వేదిక
------
కంప్యూటర్లు ప్రధానంగా
అంకెలతో పనిచేస్తాయి.
వాటికి కేవలం సున్నాలు,
ఒకట్లు మాత్రమే
అర్థమవుతాయి. ఒక్కో
అక్షరానికీ, వర్ణానికి ఒక్కో
సంఖ్యని కేటాయించి
నిక్షిప్తం చేసుకొంటాయి.
వాటి భాషలోనే మనం
వాటికి అన్నీ విడమర్చి
చెప్పాలి. అందుకనే వివిధ
రకాల కోడ్‌లు
తయారుచేయబడ్డాయి.
ఉదాకు ASCH,
EBCDICవంటివి
ఇంగ్లీషు భాషను
కంప్యూటర్లు అర్థం
అయ్యేటట్లు చెప్పడానికి
తయారుచేయబ్డాయి.
అలాగే తమ అవసరానికి
కంప్యూటర్లు
ఉపయోగిస్తున్న వివిధ
భాషలవాళ్ళు, వివిధ
కంపెనీల వాళ్ళు కూడా
చాలా రకాల కోడ్‌లు
ఉపయోగించేవారు. కానీ
ఇలా రకరకాల కోడ్‌లు
ఉపయోగించడంవల్ల ఎన్నో
సమస్యలు
ఉత్పన్నమయ్యాయి. ఈ
సమస్యలనుండి
బయటపడడానికి
ప్రపంచంలో ఉన్న అన్ని
లిపులను కల్పి ఒకే కోడ్
తయారుచేసారు అదే
‘యూనీకోడ్’.
యూనీకోడ్‌వల్ల ఎన్నో
ప్రయోజనాలు ఉన్నాయి.
దీని ఆధారంగా అన్ని
భాషలవలెనే తెలుగులో
కూడా సులువుగా
వెబ్‌సైట్లు
రూపొందించవచ్చు.
ఉత్తరాలు కూడా
తెలుగులో పంపవచ్చు,
చదువుకోవచ్చు. ఇప్పుడు
బ్లాగులు, వెబ్‌సైట్లు,
పత్రికలు అన్నీ
యూనీకోడ్‌లో
తయారవుతున్నాయి.
ఇదివరకు అంతర్జాలంలో
ఉన్న వివిధ
దినపత్రికలవాళ్ళు
తమకంటూ ఒక
ప్రత్యేకమైన ఫాంట్ లేదా
ఖతిని ఉపయోగించేవారు.
ఆ ఖతి మన కంప్యూటర్లో
ఉంటేనే ఆ పత్రికలోని
తెలుగు స్పష్టంగా
కనిపించేది లేకపోతే
ముగ్గులు, జిలేబీలే...
కాని ఈమధ్య దాదాపు
అన్నీ తెలుగు దినపత్రికలు
యూనికోడ్‌లోనే తమ
పత్రికలను
అందిస్తున్నాయి.
పుస్తకాల ప్రచురణకు
ఎక్కువగా అను ఫాంట్స్
లేదా శ్రీలిపి వాడతారు.
అది టైప్ చేయడానికి పేజ్
మేకర్ ఉండాల్సిందే. కాని
ఇలా టైప్ చేసింది
కంప్యూటర్లో తెలుగులా
కనిపించదు, పిడిఎఫ్ చేస్తే
తప్ప. ఇటువంటి
సమస్యలను
నివారించడానికి, తెలుగు
టైపింగ్‌ని మరింత
సులభతరం చేయడానికి
కొందరు ఔత్సాహికులైన
సాంకేతిక నిపుణులు
యూనికోడ్ కీబోర్డు
లేఅవుట్లు, ఎటువంటి
సాఫ్ట్‌వేర్ లేకుండా
కంప్యూటర్లోనే ఉండే
‘ఇన్‌స్క్రిప్ట్’ విధానంలో
టైపింగ్ చేయడానికి
ట్యూటర్, ఉచితంగా
తెలుగు టైపింగ్ కోసం
అక్షరమాల, పలక, లేఖిని
మొదలైన ఉపకరణాలు
తయారుచేశారు. అలాగే
ఫైర్‌ఫాక్స్ (మంట నక్క)లో
కూడా నేరుగా తెలుగు
రాయడానికి గల
పద్ధతులు: ఇండిక్
ఇన్‌పుట్, పద్మ పొడిగింత
ఉన్నాయి.
