అచ్చమైన తెలుగమ్మాయి కథానాయికగా నటిస్తే చూడాలని ఎదురుచూస్తున్న అనేక మందికి నచ్చిన అమ్మాయి మధుశాలిని. అనేక చిత్రాలలో నటించినా బాలీవుడ్, కోలీవుడ్ హీరోయిన్లకు వచ్చినంత గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ప్రస్తుతం గోళ్లుగిల్లుకుంటూ కూర్చున్న ఈ అమ్మడిని కదిలిస్తే అనేక అవకాశాలు వస్తున్నా మూసపాత్రల్లో నటించలేక ఆయా సినిమాలు వదులుకుంటున్నానని డాబులు కొడుతోంది. ఆమె నటించిన ‘ కితకితలు’ సినిమా గుర్తొస్తోంది, అని ఆమె మాటలు విన్న వారికి తెలుగులో అవకాశాలు ఒక్కటి కూడా లేకపోయినా వర్మ చిత్రంలో నటించిన క్రెడిట్ మాత్రమే ప్రస్తుతం ఆమెను రక్షిస్తోంది. తెరంగేట్రం చేసిన తొలి నాళ్లలోనే తనవద్ద ఉన్న అందాలన్నీ రెచ్చిపోయి చూపించడంతో, మరింక చూపించడానికి ఏమీ లేవని నిర్మాతలు ఆమెపై సీతకన్ను వేశారేమో అనే వాదనలు వినిపిస్తున్నాయి. దానికితోడు నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీసువద్ద బోల్తాకొట్టడంతో అమ్మడికి అది కూడా కలిసిరాలేదు. తక్కువ సినిమాల్లోనే నటించిన తెలుగమ్మాయిగా మిగిలిపోయారెందుకు అని అంటే నాకు చాలా అవకాశాలు వచ్చాయి. అన్నీ ఒకే తరహా పాత్రలు కావడంతో అవన్నీ రిజెక్ట్ చేశానని అడిగిన వాళ్ల చెవుల్లో పూలుపెట్టే ప్రయత్నం చేస్తోంది. అయినా కానీ ఇప్పుడు నటిస్తున్న హీరోయిన్లందరూ మూసపాత్రలే చేస్తున్నారు కదా! తాను మాత్రం అందుకు వ్యతిరేకం అంటూ ముక్తాయింపు ఇచ్చింది. మొత్తానికి మూస పాత్రల కారణం పాలిట రక్షణ కవచాల్లా మారాయి మరి!
హిట్ లెస్ బ్యూటీ!
చెయ్యని పాత్రలేదు. ఐటెమ్ సాంగ్ కూడా ఓకె. బికినీ వేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. అయినాకానీ ఒక్క హిట్ కూడా ఆమె దగ్గరికి చేరుకోవడానికి అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. చేసిన సినిమాలన్నీ ఢమాల్.. ఢమాల్ అనడంతో ఈ అమ్మడి వైపు అవకాశాలు కనె్నత్తి చూడడంలేదు. ఇంతకూ ఎవరీ హిట్ లెస్ బ్యూటీ అని అంటే, పూరీ జగన్నాథ్ తీసిన ‘బుజ్జిగాడు’ చిత్రంతో త్రిష చెల్లెలిగా సెకెండ్ హీరోయిన్ లెవెల్లో పరిచయమైన సెక్సీ అందాల సంజన! ఇప్పటికే ఫ్లాప్ బ్యూటీ అని పేరుపడ్డ ఈ అమ్మడికి ఆ మాటంటే అమాంతమైన కోపం విరుచుకుపడుతోందట. తనను బ్యూటీ అంటే ఒప్పుకుంటాను కానీ, ఫ్లాప్ బ్యూటీ అంటే మాత్రం అస్సలు ఊరుకోనని మారం చేస్తోంది. తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ భామ టాప్ హీరోయిన్గా ఎదగాలన్న కలలు నెరవేరలేదు. అందుకే తన సినిమాలను తానే తీసుకుని ప్రమోట్ చేసుకోవాలనుకుంటోందట. అయితే తన సినిమాలతోపాటు మరో ఐదు సినిమాలు తన డైరీలో సిద్ధంగా ఉన్నాయని, ఇన్ని వుండగా తనను ఫ్లాప్ బ్యూటీ అని ఎందుకంటారని ప్రశ్నిస్తోంది. ప్రస్తుతం సంజన కన్నడంలో మూడు, తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది. ఫ్లాప్ హీరోయిన్ అంటే ఒప్పుకోని ఈ భామ ఒక్క హిట్ కూడా కొట్టలేక నానా మాటలు మాట్లాడుతోంది. అంతేమరి.. విలువలేని దానికి శబ్దాలెక్కువని పెద్దలు ఊరికే చెప్పారా?
‘కిక్కే కిక్కు’
సల్మాన్ ఖాన్ ‘కిక్’ కోసం అభిమానులు తెగ ఎదురు చూసేస్తున్నారు. భాయ్ ‘సిక్స్ ప్యాక్’ కోసం కాదట. జీరోసైజ్ భామ కోసం. సల్మాన్ సరసన ఇప్పటికే ప్రియాంకా చోప్రా.. దీపికా పదుకొనె పేర్లు వినిపించాయి. కానీ - వారి స్థానే ఆ పోస్ట్‌ని జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కొట్టేసింది. హాట్‌హాట్‌గా ‘టబ్’ బాత్ నుంచీ అప్పుడే వచ్చినట్టుండే జాక్వెలిన్ జనానికి సరైన ‘కిక్’ ఇవ్వనుంది. శిరీష్ కుందర్ దర్శకత్వంలో సాజిద్ నాడియావాలా నిర్మిస్తున్న ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. నటీనటుల ఎంపికలో భాగంగా హీరోయిన్ ఎవరన్న ప్రశ్నకు తెర పడినట్టే. ‘హౌస్‌ఫుల్’ చిత్రంతో హౌస్‌ఫుల్ కలెక్షన్లు తెచ్చిపెట్టిన జాక్వెలిన్ ఈ చిత్రంలో ఎంతమందికి ‘కిక్’ ఇవ్వనుందో?
హరివిల్లు
english title:
harivillu
Date:
Sunday, June 23, 2013