గజ్వేల్, ఫిబ్రవరి 24: మార్చి 2వ తేదీ నుండి జరగనున్న ఇంటర్మీడియట్ ప్రశ్నపత్రాలు శుక్రవారం పోలీస్ స్టేషన్‌కు చేరాయి. ఇందులో భాగంగానే గజ్వేల్ పరిధిలోని ఆరు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు చెందిన సెట్-1, సెట్-2 ప్రశ్నపత్రాలు పోలీస్ స్టేషన్‌లోడిపాజిట్ చేయగా, సెట్-3 శనివారం రానున్నట్లు పరీక్షల కస్టోడియన్లు రాజిరెడ్డి, ప్రకాష్‌లు పేర్కొన్నారు.
వరకట్న వేధింపుల కేసులో
నలుగురికి రిమాండ్
తూప్రాన్, ఫిబ్రవరి 24: వరకట్న వేధింపుల కేసులో నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తూప్రాన్ ఎస్‌ఐ వెంకటయ్య పేర్కొన్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల పరిధిలోని దాతర్‌పల్లికి చెందిన రేణుకను హైద్రాబాద్‌కు చెందిన బాబురావుతో ఐదు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అయితే ఒప్పుకున్న ప్రకారం కట్నకానుకలను రేణుక కుంటుంబీకులు అప్పుడే అందజేయగా, అదనపుకట్నం కావాలని అత్తింటి వారు ఇబ్బందులకు గురి చేయడంతోపాటు మానసికంగా వేధిస్తూ వస్తున్నారు. అయితే వారి వేధింపులను తట్టుకోలేని రేణుక తూప్రాన్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో భర్త బాబురావు, ఆడపడుచు హంసమ్మ, అడపడుచు భర్త జయరావు, అత్త కొమురమ్మలపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ వెంకటయ్య పేర్కొన్నారు.