గూగుల్‌లోకూడా నేరుగా
తెలుగు రాయడానికి
Google IME అనే
సాధనం ఉంది.. అను
వాడేవారికోసం
మాడ్యులర్, ఆపిల్ కీబోర్డు
లేఅవుట్లు కూడా
అందుబాటులో ఉన్నాయి.
వీటి సాయంతో
తెలుగువాళ్ళు ప్రపంచంలో
ఎక్కడినుండైనా తెలుగు
పుస్తకాలను, వ్యాసాలను
కంప్యూటర్, అంతర్జాలంలో
సులభంగా
చదవగలుగుతారు.
వ్రాయగలుగుతారు.
విషయాలను
వెతుక్కోగలుగుతారు.
మన కంప్యూటర్లో అందరికి
తెలిసిన ఫాంట్ లేదా ఖతి
గౌతమి... ఇది విండోస్
వాడేవారికి డీఫాల్టుగా
ఉంటుంది. అను
సాఫ్ట్‌వేర్‌లో ఎన్నో
అందమైన ఖతులు
ఉన్నాయి కాని అవి మనం
కంప్యూటర్లో వాడలేము.
పెరుగుతున్న సాంకేతిక
విజ్ఞానంవలన
యూనికోడ్‌లో
వాడుకోవడానికి అనువుగా
కొత్త ఖతులు
తయారయ్యాయి. వీటిని
ఉచితంగా డౌన్లోడ్
చేసుకుని మన సిస్టమ్‌లో
సి డ్రైవ్‌లోని ఫాంట్స్
విభాగంలో వేసుకుంటే
మనం రాసుకున్న
డాక్యుమెంట్, పేర్లు,
ఇంగ్లీషులోలాగే దాని
ఫాంట్/ ఖతి
మార్చుకోవచ్చు. ఇటీవల
ప్రపంచ తెలుగు
మహాసభల సమయంలో
15 కొత్త యూనికోడ్
ఫాంట్లు/ ఖతులను
విడుదల చేశారు.
శ్రీకృష్ణదేవరాయ, పెద్దన,
తిమ్మన, తెనాలి
రామకృష్ణ, సూరన్న,
రామరాజు, ధూర్జటి,
మల్లన్న, రామభద్ర,
గిడుగు, సురవరం,
ఎన్.టి.ఆర్. పొన్నాల
స్వర్ణ, రవిప్రకాష్,
లక్కిరెడ్డి...వీటిని
htttp://
teluguvijayam.or
g/fonts.html
నుండిడౌన్‌లోడ్‌చేసుకుని
కంప్యూటర్లో
C/Windows/
Fontsలో సేవ్
చేసుకోవాలి. ఇవన్నీ
ఉచితంగానే లభిస్తాయి.
వర్డ్ డాక్యుమెంట్‌లో రాసిన
సమాచారాన్ని నచ్చిన
ఖతిలోనే సేవ్
చేసుకోవచ్చు. డిజైనింగ్
చేసేటప్పుడు కూడా ఈ
ఫాంట్లు
ఉపయోగపడతాయి.
ఇంగ్లీషు అక్షరాలతో
ఇబ్బందిగా ఉంటే
ఈమధ్యనే తెలుగు
అక్షరాలతో ఉన్న సురవర
కీబోర్డు కొనుక్కుని
సులువుగా తెలుగులోనే
టైప్ చేయవచ్చు. ఈనాడు
కంప్యూటర్, అంతర్జాలం
ఉపయోగించడానికి
తప్పనిసరిగా ఇంగ్లీషు
రావలసిన అవసరం లేదు.
ఇన్ని విధాలుగా తెలుగు
సులభంగా రాయగలిగే
ఉపకరణాలు ఉన్నప్పుడు
తెలుగులోనే మెయిల్
చాటింగ్ చేయవచ్చు,
పద్యాలు, వ్యాసాలు,
కథలు, నవలలు
రాయవచ్చు. తెలుగులో
వెబ్ సైట్లు కూడా
నిర్వహించవచ్చు.. అది
కూడా పైసా ఖర్చు
లేకుండా.. ఎక్కువ శ్రమ
లేకుండా..