Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ప్రజలకు జవాబుదారీతనం కోసమే డయల్ 100

$
0
0

విజయనగరం, జూన్ 17: రాష్ట్రంలో సైబర్ నేరాల నిరోధానికి త్వరలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయనున్నట్టు కోస్టల్ జోన్ ఐజి ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. సోమవారం ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం వన్‌టౌన్‌లో ఏర్పాటు చేసిన డయల్ 31002 కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుందన్నారు. ఒక ఏడాది పాటు జరిగిన దొంగతనాల కంటే ఒక సైబర్ నేరం విలువ అధికంగా ఉందన్నారు. అందువల్ల సిబ్బందికి ఇంటర్నెట్, ఇతర అంశాలపై ప్రత్యేక శిక్షణనివ్వడంతోపాటు అధునాతన పద్దతుల్లో వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు.
నార్త్ కోస్టల్ జోన్ పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మావోల సంచారం లేనప్పటికీ విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలో అలజడి చేస్తున్నారని ఐజి ద్వారకాతిరుమలరావు చెప్పారు. ఇటీవల చత్తీస్‌ఘడ్‌లో జరిగిన సంఘటనలో మావోలు తెలుగులో మాట్లాడిన విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావించగా వారు మన రాష్టమ్రైన, ఇతర రాష్ట్రాలకు చెందినవారైనా కావచ్చని అనుమానం వ్యక్తం చేశారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన సూచనలను అధికారులకు తెలియజేశామన్నారు. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలన్నదే పోలీసుల లక్ష్యమని ఐజి ద్వారకా తిరుమలరావు అన్నారు. అందుకోసమే డయల్ 100ను దేశంలో ప్రప్రధమంగా రాష్ట్రంలో డిజిపి దినేష్‌రెడ్డి ప్రారంభించారని చెప్పారు. డయల్ 100కు ఫోన్ చేయగానే హైదరాబాద్ డిజిపి కార్యాలయంలో ఉన్న డయల్ కమాండ్ కంట్రోల్ యూనిట్‌కు చేరుకొని అక్కడ నుంచి డివిజనల్ ఆఫీసు ద్వారా నేరుగా సంబంధిత పోలీసు స్టేషన్‌కు సమాచారం చేరుతుందన్నారు. వెంటనే కొద్ది నిమిషాల వ్యవధిలోనే బాధితుని వద్దకు సంబంధిత పోలీసులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుందని వివరించారు. డిఐజి పి.ఉమాపతి, జిల్లా ఎస్పీ కార్తికేయ పాల్గొన్నారు.

పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ
ఆటో వర్కర్ల సంఘం రాస్తారోకో

విజయనగరం , జూన్ 17: పెట్రోల్ ధరల పెంపుదలను నిరసిస్తూ విజయదుర్గా ఆటోవర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రెడ్డి నారాయణరావు మాట్లాడుతూ ఎప్పటికప్పుడు పెట్రోల్,డీజిల్ ధరలను పెంచడం వల్ల అన్నివర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వీటి పెంపుదలతో అటోడ్రైవర్లు పెరిగిన భారాన్ని ప్రయాణికులపై వేయలేక, వారు భరించలేక అవస్థలకు గురవుతున్నారన్నారు. పెరిగిన పెట్రోల్ ధరలకు తగ్గించేవరకూ పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు అనేక ఇక్కట్లు పడుతున్నారన్నారు. కేంద్రంలో యుపిఎ ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్ల ప్రజలు నరకయాతనలు పడుతున్నారన్నారు. రెండేళ్లకాలంలో 30సార్లు పెట్రోల్ ధరలు పెంచి ప్రజలపై పెనుభారం మోపిందన్నారు. త్వరలో డీజిల్ వంటగ్యాస్ ధరల నియంత్రణపై కేంద్రం తమ బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు నీలాపుఅప్పలరాజురెడ్డి, ఎం.సన్యాసిరావుతదితరులు పాల్గొన్నారు.

