ఓన్లీ ఇన్ ఇండియా
వెస్ట్ బెంగాల్‌కి చెందిన ప్రైవేట్ ఆర్థిక వ్యాపార సంస్థ శారదా గ్రూప్ దివాలా తీసింది. దాని అధినేత సుదీప్తా సేన్‌ని అరెస్టు చేశారు. ‘ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వారికి డబ్బు తిరిగి ఇవ్వడానికి తమ ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు కాబట్టి, సిగరెట్లు తాగేవాళ్లు ఎక్కువ సిగరెట్లని తాగితే పన్నుల రూపంలో లభించే ఆదాయాన్ని వాళ్లకి ఇస్తామ’ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చింది! ఇందుకు ఆమె పార్టీ వారే ఆమెని విమర్శించారు.
ఇండియా మొత్తానికి వెస్ట్‌బెంగాల్‌లోనే పొగాకు వినియోగం అధికం. 2003 కేంద్ర చట్టం ప్రకారం ఏ కారణంగానైనా పొగాకు వినియోగాన్ని ప్రోత్సహించడం నేరం.
స్ఫూర్తి
2005లో ఫ్లోరిడాని హరికేన్ చార్లీ తాకింది. జాక్‌బానర్ అనే చిన్న పిల్లవాడు వాటర్ బాటిల్స్‌ని సేకరించి అవసరమైన వారికి ఉచితంగా ఇచ్చాడు. ఇలా మొత్తం 27 లారీల నిండా వాటర్ బాటిల్స్‌ని జాక్ సేకరించాడు.
ఇలా అన్నారు...
రాజకీయవేత్తలు ఎక్కడైనా ఒక్కటే. నది లేని చోట వంతెనని నిర్మిస్తామని మాట ఇస్తారు.
-నికితా కృశే్చవ్
ఈషార్ట్ ఫిల్మ్ చూశారా?
‘మిస్ అండర్‌స్టాండింగ్’ అనే షార్ట్ ఫిల్మ్‌లో మనుషులు ఎంత తేలిగ్గా ఒకర్నొకరు తప్పుగా అంచనా వేస్తారో హాస్యంగా చెప్పారు. దీన్ని చూడడానికి యూట్యూబ్ డాట్‌కామ్‌లోకి వెళ్లి misunderstanding అని టైఫ్‌చేసి సెర్చ్ చేయండి. నిడివి 3 నిమిషాల 2 క్షణాలు.
హాలీవుడ్ కబుర్లు
‘మనీ ట్రైన్’ అనే సినిమా 1995లో విడుదలైంది. ఈ కామెడీ థ్రిల్లర్‌లో న్యూయార్క్ సిటీ ట్రాన్సిట్ మనీ ట్రైన్‌లోంచి ప్రతీ స్టేషన్‌లో టిక్కెట్ల అమ్మకాల ద్వారా వసూలైన డబ్బుని దొంగిలించడం ఇతివృత్తం. దీని ప్రభావంతో హేరీ కాఫ్‌మేన్ ఆ ప్రయత్నం చేశాడు. ఆశ్చర్యంగా మాజీ అధ్యక్ష అభ్యర్థి బాబ్‌డేవ్‌కి కూడా ఈ నేరంలో భాగం ఉందని పోలీసులు భావించారు. హేరీ పట్టుబడ్డాక, నిజం తెలిసింది.
లింగు-లిటుకు
లింగు: మేధావులు మంచి భర్తలవుతారా?
లిటుకు: మేధావులు అసలు భర్తలే కారు.
వింత లోకం
టోక్యో
యూని వర్సిటీకి చెందిన ఓ టీమ్ ‘స్లిమ్మింగ్ గాగుల్స్’ ని కనిపెట్టింది. ఆ కళ్లజోడుని ధరిస్తే ప్లేట్‌లోని ఆహారం ఏభై శాతం పెద్దగా కని పిస్తుంది. ఎక్కువ తింటున్నామనే భావన కలిగి ఇక తినడం ఆపేస్తారు. ప్రొఫెసర్ మిచిటాకా హిరోజ్‌కి వచ్చిన ఆలోచన ఇది. ఈ గాగుల్స్ ధరించిన వారు 10% తక్కువ ఆహారం తీసుకుంటారని, తద్వారా బరువు సమస్య ఆ మేరకు తగ్గుతుందని చెప్తున్నారు. త్వరలో ఈ కళ్లజోళ్లు మార్కెట్‌లోకి రానున్నాయి.
దురదృష్టపు దొంగ
వియార్క్‌లోని గ్రాంటన్ అనే ఊళ్లోని లాండ్‌బర్గ్ (18) అనే దొంగ గుళ్లులేని 22 కాలిబర్ హేండ్‌గన్‌ని ఆగి వున్న కారులో డ్రైవింగ్ సీటులో కూర్చుని ఉన్న జెస్సికా (19) అనే ఆమెకు చూపించి హ్యాండ్‌బాగ్ ఇవ్వమని కోరాడు. ఆమె ఇచ్చాక తెరిచి చూస్తే అందులో డబ్బు లేదు. క్రెడిట్ కార్డులు, చెక్కుబుక్కులు కనిపించాయి. తన పేర చెక్ రాయమని కోరాడా దొంగ.
ఆమె రాసిస్తే మర్నాడు బ్యాంక్‌కి దాన్ని క్యాష్ చేసుకోవడానికి వెళ్లినప్పుడు, లాండ్‌బర్గ్ వస్తాడని ఎదురు చూడకపోయినా అక్కడ కాపున్న పోలీసులకి అతను చిక్కాడు. ఈ అమాయకపు దొంగ మొదటి దొంగతనం ప్రయత్నం ఇది.
గతంలో కనీసం లైబ్రరీ పుస్తకం కూడా దొంగిలించని అతణ్ణి చూసి కోర్టులో అంతా నవ్వుతుంటే, సిగ్గుతో తలవంచుకున్నాడు. జడ్జి కూడా నవ్వుతూ అతనికి తక్కువ శిక్ష విధించాడు.
డైవర్స్
నైజీరియాకి చెందిన టీచర్ బొనానే్ల అలోమోగే పదకొండేళ్ల వైవాహిక జీవితానంతరం తన భర్త నించి విడాకులు తీసుకుంది. కారణం అతను తమ పిల్లల స్కూల్ ఫీజులని కట్టడం గానీ, ఆర్థిక సహాయం చేయడం కానీ చేయడు. మరో ఊళ్లో ఉద్యోగం చేస్తూ, రెండేళ్లకోసారి వచ్చి పోతుంటాడు. భర్తగా ఏ బాధ్యతని నిర్వహించని అతను తనకి వద్దని ఆమె విడాకులు తీసుకుంది.
హెల్త్ టిప్
అన్నం తిన్నాక స్నానం
చేయకండి. అందువల్ల కాళ్లు, చేతుల్లోకి రక్తం అధికంగా ప్రవహిస్తుంది. దాంతో పొట్ట చుట్టూ ఉండే రక్తం తగ్గిపోతుంది. దీనివల్ల జీర్ణక్రియ బలహీనపడుతుంది.
వెస్ట్ బెంగాల్‌కి చెందిన ప్రైవేట్ ఆర్థిక వ్యాపార
english title:
mini mag
Date:
Sunday, June 23, 2013