ఆండ్రాయిడ్ ఆపరేటింగ్
సిస్టం అనేది ఓపెన్ సోర్స్
ఆపరేటింగ్ సిస్టం. అందరి
మన్ననలనూ ఇట్టే
పొందింది. కొత్త స్మార్ట్
ఫోన్లలో మెజారిటీ
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్
సిస్టంతో పనిచేసేవే.
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్
సిస్టం వాడకంలో లాంగ్
ప్రెస్, స్పేస్ బార్,
రిజెక్యింగ్ కాల్, బ్రౌజింగ్ -
ఇలా పలు అంశాలలో
టిప్స్, ట్రిక్స్ చాలానే
ఉన్నాయి.
ఆండ్రాయిడ్ ఫోన్‌లో
తెరపై సమయం మాత్రమే
కనిపిస్తుంది.
దాంతోపాటు తేదీనీ
చూడాలంటే, సింపుల్,
నోటిఫికేషన్ ట్రేని కిందకి
లాగి వదిలితే సరి. తేదీ
కూడా కనిపిస్తుంది.
అలాగే, మన ఫోన్
రింగైతే, వినపడకుండా
సైలెంట్ మోడ్‌లో
ఉంచాలనుకోండి. ఫోన్
పవర్ బటన్, వాల్యూమ్
బటన్‌లను వాడి సైలెంట్
మోడ్‌లో ఉంచవచ్చు.
అందుకోకూడదనుకున్న
కాల్స్‌ను నేరుగా వాయిస్
మెయిల్ బాక్స్‌లోకి
పంపవచ్చు. దీనికి
కాంటాక్ట్ ఎడిట్‌లోకి వెళ్లి
అడిషనల్ ఇన్ ఫోలో
సెండ్ డైరెక్ట్లీ టు వాయిస్
మెయిల్ అనే ఆప్షన్ సెట్
చేస్తే సరిపోతుంది. ఇక
బ్రౌజింగ్ చేసేటపుడు
ఫాంట్ పెద్దదిగా
కనిపించాలంటే,
మెనూలో మోర్
సెట్టింగ్స్‌లోకి వెళ్లి టెస్ట్
సైజును లార్జ్‌కు సెట్‌చేస్తే
చాలు. మీ ఫోన్‌లో
ఎక్కువ ఐకాన్లుంటే, ఒకే
తరహా అప్లికేషన్స్‌తో
పలు ఫోల్డర్లను ఏర్పాటు
చేసుకోవచ్చు.
అన్నట్టు, హోం స్క్రీన్‌లో
బ్యాక్‌గ్రౌండ్‌పై నొక్కి పట్టి
ఉంచితే చాలు. ప్రత్యేక
ఆప్షన్లు కనిపిస్తాయి.
వాటిలోని షార్ట్‌కట్‌లతో
కావల్సిన అప్లికేషన్లను
తెరపై ఉంచుకోవచ్చు.
హోం కీని నొక్కి ఉంచితే,
అపుడే వాడిన 8
అప్లికేషన్లను మనం
చూడొచ్చు. (రీసెంట్లీ
యూస్డ్ ఆప్స్). బాక్ కీని
నొక్కి పెడితే, బుక్
మార్క్‌లు, ఎక్కువగా
విజిట్ చేసిన సైట్ల
చిరునామాలూ
కనిపిస్తాయి.
ఇతర భాషల్లో కీబోర్డులు
కావాలంటే ఆప్స్ స్టోర్
నించి డౌన్‌లోడ్ చేసి
ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
అలాగే, గూగుల్
మాప్స్‌ను ఫ్రీగా ఇన్‌స్టాల్
చేసుకోవచ్చు. కొన్నిట్లో
అది ప్రీ ఇన్‌స్టాల్డ్‌గా
వస్తుంది.
ఆండ్రాయిడ్ ఫోన్లలో సెల్ఫ్
పోట్రేట్ మోడ్ వాడి మీ
ఫొటో మీరే తీసుకోవచ్చు.
ఆండ్రాయిడ్ ఫోన్లలో
ఉండే అడ్రస్ బుక్‌లో
కేవలం పేర్లు కాకుండా,
ఫొటోలను నొక్కితే వచ్చే
మెనూల నుంచి ఫోన్
చేయడం, మెసేజ్
పంపడం, ఇ-మెయిల్
పంపడం కూడా
చేయవచ్చు.
ఆండ్రాయిడ్ వాయిస్
కమాండ్స్‌తో మనం 10
కమాండ్‌లను రికార్డు చేసి
ఉంచుకోవచ్చు. వీటితో
సౌలభ్యం ఉంది.
ఉదాహరణకు, కాల్
రామారావ్ అని ఒక
కమాండ్ రికార్డు చేసి
ఉంచామనుకోండి. దాన్ని
ఎంచుకొంటే, రామారావ్
అనే మిత్రునికి కాల్
వెళ్తుందన్నమాట.
బ్రౌజింగ్ చేసేటపుడు ఒక
పదాన్ని
వెదకాలనుకోండి.
అపుడు మెనూ కీలో
మోర్ పై క్లిక్ చేస్తే, ఫైండ్
ఆన్ పేజ్ ద్వారా సెర్చ్
బాక్స్, కీబోర్డ్
ప్రత్యక్షవౌతాయి.
ఫేస్‌బుక్‌లో దేన్నన్నా
షేర్ చేయాలంటే,
సింపుల్. మెనూలో
మోర్ ఎంచుకొని
అందులో షేర్ పేజ్‌లోకి
వెళ్లాలి. అందులో
ఫేస్‌బుక్ ఆప్షన్
ఎంచుకోవాలి. ఎటొచ్చీ,
ఇంటర్నెట్ కనెక్టయి
ఉండాలంతే.