‘అర్హత ఉన్న గ్రామాలను
షెడ్యూల్డ్ జాబితాలో చేర్చాలి’
కురుపాం, జూన్ 17: జిల్లాలోని నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న గ్రామాలన్నింటినీ షెడ్యూల్డ్ ఏరియాలో కలపాలని డిమాండ్ చేస్తు గిరిజన సంఘం ఆధ్వర్యంలో కేంద్రమంత్రి కిశోర్‌చంద్రదేవ్ ఇంటి ముందు నిరసన తెలిపారు. సోమవారం సంఘం ప్రతినిధి పి.రంజిత్‌కుమార్ ఆధ్వర్యంలో గిరిజనులు ఈ నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా రంజిత్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో వందలాది గ్రామాలు నాన్ షెడ్యూల్డ్‌లో ఉండటం వలన ఏజెన్సీ ప్రాంతాల్లో లభించే సదుపాయాలను పొందలేకపోతున్నారన్నారు. కొండలపై ఉన్న గ్రామాలు కూడా నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో ఉండటం వలన అక్కడ గిరిజనులు ప్రభుత్వ పథకాలను సక్రమంగా అందుకోలేకపోతున్నారన్నారు. ఈ విషయమై గతంలో కేంద్రమంత్రి కిశోర్‌చంద్రదేవ్‌కు వినతిపత్రం అందించామని, అయినా ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో నిరసన తెలియజేశామన్నారు. ఇప్పటికైన కేంద్రమంత్రి, అధికారులు స్పందించి నాన్ షెడ్యూల్డ్ గ్రామాలను షెడ్యూల్డ్ ఏరియాలో కలపాలన్నారు.
‘నగదు బదిలీ వద్దు’
విజయనగరం, జూన్ 17 : పేదలకు పెనుభారమైన నగదు బదిలీ పధకం వద్దంటూ,రేషన్ డిపోల ద్వారానే సరుకులు అందజేయాలని డిమాండ్ చేస్తూ విజయనగరం 30వ వార్డుకు చెందిన పలువురు మహిళలు కలక్టరేట్ ఆవరణలో సోమవారం ఆందోళన నిర్వహించారు. ఆవార్డు మాజీ కౌన్సిలర్ కె.వరలక్ష్మి ఆధ్వర్యంలో మహిళలు కలక్టరేట్‌కు తరలివచ్చి తమ నిరసన గళం వినిపించారు. 30వ వార్డు పరిధిలో నాలుగు డిపోను ఉన్నాయని వాటిలో 2000 మందికి పైబడి రేషన్ కార్డు దారులు ఉన్నారన్నారు. నగదు బదిలీ పధకం కోసం బ్యాంకు ఖాతా తెరిచేందుకు 500 రూపాయలుతో ప్రారంభించడం తప్పనిసరి అని సంబంధిత అధికారులు నిబంధన విధిస్తున్నారని ఇదిపేదలైన వారికి పెనుభారంగా మారిందన్నారు. నగదు బదిలీ పధకం తమకు వద్దని నినాదాలు చేశారు. బ్యాంకు ఖాతా తప్పని సరి అయితే ఉచితంగా బ్యాంకు ఖాతాను ప్రారంభించేందుకు అవకాశం కల్పించాలని కోరారు. పలువురు రేషన్ కార్డుదారులకు గ్యాస్ కనెక్షన్లు లేనందున 10 లీటర్లు వంతున కిరోసిన్ మంజూరు చేయాలని కోరారు. అలాగే ఆధార్ కార్డు లేని వారికి ఐరిస్ వెంటనే తీయాలని, గ్యాస్ కనెక్షన్ పేరు మార్చుకోవడానికి అవకాశం కల్పించాలని కోరారు. అనంతరం జాయింట్ కలక్టర్‌కు వినతిపత్రం అందజేసారు.

