Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

నిర్మాణ రంగానికి ‘విద్యుత్’ షాక్!!

$
0
0

శ్రీకాకుళం: కరెంటోళ్ళ పిడికిలి దెబ్బకు సామాన్యుడే కాదు, పెద్ద పరిశ్రమల యజమానులు విలవిల్లాడే దుస్థితి నెలకొంది. విద్యుత్ కొరత కారణంగా వ్యవసాయానికి నిరంతర విద్యుత్ మాట దేవుడెరుగు పారిశ్రామిక రంగానికి కోలుకోలేని దెబ్బపడనుంది. ప్రధానంగా విద్యుత్‌పైనే ఆధారపడే సిమెంట్, ఐరన్ పరిశ్రమలకు షాకిచ్చే దిశగా నిర్ణయాలు తీసుకోవడంతో మార్చి 1వతేదీ నుంచి సిమెంట్, ఐరన్ ధరలు పెంచేందుకు పరిశ్రమలు సిద్ధమయ్యాయి. ఈమేరకు జిల్లాలోని హోల్‌సేల్, రిటైల్ వ్యాపారస్తులకు కూడా సిమెంట్ కంపెనీల నుంచి ఆదేశాలు అందినట్లుగా విశ్వసనీయ సమాచారం.
రాష్ట్రంలో ఎదుర్కొంటున్న విద్యుత్ కొరత ప్రభావంతో పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించేందుకు సన్నద్దమవుతున్న తరుణంలో విద్యుత్‌పైనే ఆధారపడే పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిచిపోతే దాని నష్టం భరించేందుకు సిద్ధంగా లేకపోవడంతో దానిని ప్రజలపైనే భారం వేసేందుకు సన్నద్దమవుతున్నట్లు సమాచారం. ఇటీవల జిల్లాలో నిర్మాణ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. మారుమూల గ్రామాలు, పంచాయతీల్లో బహుళ అంతస్థుల భవనాల నిర్మాణం జోరుగా జరుగుతోంది. ఈ నెలలో అత్యధిక ముహూర్తాలు ఉండడంతో కొత్తగా ఇళ్ళు నిర్మించే వారంతా భూమి పూజలు చేసి, నిర్మాణాలు ప్రారంభించేశారు. ఇటువంటి తరుణంలో నిర్మాణ రంగానికి ప్రధాన వనరులైన సిమెంట్, ఇనుము ధరలు పెంచేందుకు పరిశ్రమలు సిద్ధమవడంతో గృహ నిర్మాణదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. విద్యుత్ కొరత కారణంగా పెద్ద పరిశ్రమల్లోనే ఉత్పత్తి నిలిచిపోతుండడంతో, రాష్ట్రంలో సుమారు 35వరకు ఉన్న చిన్న చిన్న పరిశ్రమలు ఏకంగా వేసవిలో మూసివేయాలనే నిర్ణయించినట్లు తెలిసింది.
శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 365 మంది సిమెంట్, ఐరన్ డీలర్లు నెలకు సుమారు 50వేల టన్నుల సిమెంట్, ఐదువేల టన్నుల ఐరన్ అమ్మకాలు చేస్తున్నారు. మార్చి 15వతేదీ వరకు మాత్రమే ముహూర్తాలు ఉండడమే కాకుండా, తరువాత నాలుగు నెలల వరకు మంచి ముహూర్తాలు లేకపోవడంతో గృహ నిర్మాణ పనులు అన్ని ఈ రెండు నెలల్లోనే ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పనులు ప్రారంభించిన వారు కూడా వేసవిలో నిర్మాణాలు పూర్తి చేయాలనే సంకల్పంతో పనులు వేగంగా చేయిస్తున్నారు. ఇటువంటి తరుణంలో సిమెంట్, ఐరన్ ధరలు పెరుగుతాయనే విషయం పెద్ద షాక్ ఇచ్చింది. పవర్ హాలిడే షాక్ కేవలం పరిశ్రమలకే కాకుండా, నిర్మాణ రంగానికి కూడా తగిలింది. ప్రస్తుతం సిమెంట్ ధరలు బస్తా రూ.285 నుంచి 290 వరకు ఉన్నాయి. మార్చి 1వతేదీన ముందుగా పది రూపాయలు, వారం వ్యవధిలో పది రూపాయల చొప్పున పెం చుకుంటూ, ఒక్క నెలలోనే 30 రూపాయల వరకు పెంచాలని సిమెంట్ కంపెనీల నుంచి జిల్లాలోని డీలర్లకు ఇప్పటికే ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం 49వేల రూపాయలు ఉన్న టన్ను ఐరన్ ధర మార్చి నుంచి అదనంగా మరో రూ.1500 వరకు పెరగనున్నట్లు సమాచారం. దీనికి తోడు ట్రాన్స్‌పోర్ట్, లేబర్ సమస్య కూడా తోడవడంతో సిమెంట్ రవాణాపై పెను ప్రభావం పడనుంది. ఇక నిర్మాణ రంగానికి ప్రధానంగా అవసరమైన ఇసుక, ఇటుక, చిప్స్ ధరలు కూడా పెంచేందుకు కాంట్రాక్టర్లు సిద్ధమవుతున్నారు. ధరలు పెంచేందుకు కంపెనీలు సిద్ధమవడంతో జిల్లాలో ఉన్న హోల్‌సేల్, రిటైల్ డీలర్లు ముందస్తుగానే సిమెంట్, ఐరన్ లోడ్లు తెప్పించుకుని గొడౌన్లలో స్టాక్ ఉంచుకుంటున్నారు. ప్రస్తుతం మార్చి నెల వరకు ఎంత వరకు ధరలు పెంచాలని కంపెనీలు నిర్ణయించినప్పటికీ, పవర్ హాలిడే ప్రభావంతో విద్యుత్ కొరత అధికమైతే సిమెంట్, ఐరన్ ధరలు పెరిగే అవకాశం ఉందని హోల్‌సేల్ సిమెంట్ డీలర్లు చెబుతున్నారు.

* భారీగా పెరగనున్న వ్యయం * ధరలు పెంచేందుకు పరిశ్రమలు సిద్ధం * జిల్లా ప్రజలపై అదనపు భారం
english title: 
vidyuth shock

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>