శ్రీకాకుళం, ఫిబ్రవరి 27: జిల్లాలో ఐకెపి కేంద్రాలకు అంగన్‌వాడీ ఫుడ్ ఇవ్వాలనే నిర్ణయాన్ని ఉపసంహరించాలని కోరుతూ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌వద్ద సోమవారం నిరవధిక ధర్నా ప్రారంభించారు. ఈ ధర్నా మార్చి 3వతేదీ వరకు కొనసాగుతుంది. ఈ సందర్భం గా సంఘం జిల్లా కార్యదర్శి పి.అరుణ మాట్లాడుతూ జిల్లాలో సీతంపేట, కొత్తూరు, భామిని, జి.సిగడాం, నందిగాం, గార, రణస్థలం మండలాల్లో ఐకెపి ద్వారా న్యూట్రిషన్ డేకేర్, బాలబడులకు ఐసిడిఎస్ ద్వారా సప్లై చేస్తున్న అంగన్‌వాడీ పౌష్టికాహారాన్ని అప్పగించాలని నిర్ణయించినట్లు వౌఖికంగా తెలియజేసినట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి ప్రాజెక్టు మీటింగ్ సందర్భంగా కాశీబుగ్గ ప్రాజెక్టు నందిగాం సెక్టార్‌లో ఉన్న 39 అంగన్‌వాడీ కేంద్రాల కార్యకర్తలకు రాతపూర్వకంగా ఆదేశాలు జారీ చేశారన్నారు. దీనిపై అంగన్‌వాడీ ఉద్యోగులందరూ ఆందోళన చెందుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు బలహీనపడే ప్రమాదం ఉందని, ఐకెపికి ఐసిడిఎస్ ఫుడ్ అప్పగించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించి ఐసిడిఎస్.ను పటిష్టపరిచే చర్యలను చేపట్టాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ కేంద్రా ల పరిధిలో ఐకెపి న్యూట్రిషన్, డేకేర్ బాలబడులు, ఇతర సెంటర్లకు అనుమతించరాదని డిమాండ్ చేశారు. కేంద్రం పెంచిన వేతనాలు ఏరియర్స్‌తో వెంటనే చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సమానంగా వేతనాలు పెంచాలన్నారు. సిఐటియు యూనియన్‌తో జిల్లాస్థాయి జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యలు చర్చించి పరిష్కరించాలన్నారు. ధర్నాలో జిల్లా అధ్యక్షురాలు కె.సుజాత, సహాయ కార్యదర్శి హిమప్రభ, ఉపాధ్యక్షురాలు జయలక్ష్మీ, లతాదేవి పాల్గొన్నారు.
‘ఉపాధి’ నిధుల కేటాయింపులపై ఆగ్రహం
ఎచ్చెర్ల, ఫిబ్రవరి 27: నిబంధనలకు విరుద్దంగా ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఉపాధి నిధులు కేటాయింపులపై తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి సారధ్యంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రత్యేకాధికారి వై.లక్ష్మణరావు నేతృత్వంలో మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌కు వారంతా చేరుకుని అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. అధికారులు ఏకపక్ష వైఖరి విడనాడాలని వారంతా నినాదా లు చేశారు. అధికారుల ఎదుట బైఠాయించి ప్రభుత్వం మంజూరు చేసిన ఉపాధి నిధులు అన్ని గ్రామాలకు ఒకే ప్రాతిపతికన కేటాయించాలని వారం తా పట్టుపట్టారు.
ముద్దాడ గ్రామ పం చాయతీలో ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గా ల అభివృద్ధి నిమిత్తం 35 లక్షల రూపాయలు గడిచిన ఉపాధి పనులను ప్రాతిపదికగా చేసుకుని కేటాయించినప్పటికీ ఇప్పటివరకు అనుమతులు ఇవ్వకుండా మోకాలడ్డటం సరికాదని వారంతా ఆగ్ర హం వ్యక్తంచేశారు. కొయ్యాం, పొన్నా డ గ్రామాలకు అనుమతులు ఇచ్చి ముద్దాడకు తీరానంలో జాప్యం జరిగిందని, నేటివరకు మంజూరు పత్రాలు జా రీచేయకపోవడం అధికారుల పక్షపాత ధోరణికి నిదర్శనమన్నారు. ఈ సమస్య పరిష్కరించేంత వరకు ఇక్కడనుంచి కదిలి వెళ్లేది లేదని వారంతా ఉదయం 11 గంటల నుంచి సుమారు రెండు గం టల వరకు గ్రీవెన్స్ సమావేశ మందిరం లో బైఠాయించి నిరసన కొనసాగించా రు. అలాగే మండల పరిషత్‌కు మంజూరైన 50 లక్షల రూపాయల నిధులను అధికార పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా తమ గ్రామ పంచాయతీలకు వడ్డించుకుని, మిగిలిన పంచాయతీలకు అన్యా యం చేశారని వారంతా ఆరోపించారు. మరో ఆరునెలలు ప్రత్యేక పాలన కొనసాగే పరిస్థితులు సుస్పష్టవౌతున్న తరుణంలో అధికారులు పారదర్శకం గా వ్యవహరించకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లా పనిచేయడం సరికాదని, దీనిపై ఉద్యమించాల్సి ఉంటుందని బాబ్జీ హెచ్ఛరించారు. గ్రామాల్లో వీధి లైట్లు, మంచినీటి అవసరాలు పారిశు ద్ధ్య పనుల నిర్వహణ పూర్తిగా కుంటుపడ్డాయని, ఇటువంటి అంశాలను దృష్టి లో ఉంచుకుని పౌరులకు సేవలందేలా అధికారులు వ్యవహరించకుండా ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని, తీరు మార్చుకోకుంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని వారంతా స్పష్టం చేశారు.
దిగివచ్చిన అధికారులు
తమ్ముళ్లు నిరసనకు అధికారులు దిగివచ్చి మార్చి 16వతేదీన ముద్దాడ గ్రామంలో గ్రామసభ నిర్వహించి ఉపాధి హామీ పనులకు సంబంధించిన అనుమతులు మంజూరు చేస్తామని ప్రత్యేకాధికారి వై.లక్ష్మణరావు, ఎంపీడీవో జి.విజయభాస్కరరావు, తహశీల్దార్ వి.శివబ్రహ్మానంద్ వెల్లడించడంతో తెలుగుదేశం నేతలు శాంతించారు. దీంతో వివాదం సద్దుమణిగింది.
* అంగన్‌వాడీ వర్కర్స్ నిరవధిక ధర్నా
english title:
arrears
Date:
Tuesday, February 28, 2012