‘గ్రీవెన్స్’లో వినతుల వెల్లువ
విజయనగరం, జూన్ 17 : జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నాటి గ్రీవెన్స్ సెల్‌కు పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ సుమారు వినతులు అందజేసారు. మినీ కాన్ఫరెన్స్‌హాల్‌లో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్‌లో జాయింట్ కలెక్టర్ శోభ వినతులు స్వీకరించారు. లక్కవరపుకోట మండలం శ్రీరాంపురం గ్రామంలో మంచినీటి పధకాలు, బోర్లు ద్వారా వస్తున్న కలుషిత నీటిని గత్యంతరం లేక తాము వాడుతున్నామని ఆ నీటివలన వ్యాధులు సోకి పలువురు బాధపడుతున్నారని ఈవిషయమై ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు లేవని ఉన్నతాధికారులైనా స్పందించి దర్యాప్తు జరిపించాలని ఆర్.రామారావుతోపాటు పలువురు కోరారు. రామభద్రపురం ఎస్సీకాలనీలో మురికినీటి కాలువ లేనందున అపారిశుద్ద్యం పెరిగి స్థానికులు రోగాల బారిన పడుతున్నార అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆర్.శాంతారావు, తదితరులు కోరారు. సాలూరు మండలం మొకాసదండిగాం గ్రామంలో గతంలో ప్రభుత్వం తమకు ఇచ్చిన డి పట్టా భూములను ఇప్పుడు మినీ హైడ్రో పవర్ ప్రాజెక్టు కోసం బలవంతం తీసుకున్నారని ప్రజారోగ్యం దృష్ట్యా ఆప్రాజెక్టు పనులు ఆపి ఆభూములను తమకు ఇప్పించాలని కోరుతూ కె.శాంతమ్మ తదితరులు కోరారు. ఎస్.కోట మండల కేంద్రంలో బాబు చెరువు గర్భాన్ని కొందరు ఆక్రమించారని అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ చెరువు ఆయట్టు రైతులు పి.అప్పారావుతోపాటు మరికొందరు వినతినిచ్చారు. వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోరుతూ పలువురు వినతులు అందజేసారు.

