయి. ప్రమోషనల్ సాంగ్ అనేది బాలీవుడ్‌లో ఎక్కువగా చేస్తారు. ఇందులో అలాంటి ప్రయోగమే చేశాం. పాటల్లో సాహిత్యం అందర్నీ ఆకట్టుకుంటుంది’’అని తెలిపారు. దర్శక, నిర్మాత కుమార్ రావిళ్ల మాట్లాడుతూ- ‘‘ఇది చక్కటి వినోదాత్మక చిత్రం. రొమాంటిక్ థ్రిల్లర్. ఇందులో కామెడీ, యాక్షన్ హైలైట్‌గా నిలుస్తాయి. పాటలన్నీ బాగా కుదిరాయి’’అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అశోక్‌కుమార్, ఎస్వీరెడ్డి, జె.ప్రభాకర్‌రెడ్డి, ఎమ్.ఎల్.కుమార్‌చౌదరి, నరేష్ అయ్యర్ తదితరులతో పాటు చిత్రం యూనిట్ పాల్గొన్నారు.
సుజిత్, ప్రగ్య జైస్వాల్, ఎరికా ఫెర్నాండెజ్ ముఖ్య తారలుగా
english title:
dega
Date:
Sunday, June 16, 2013