Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

వాసవీ క్లబ్ సేవా కార్యక్రమాలు అభినందనీయం

$
0
0

ఒంగోలు, ఫిబ్రవరి 27: వాసవీ క్లబ్ ఒంగోలు ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించటం అభినందనీయమని జిల్లా ఎస్పీ కె రాఘురాంరెడ్డి ప్రశంసించారు. వాసవీ క్లబ్ ఒంగోలు ఆధ్వర్యంలో విశిష్ట సేవా కార్యక్రమాల్లో భాగంగా సోమవారం స్థానిక రంగారాయుడు చెరువు వాకర్స్ ట్రాక్‌పై మొక్కలు నాటటం, విశ్రాంతికి ఏర్పాటుచేసిన బల్లలు ప్రారంభించారు. అనంతరం మాంటిస్సోరీ స్కూల్ ఆవరణలో ఎంపిపి స్కూల్‌లోని పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగ్‌లు, పుస్తకాలు, పెన్నుల పంపిణీ కార్యక్రమం జరిగింది. తదనంతరం ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె రఘురాంరెడ్డితో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలకు ముఖ్యఅతిధులగా హాజరైన జిల్లా ఎస్పీ కె రఘురాంరెడ్డి మాట్లాడుతూ వాసవీక్లబ్ ఒంగోలు ద్వారా ఎన్నో విశిష్ట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఒంగోలు ప్రజలకే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ పేరు ప్రతిష్టలు పొందటం అభినందనీయమన్నారు. అంతర్జాతీయ వాసవీ క్లబ్ స్పెషల్ అవార్డు ట్రోఫీని సిద్ధా సూర్యప్రకాశరావుకు జిల్లా ఎస్పీ కె రఘురాంరెడ్డి, కమిషనర్ ఎస్ రవీంద్రబాబు, ఆర్‌టిఓలు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ రవీంద్రబాబు మాట్లాడుతూ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువవుతున్న వాసవీ క్లబ్ ప్రతినిధులను అభినందించారు. ఈ సేవా కార్యక్రమాలన్ని వాసవీక్లబ్ ఒంగోలు అధ్యక్షులు కనకయ్య అధ్యక్షతన ఐపిపి, జోన్ చైర్మన్ ఇస్కాల వేణుగోపాల్, కార్యదర్శి కనమర్లపూడి వెంకట సుబ్బారావు నిర్వహణలో జరిగాయి. ఈ విశిష్ట సేవా కార్యక్రమాలకు ఒంగోలు రవాణాధికారి అల్లాభక్షు, కార్పొరేషన్ కమిషనర్ ఎస్ రవీంద్రబాబు, కె మురళీధర్‌రెడ్డి, ఇంటర్నేషనల్ వాసవీక్లబ్స్ డైరెక్టర్ శిద్ధా సూర్యప్రకాష్, గవర్నర్ కాకా మధుసూధన్, జోన్ చైర్మన్ ఇస్కాల వేణుగోపాల్, బ్లడ్ అండ్ ఐ డొనేషన్ చైర్మన్ సిహెచ్ జయరాం, ఒంగోలు ఎంఇఓ డి వెంకట్రావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆనందబాబు, సిఎం రవికుమార్, బి వరదరాజన్, ఎ మధు, ఎ శివ, కె రాధాకృష్ణ, ఎ సతష్, పి రామస్వామి, డివి రాఘవ, ఎం సుబ్రహ్మణ్యం, ఎం సుబ్బారాయుడు, టి శివ తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమం పట్టని ప్రభుత్వం
టిడిపి నేత కరణం ధ్వజం
సంతనూతలపాడు, ఫిబ్రవరి 27: రాష్ట్రంలో కాంగ్రెస్ పాలకులు ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి ధ్వజమెత్తారు. మండలంలోని ఎనికపాడు గ్రామంలో సోమవారం టిడిపి క్రీయాశీలక సభ్యత్వ గుర్తింపు నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా బలరాం మాట్లాడుతూ, గత పాలకులు ఒత్తిడి చేసి ఎస్‌టిసి ద్వారా పొగాకు కొనుగోలు చేసి రైతుకు మద్దతు ధర వచ్చే విధంగా ప్రయత్నించారని తెలిపారు. పొగాకు బోర్డు పొగాకు కొనుగోలుకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసిందని ఆయన పేర్కొన్నారు. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తుంటే ఆరుగాలం కష్టించిన రైతు మాత్రం నష్టపోతున్నాడని అన్నారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావటంలేదని, వ్యవసాయం నష్టాల ఊబిలో కూరుకుపోతోందని సోమనాథ్, జయతి ఘోష్ కమిటీలు నివేదికలను ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పాలకులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వివిధ కమిటీల నివేదికలను అమలు చేయకుండా బుట్టదాఖలు చేసిన ఘనత ఈ ప్రభుత్వానేదని అన్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలకు మద్దతు ధర ఇవ్వకుండా వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ ఒక్క సమస్య పరిష్కరించిన దాఖలాలు లేవని ఆయన మండిపడ్డారు. గత సంవత్సరం రైతుల నుండి విత్తనాల సేకరణలో భాగంగా తీసుకున్న శనగ రైతులకు నేటికీ డబ్బులు చెల్లించలేదని ఆయన పేర్కొన్నారు. రైతాంగ సమస్యలపై ప్రతిఒక్కరు స్పందించి పోరాటం చేయవల్సిన సమయం ఆసన్నమైందని ఆయన రైతులకు పిలుపునిచ్చారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి రైతుపై ఉందన్నారు. అనంతరం గ్రామంలోని సీనియర్ నాయకుడు నల్లూరి గజ్జలయ్యకు ఆయన పార్టీ సభ్యత్వ కార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సిరిపురపు రుద్రయ్య, మద్దినేని హరిబాబు, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి మన్నం శ్రీ్ధర్‌బాబు, మాజీ డెయిరీ డైరెక్టర్ నల్లూరి గజ్జలయ్య, వివరం గోవిందు, పుట్టా సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ వర్గీకరణ చేయకపోతే
‘కాంగ్రెస్‌కు ఓటమి తప్పదు’
ఒంగోలు, ఫిబ్రవరి 27: షెడ్యూల్డు కులాల రిజర్వేషన్ వర్గీకరణ బిల్లును ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించకపోతే కాంగ్రెస్ పార్టీకి రానున్న ఎన్నికల్లో ఓటమి తప్పదని మాదిగ మహిళా సమాఖ్య రాష్ట్ర కో ఆర్డినేటర్ రామచంద్ర మాదిగ హెచ్చరించారు. మాదిగ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ భవనంలో సోమవారం మాదిగ మహిళా సమాఖ్య జిల్లా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షురాలు మందా ఎస్తేరురాణి అధ్యక్షత వహించారు. సమావేశంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సిహెచ్ విజయ మాదిగ, రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎం విజయ మాదిగలు మాట్లాడుతూ వర్గీకరణ చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి ఆ తర్వాత విస్మరించడం దారుణమన్నారు. మాదిగలను మోసం చేయాలని చూస్తే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించటానికి మాదిగ మహిళలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ సమావేశంలో ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ, జిల్లా ఉపాధ్యక్షులు టి బాబు మాదిగ, ఎంఎంఎస్ జిల్లా కో ఆర్డినేటర్ పి కరుణమ్మ, మాదిగ మహిళలు తదితరులు పాల్గొన్నారు.
3వ రోజుకు చేరిన రిలే దీక్షలు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ మాదిగ రిజర్వేషన్ సమితి (ఎంఆర్‌పిఎస్) ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కలెక్టరేట్ వద్ద చేస్తున్న రిలే నిరాహార దీక్షలు సోమవారం నాటికి మూడవ రోజుకు చేరాయి. ఈ రిలే నిరాహార దీక్షలు మార్చి 25వ తేది వరకు జరుగుతాయని ఎంఆర్‌పిఎస్ నాయకులు తెలిపారు. సోమవారం రిలే దీక్ష ఒంగోలు మండల చెరువుకొమ్ముపాలెం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ముఖ్యఅతిధిగా ఎంఆర్‌పిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు టి బాబు మాదిగ పాల్గొని దీక్షను ప్రారంభించారు. దీక్షను ఉద్దేశించి బాబు మాదిగ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి మాదిగ జాతికి న్యాయం చేస్తుందో ఇంకా మాదిగలను మోసం చేసి రాబోయే ఎన్నికల్లో మాదిగల సత్తాను చూస్తుందో కాంగ్రెస్ ప్రభుత్వం తేల్చుకోవాలని హెచ్చరించారు. సోమవారం జరిగిన దీక్షల్లో ఎంఆర్‌పిఎస్ జిల్లా కార్యదర్శి తొరటి ఆనంద్ మాదిగ, తాటిపర్తి సామ్మేల్, తాటిపర్తి రమేష్‌బాబు, తాటిపర్తి విజయానందబాబు, భీమవరపు సుబ్బారావు, కొమ్ము మరియదాసు, భీమవరపు గాంధీ, భీమవరపు చందు, పాలేటి వాసు, జడ నాగరాజు, జడ రవి, టి రాజు, పాలేటి వినోద్‌కుమార్, బొప్పూరి చంటి తదితరులు పాల్గొన్నారు.