నాటుసారా నిరోధానికి గట్టి నిఘా
పార్వతీపురం, జూన్ 17: నాటుసారా నిరోధానికి గట్టి నిఘా పెట్టాలని పార్వతీపురం ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్‌వి రమణ ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్లను ఆదేశించారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ ఎక్సైజ్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒడిసా నుండి అక్రమంగా నాటుసారా దిగుమతి కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో నాటుసారా రవాణా కాకుండా చెక్‌పోస్టుల వద్ద నిఘా మరింత కట్టుదిట్టం చేయాలని సూచించారు. అదేవిధంగా ప్రభుత్వం విధించిన మద్యం అమ్మకాల లక్ష్యాలను అధిగమించాలని సూచించారు. అలాగే త్వరలో ప్రభుత్వం చేపట్టనున్న మద్యం పాలసీ చేపట్టనున్నందున మద్యం అమ్మకాలపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం ఇన్‌ఛార్జి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, పార్వతీపురం సి ఐ ఎస్.శ్రీనివాసరావు, బొబ్బిలి, సాలూరు, కురుపాం సి ఐలు కె.సురేష్, ఎస్‌వి రమణమూర్తి, యు.మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.
పలువురు డిపో మేనేజర్ల బదిలీలు
విజయనగరం (్ఫర్టు), జూన్ 17: ఆర్టీసీ విజయనగరం నార్త్‌ఈస్ట్‌కోస్టల్ రీజియన్ పరిధిలో పలువురు డిపోమేనేజర్లను బదిలీ చేస్తూ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఎ.కె.ఖాన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాకుళం రెండోడిపోమేనేజర్ ఆర్.పద్మావతిని విజయనగరం డిపోమేనేజర్‌గా నియమించారు. ఇక్కడ డిపోమేనేజర్‌గా పనిచేస్తున్న పిబిఎంకెరాజును ఆర్.ఎం.కార్యాలయంలో పర్సనల్ అధికారిగా బదిలీ చేశారు. పార్వతీపురం డిపోమేనేజర్‌గా పనిచేస్తున్న ఎన్‌విఎస్ వేణుగోపాల్‌ను విజయనగరం జోనల్ ఎగ్జిక్యూటివ్‌డైరెక్టర్ కార్యదర్శిగా, వేణుగోపాల్ స్ధానంలో డిపోమేనేజర్‌గా విశాఖ ద్వారకాతిరుమల బస్‌స్టేషన్ అసిస్టెంట్‌మేనేజర్ బివిఎస్ నాయుడును నియమించారు. విజయనగరం డిపో అసిస్టెంట్‌మేనేజర్‌గా పనిచేస్తున్న ముత్తిరెడ్డి సన్యాసిరావుకు పదోన్నతి కల్పిస్తూ శ్రీకాకుళం ఒకటోడిపోమేనేజర్‌గా బదిలీ చేశారు. శ్రీకాకుళం రెండోడిపో అసిస్టెంట్‌మేనేజర్‌గా పనిచేస్తున్న ఆర్.ఎస్.నాయుడును ఆళ్లగడ్డ డిపోమేనేజర్‌గా నియమించారు.
20న ఖాదర్‌వలీ బాబా గంధ మహోత్సవం
విజయనగరం(పూల్‌భాగ్), జూన్ 17 : బాబామెట్టా ఖాదర్ నగర్‌లో ఈనెల 20న హజరత్ సయ్యద్ ఖాదర్‌వలీ బాబా గంధ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు దర్గా,దర్భార్ షరీఫ్ ముతవల్లీ ముహమ్మద్ అతావుల్లా షరీఫ్‌షాతాజ్ ఖాదరీబాబా తెలిపారు.సోమవారం సాయంత్ర దర్గా వద్ద ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతన తన ఆధ్యాత్మిక గరువు ఖాదర్‌బాబా ఆశీస్సులతో ఈఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా 19న ఖరాన్ పఠనం చాదర్ సమర్పణ, 20న 10 దర్బార్ షరీఫ్‌లతో ఫకీర్‌మేళా, ఊరేగింపు, 21న ఖవ్వాలి, 22న భక్తులు దర్గా షరీఫ్‌లోచాదర్, ప్రసాదవితరణ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.
విధ్యార్థుల బస్సు పాసుల జారీకి ఏర్పాట్లు
విజయనగరం (్ఫర్టు), జూన్ 17: విద్యార్థులకు బస్సుపాసులను జారీ చేసేందుకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అన్ని డిపోల్లో కౌంటర్లను ప్రారంభించారు. ఒకవైపు దరఖాస్తులను అందిస్తూనే మరోవైపుపాసులను జారీ చేశారు. బస్సుపాసుల జారీ రీజనల్‌మేనేజర్ పి.అప్పన్న సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. విజయనగరం రీజియన్ పరిధిలో విజయనగరం, శృంగవరపుకోట, సాలూరు, పార్వతీపురం, పాలకొండ, శ్రీకాకుళం డిపో-1, శ్రీకాకుళం డిపో-2, పలాస, టెక్కలి డిపోలు ఉన్నాయి. ఈ డిపోల పరిధిలో విద్యార్థులకు బస్సులను అందిస్తున్నారు. అన్ని డిపోల్లోను బస్సులను అందించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. బస్సుపాసుల జారీలో గతంలో ఏర్పడిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ సారి గట్టి చర్యలు చేపట్టారు. దీనిలోభాగంగా ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేశారు. బస్సుపాసుల జారీపై స్థానిక డిపో అసిస్టెంట్‌మేనేజర్ కార్యాలయంలో రీజనల్‌మేనేజర్ పి.అప్పన్న సమీక్షించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్‌మేనేజర్లు కొటాన శ్రీనివాసరావు, గండి సత్యనారాయణ, డిపోమేనేజర్ పిబిఎంకె రాజు, అసిస్టెంట్‌మేనేర్ ముత్తిరెడ్డి సన్యాసిరావుతదితరులు పాల్గొన్నారు.

