ఆధారాలు
అడ్డం
1.‘...., పరమేశ్వర, ....’ స్టేజి పద్య నాటకాల ప్రార్థన (4)
3.తమిళుల వస్తధ్రారణ (4)
5.‘ఆడు’ కాదు వయసుకి సరిపడిన వాడు! (2)
6.బంగారమే! అందులో నించి పూర్వాశ్రమంలో ‘ఎయిర్ హోస్టెస్’గా పని చేసిన ఓ నటి
తొంగి చూస్తోంది (4)
8.‘ఊరి చివర’ ఉండాలా మామిడి తోరణాలు కట్టడానికి?! అలాక్కాదుగాని ఇంకో మాట చెప్పండి (4)
10.మనసులో మాట (3)
11.డా... డా... డా... డా! కత్తి దెబ్బ
నేను కాసుకోవాలా? (2)
12.తట్టెడు తళుకు బెళుకు రాళ్లకన్నా ఇదొక్కటి బెటర్ అట! వేమన ఉవాచ (2)
14.అనసూయమ్మగారి మొగుడు అటు తిరిగి
నిలబడ్డాడు! (2)
17.జ్యేష్ఠ భ్రాత (2)
19.మనస్సు; అది చెప్పినట్లే ‘చేద్దాం’ పోనీ! (3)
20.‘... ఇచ్చేశాను. తన్నుకు ఛావండి’ అంటే తిరుగుబాటు తప్పదు మరి! (4)
21.తపోధనుడే కాదు, క్రోధనుడు కూడా! (4)
22.గెలుపు (2)
23.‘జనం రానీ’ కిందు మీదులవుతూ
హారతి పడతారు (4)
24.ఓ ప్రబంధ నాయిక. ఆమే అతనుడి ‘సైన్యం’ (4)
నిలువు
2.అగ్రభాగాన ‘బ్రహ్మ’ ఉన్నా, సృష్టి ప్రక్రియకి
దీనివల్ల అవరోధమే! (4)
3.మోసం, కుట్ర (5)
4.సామ్రాజ్య పాలకుని తిరోగమనం (3)
6.స్ర్తిలు (3)
7.నేరారోపణ ఎదుర్కొంటున్న వాడు.
పోలీసులకి ముద్దాయితడంటే! (3)
9.దారువు (2)
10.ఆముక్తమాల్యద. ఈమెని ఆడాళ్లే
పూజించాలని రూలేం లేదు (3)
13.యజ్ఞం (3)
15.ఈ తలనొప్పి బామ్ వెనుక ‘జనం’ ఉండబట్టే అంత హిట్ అయింది (5)
16.రొక్కం. అప్పు కాదు (3)
17.ఉహూ! ఇతడు కాదు (3)
18.పూర్వం అమ్మాయిలు ఫ్రెండ్స్‌ని
‘హలో’ అనేవారు కాదు. ఇలా అనేవారు (2)
19.‘అర్థం...’; ఓ సినిమాలో భానుప్రియ
ఊత పదం (4)
20.అడ్డం 12కి బహువచనం. వెనక నించి (3) *