విజిలెన్స్ అధికారుల దాడి
రెండు రైస్‌మిల్లులు సీజ్
యర్రగొండపాలెంరూరల్, ఫిబ్రవరి 27: మండలంలోని బోయలపల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి రెండు రైస్ మిల్లులను సీజ్ చేశారు. రీజనల్ విజిలెన్స్ ఎన్‌ఫోర్సుమెంటు అధికారి సాంబయ్య ఆదేశాల మేరకు దాడులు నిర్వహించినట్లు ఒంగోలు విజిలెన్స్ డివైఎస్పీ సుబ్బారెడ్డి తెలిపారు. సీజ్ చేయబడిన రైస్‌మిల్లులకు లైసెన్సులు లేవని, రికార్డులు సరిగా నిర్వహించడం లేదని తెలిపారు. తమ తనిఖీలో 250 బస్తాల ధాన్యం, 87బస్తాల బియ్యం, 6బస్తాల నూకలు అక్రమంగా ఉన్నట్లు తేలాయని అన్నారు. వీరి వెంట విజిలెన్స్ సిఐలు కిశోర్, సంజీవ్‌కుమార్, డిప్యూటీ తహశీల్దార్ ఎంఎస్‌ఆర్‌కె శర్మ, విఆర్‌ఓ అల్లూరయ్యలు పాల్గొన్నారు.

ఎస్పీ రఘురాంరెడ్డి ప్రశంస
english title: 
vasavi club

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>