డయల్ 100 కంట్రోల్ యూనిట్ ప్రారంభం
విజయనగరం, జూన్ 17: పట్టణంలోని వన్‌టౌన్‌లో ఏర్పాటు చేసిన డయల్ 100 కంట్రోల్ యూనిట్‌ని కోస్టల్ జోన్ ఐజి ద్వారకా తిరుమలరావు ప్రారంభించారు. సోమవారం జిల్లాకు వచ్చిన సందర్భంగా వన్‌టౌన్‌లో ఏర్పాటు చేసిన డయల్ 100 పనితీరును పరిశీలించారు. డయల్ 100 ద్వారా పోలీసులు ప్రజలకు మరింత చేరువకాగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. దొంగతనాలు, కొట్లాటలు, దొమ్మి, రహదారి ప్రమాదాల వంటి సంఘటనల సమయంలో డయల్ 100కు ఫోన్ చేసి పోలీసు సహాయం పొందవచ్చునని అన్నారు. ఇదిలా ఉండగా పోలీసు స్టేషన్‌కు వచ్చిన ప్రతి ఫిర్యాదుదారునికి రశీదు ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించినట్టు తెలిపారు. పట్టదగిన నేరమైతే వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామన్నారు. లేదా తక్షణ న్యాయం అందిస్తామని వివరించారు.
విశ్రాంతి గది ప్రారంభం
జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన విశ్రాంతి గదిని ఐజి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. అనంతరం ఆర్మ్‌డ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసును ప్రారంభించారు. జిల్లా ఎస్పీ కార్తికేయ, ఎఎస్పీ మోహనరావు, ఒఎస్‌డి డి.వి.శ్రీనివాసరావు, ఆర్మ్‌డ్ రిజర్వు డిఎస్పీ జి.శ్రీనివాసరావు, ఎస్.బి. ఇన్‌స్పెక్టర్ ఎంవివి రమణమూర్తి, ఆర్‌ఐలు ఎస్పీ అప్పారావు, నాగేశ్వరరావు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

నేడు కలెక్టర్‌గా బాధ్యతలు
స్వీకరించనున్న కాంతిలాల్ దండే
విజయనగరం, జూన్ 17: జిల్లా కలెక్టర్‌గా నియమితులైన కాంతిలాల్ దండే మంగళవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక్కడ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఎం.వీరబ్రహ్మయ్యను కరీంనగర్ జిల్లాకు బదిలీ చేసిన విషయం విదితమే. ఆయన స్థానంలో కాంతిలాల్ దండే నియమితులయ్యారు. ఈయన గతంలో ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. ఈయన వ్యవసాయ పట్ట్భద్రులు. జెనెటిక్స్ ప్లాంట్ బ్రీడింగ్‌లో పోస్టు గ్రాడ్యుయేట్ పనిచేశారు. గిరిజన సంక్షేమ శాఖలో ప్రాజెక్టు ఆఫీసర్‌గా, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు కమిషనర్‌గా, కడప, గుంటూరు జిల్లాలకు జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు. అనంతరం చేనేత జౌళిశాఖ డైరెక్టర్‌గా, టూరిజం డైరెక్టర్‌గా పనిచేశారు. అక్కడ నుంచి విజయనగరం జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు.

దొంగతనాల నియంత్రణకు చర్యలు
విజయనగరం, జూన్ 17: దొంగతనాల నిరోధానికి ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్టు నార్త్ కోస్టల్ జోన్ ఐజి ద్వారకా తిరుమలరావు తెలిపారు. సోమవారం ఇక్కడ జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన పోలీసు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందమర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల సమస్యల గురించి మాట్లాడుతూ ముందుగా సమాచారం సేకరించి వాటిని నివారించాలన్నారు. అలాగే పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో పెట్రోలింగ్ గస్తీని ముమ్మరం చేసి దొంగతనాలను అరికట్టాలన్నారు. వివిధ సబ్ డివిజన్లలో నెలకొన్న సమస్యల గురించి ప్రస్తావించారు. ఆయా సమస్యల గురించి చర్చించి సమస్యలను పరిష్కరించే విధానం గురించి వివరించారు. సిబ్బంది అంకిత భావంతో పనిచేసి పోలీసు ప్రతిష్టను ఇనుమడింపజేయాలన్నారు. డిఐజి పి.ఉమాపతి, ఎస్పీ కార్తికేయ, ఎఎస్పీలు మోహనరావు, రాహుల్ దేవ్‌శర్మ, పిటిసి డిఎస్పీ మధుసూదనరావు, ఒఎస్‌డి డివి శ్రీనివాసరావు, డిఎస్పీలు కృష్ణప్రసన్న, టి.్ఫల్గుణరావు, జి.శ్రీనివాసరావు, పాల్గొన్నారు.