ఆండ్రాయిడ్ ఫోన్‌ను
సమర్థవంతంగా
వాడటానికి ఇలా ఎన్నో
చిట్కాలున్నాయి.
అన్నట్టు, ఆండ్రాయిడ్‌లో
ఆడుకోవడానికి బోలెడు
గేమ్స్ ఉన్నాయి. వీటి
గురించి వేరేగా
చెప్పనక్కర్లేదనుకుంటా.
షార్ట్ కట్స్ (్ఫటోషాప్
7.0 టూల్స్)
M మార్కీ టూల్
N నోట్స్ టూల్
O డాడ్జ్ బర్న్ స్పాంజ్
టూల్
P పెన్ టూల్
తెలుసుకోవాల్సిన
సంగతి..
లాప్‌టాప్ కొంటున్నారా?
లాప్‌టాప్ కంప్యూటర్లలో
99 శాతం పేరున్న
బ్రాండ్లే ఉన్నాయి.
లాప్‌టాప్ కొనేట్లయితే,
ప్రాసెసర్ కొత్త తరానిదా
కాదా చూసుకోవాలి.
మెయిన్ మెమరీ కనీసం
4 జిబి ఉండాలి.
వీడియో గ్రాఫిక్స్‌తో పని
చేసేట్లయితే
కావలసినంత వీడియో
రామ్ ఉండేలా
చూసుకోవాలి. మానిటర్
స్క్రీన్ 12 నించి 17
అంగుళాల దాకా ఉండేలా
వివిధ మోడల్స్
ఉన్నాయి. మీ
అవసరాన్నిబట్టి దాన్ని
ఎంచుకోవాల్సి ఉంటుంది.
హార్డ్ డిస్క్ కనీసం 300
జిబి ఉండాలి. నిజానికి
ఇపుడొచ్చే లాప్‌టాప్‌లలో
500 జిబి కనీసం
ఉంటోంది. కానీ, మీరు
గ్రాఫిక్స్ ఎక్కువగా
వాడేట్లయితే, హార్డ్ డిస్క్
1 టిబి ఉండేలా
చూసుకోవడం మంచిది.
వైఫీ, బ్లూటూత్
మామూలే. అలాగే డివిడి
డ్రైవ్ ఉండేలా
చూసుకోండి.
అన్నిటికన్నా ముఖ్యం
బ్యాటరీ లైఫ్. విద్యుత్
సరఫరా లేకుండా కేవలం
బ్యాటరీ మీదే ఎంతసేపు
పని చేయగలదనేది
చాలా ముఖ్యమైన
అంశం. సాధారణంగా 3
గంటలు కనిష్టంగా 7, 8
గంటలు గరిష్టంగా బ్యాటరీ
మీద పనిచేసేలా
లాప్‌టాప్‌లు
లభిస్తున్నాయి.
అన్నిటికన్నా ముఖ్యం
మీ బడ్జెట్.
తానుండేందుకు స్థలం
లేదు కానీ, మెడకో
డెస్క్‌టాప్
తగిలించుకున్నట్టు.
నెట్ న్యూస్
ఇంటెల్ నాలుగో తరం
కోర్ సిరీస్ ప్రాసెసర్లు
ఇంటెల్ తన నాలుగో
తరం కోర్ సిరీస్
ప్రాసెసర్లను
ప్రవేశపెడుతున్నట్టు
ప్రకటించింది. ఈ ప్రాసెసర్ల
రూపకల్పనలో
పనితనంకన్నా అది వాడే
విద్యుత్ ప్రధానాంశంగా
ఇంటెల్ ఎంచుకుంది. ఈ
ప్రాసెసర్ల కోడ్ నేమ్
హాస్వెల్. ఈ ప్రాసెసర్లు
15 వాట్లకన్నా తక్కువే
విద్యుత్‌ను ఖర్చు
చేస్తాయిట. లో అండ్ కోర్
ఐ 5 4430 ప్రాసెసర్
197 అమెరికన్ డాలర్లు
(దాదాపు రూ.12
వేలు) ఉంటే, కోర్ ఐ7
4470 మోడల్
ప్రాసెసర్ 368 డాలర్ల
దాకా (దాదాపు రూ.22
వేలు) ఉండవచ్చు. ఇవి
ముఖ్యంగా లాప్‌టాప్‌లలో
బాటరీ సేవ్
చేయగలవంటున్నారు.
ఈ నెలాఖరులోకి లేదా
జూలై నెలలోకెల్లా ఈ
ప్రాసెసర్లు 4 మోడల్స్‌లో
మార్కెట్లోకి
వస్తాయంటున్నారు. ఆ
ప్రాసెసర్‌ను
వాడుకోవాలంటే మదర్
బోర్డూ మార్చాల్సిందే
నంటున్నారు
విశే్లషకులు.
పద పారిజాతం
Wi-Fi వైఫీ
అంటే వయర్లెస్ యాక్సెస్
నిచ్చే నెట్‌వర్క్ సౌకర్యం
WAN వైడ్ ఏరియా
నెట్‌వర్క్. అంటే విశాల
వైశాల్య (్భగోళికంగా)
నెట్‌వర్క్. నిక్‌నెట్,
ఏపీస్వాన్ ఉదాహరణలు.
కంప్యూటర్ కబుర్లు
english title:
computer kaburlu
Date:
Sunday, June 23, 2013