నెల్లూరు, జూన్ 23: సాక్షాత్తు పరమశివుడు కళ్లెదుటే సాక్షాత్కరించినంతటి పనైందని చార్‌ధామ్ యాత్ర నుంచి తిరిగి వచ్చిన 53 మంది బాధితులు పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి ఆదివారం మధ్యాహ్నం నెల్లూరు ఛేరుకున్న వీరికి స్థానిక రైల్వే స్టేషన్‌లో బంధువులు, శ్రేయోభిలాషులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా యాత్రీకులు మాట్లాడుతూ, దేవుడున్నాడని.. అందువల్లే తాము ప్రాణాలతో సురక్షితంగా ఇంటికి చేరుకోగలిగామని భావోద్వేగంతో అన్నారు. ట్రావెల్ ఏజెంట్ నిర్వాకం వల్ల సొంత ఊరు చేరుకుంటామన్న భరోసా కూడా ఒకానొక దశలో కరవైందన్నారు. గంగానది అకస్మాత్తుగా పొంగి ప్రవహించడంతో ఎక్కడికక్కడ దారి తెన్నూ తెలియని పరిస్థితుల్లో చిక్కుకున్నామన్నారు. అన్నపానీయాలు లభించక ఇక్కట్లు పాలైనట్లు తెలిపారు. చేతిలో డబ్బున్నా కొనుక్కుని తినడానికి అక్కడ ఏమీ లభించక నరకయాతన అనుభవించామని, తమ క్షేమ సమాచారం బంధువులకు అందజేయలేక తీవ్ర ఉద్వేగానికి లోనయ్యామన్నారు. యాత్రికులను ఆదుకోవడంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించినప్పటికీ సైనిక జవాన్ల సహాయ చర్యల వల్ల క్షేమంగా ఇంటికి చేరుకోగలిగామన్నారు.
సాక్షాత్తు పరమశివుడు కళ్లెదుటే సాక్షాత్కరించినంతటి
english title:
d
Date:
Monday, June 24, 2013