అక్రమంగా నిల్వ చేసిన పత్తి విత్తనాలు స్వాధీనం
పార్వతీపురం, జూన్ 17: పట్టణంలోని కొత్తవలసలో గల ఓ పత్తివిత్తనాల గోదాంలో సోమవారం శ్రీకాకుళం నుండి వచ్చిన విజిలెన్సు అండ్ ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజిలెన్సు అధికారులు మాట్లాడుతూ లైసెన్సు ఉన్నచోట గోదాం ఏర్పాటు చేయకుండా వేరొక చోట గోదాంలో పత్తివిత్తనాలు స్టాకు చేశారని విజిలెన్సు అధికారులు తెలిపారు. పత్తివిత్తనాలను కేవలం పార్వతీపురం ఎడి ఎ పరిధిలోని ప్రాంతాల్లోనే అమ్మాల్సి ఉండగా ఒడిశాలోని రైతులకు అమ్మకం చేస్తున్నారని సోదాల్లో తేలినట్టు తెలిపారు. దాడుల్లో గోదాంలోని నిల్వ ఉంచిన 35 సీడ్ బాక్సులు స్వాధీనం చేసుకున్నామని వీటి విలువ రూ.6లక్షలు ఉంటుందని విజిలెన్సు తెలిపారు. విజిలెన్సు సిఐ రేవతి, సిబ్బంది పాల్గొన్నారు.

‘పట్టణ సమస్యలపై దృష్టి సారించాలి’
విజయనగరం , జూన్ 17: పట్టణంలో సమస్యలపై దృష్టి సారించాలని పలువురు కోరారు. డయల్ యువర్ మున్సిపల్ కమిషనర్ కార్యక్రమంలో భాగంగా పట్టణ ప్రజల నుంచి సోమవారం పట్టణ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. పట్టణంలో రోడ్లు మరమ్మతులకు గురయ్యాయని, చాలాచోట్ల గతుకులమయంగా తయారయ్యారని తెలిపారు. ముఖ్యంగా పట్టణ శివారు ప్రాంతాల్లో రోడ్లు మరింత దారుణంగా ఉన్నాయన్నారు. అదేవిధంగా మంచినీటి సరఫరా విభాగం పనితీరు ఏమాత్రం బాలేదన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ కూడా అస్తవ్యస్తంగా ఉందన్నారు. పారిశుద్ధ్య సిబ్బంది సక్రమంగా పనిచేయడం లేదని పలువురు ఆరోపించారు. అదేవిధంగా సోమవారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన మున్సిపల్ దర్బార్ మంచి స్పందన లభించింది.

జిల్లా కలెక్టర్‌కు సన్మానం
విజయనగరం, జూన్ 17: గత మూడేళ్ల కాలంలో జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అక్షరాస్యత కార్యక్రమానికి సహకారం అందించినందుకు జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్య కృతజ్ఞతలు తెలిపారు. అక్షరాస్యత కార్యక్రమానికి 85 శాతం తీసుకువెళ్లలేకపోయామని, దానిని విద్యాశాఖాదికారులు సమన్వయంతో సాధించాలన్నారు. పదో తరగతిలో 2010-11లో 80.65 శాతం, 2011-12లో 89.65 శాతం, 2012-13లో 89.75 శాతం సాధించినట్టు డిఇఒ కృష్ణారావు తెలిపారు. అనంతరం అదనపు జాయింట్ కలెక్టర్ యుసిజి నాగేశ్వరరావు, డ్వామా పిడి కె.శ్రీరాములనాయుడు, రాజీవ్ విద్యా మిషన్ ప్రాజెక్టు అధికారి కె.వెంకటరమణ, వయోజన విద్య డిడి అమ్మాజీరావు, డిఆర్‌డిఎ పిడి జ్యోతి, ఎస్‌హెచ్‌జి సంఘాలు, డిప్యూటీ డిఇఒ నాగమణి తదితరులు కలెక్టర్‌ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పి సిఇఒ మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో సైబర్ నేరాల నిరోధానికి త్వరలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయనున్నట్టు కోస్టల్
english title: 
dial 100

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>