కర్నూలు, జూన్ 23: కర్నూలు జిల్లా ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు ఎట్టకేలకు పట్టాలెక్కనుంది. ఈ రైలును మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పచ్చ జెండా ఊపి ప్రారంభించనున్నారు. దీనితోపాటు బడ్జెట్‌లో ప్రకటించిన కర్నూలు, నంద్యాల మధ్య కొత్త ప్యాసింజరు రైలు కూడా ప్రారంభం కానున్నది. కర్నూలు టౌన్ రైల్వే స్టేషన్‌గా ఉన్న పేరును కర్నూలు సిటీ రైల్వే స్టేషనుగా మారుస్తూ జారీ అయిన ఆదేశాలు కర్నూలు రైల్వే అధికారులకు చేరడంతో ఆ మేరకు స్థానిక రైల్వే స్టేషనులో బోర్డులను మారుస్తున్నారు. సిటీస్టేషన్‌గా మారడంతోనే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రవేశ పెట్టేందుకు మార్గం సుగమమైంది. ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు అడ్డంకులు ఉన్నందున కర్నూలు, సికింద్రాబాదు మధ్య కొత్తగా ఒక ఎక్స్‌ప్రెస్ రైలును ప్రవేశ పెడుతున్నట్లు రైల్వే బడ్జెట్‌లో ప్రకటించారు. ఆ రైలును ఇంటర్‌సిటీగా మార్చుకునేందుకు కేంద్రమంత్రి కోట్ల తనవంతు ప్రయత్నం చేసి ఫైలును శరవేగంగా కదిలించి సిటీ రైల్వే స్టేషనుగా మార్చుకోగలిగారు. దాంతో కొత్తగా మంజూరయిన ఎక్స్‌ప్రెస్ రైలునే ఇంటర్‌సిటీగా ప్రవేశ పెడుతున్నారు. కాస్త ఆలస్యమే అయినా మంగళవారం నుంచి ప్రతిరోజు కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు ఉదయం కర్నూలు నుంచి, సాయంత్రం సికింద్రాబాదు నుంచి రాకపోకలను ప్రారంభిస్తుంది. ప్రారంభ రోజున ఉదయం 9గంటలకు రైలుకు పచ్చజెండా ఊపిన అనంతరం కొత్త రైలు వేళలను ప్రకటించనున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. కాగా ఇటీవలి బడ్జెట్‌లో ప్రకటించిన కర్నూలు, నంద్యాల ప్యాసింజరు రైలు కూడా మంగళవారం ప్రారంభం కానుంది. ఆ రైలు వేళలను, టికెట్ ధరలను అదే రోజున ప్రకటించనున్నారు.
షార్‌కు చేరిన జి శాట్
రెండు ప్రయోగాలకు ఇస్రో సన్నద్ధం
సూళ్లూరుపేట, జూన్ 23: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జూలై 1న పిఎస్‌ఎల్‌వి, ఆగస్టు తొలి వారంలో జిఎస్‌ఎల్‌వి రాకెట్ ప్రయోగాలకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. జూలై ఒకటిన అర్ధరాత్రి 11.47 గంటలకు పిఎస్‌ఎల్‌వి సి-22 రాకెట్‌ను నింగిలోకి పంపనున్నారు. దీనిద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1 ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన రాకెట్ అనుసంధాన పనులన్నీ పూర్తయ్యాయి. జూన్ 12న ప్రయోగించాల్సిన ఈ రాకెట్ రెండో దశలో సాంకేతిక లోపం తలెత్తడంతో శాస్తవ్రేత్తలు లోపాన్ని సవరించి జూలై 1న ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేశారు.
ఆగస్టులో జిఎస్‌ఎల్‌వి ప్రయోగం
ఆగస్టు తొలివారంలో జిఎస్‌ఎల్‌వి రాకెట్‌ను ప్రయోగించేందుకు శాస్తవ్రేత్తలు సిద్ధం చేశారు. ఈ రాకెట్ ద్వారా కక్షలోకి ప్రవేశపెట్టే జిశాట్ ఉపగ్రహం ఆదివారం భారీ భద్రత నడుమ షార్‌కు చేరింది. సోమవారం నుంచి రాకెట్‌లో ఉపగ్రహాన్ని అమర్చే ప్రక్రియలో శాస్తవ్రేత్తలున్నారు. కమ్యూనికేషన్ రంగానికి చెందిన ఉపగ్రహాన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. సుదీర్ఘ విరామం తరువాత రెండు ప్రయోగాలకు ఇస్రో శ్రీకారం చుట్టింది.
ఎస్సీ వర్గీకరణ చేయకుంటే కాంగ్రెస్‌కు నష్టమే
కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ
తెనాలి, జూన్ 23: జనరల్ సీటు ద్వారా ఎంపిగా గెలిచిన తనకు వర్గీకరణ ద్వారా వచ్చే రిజర్వేషన్ ఫలాలు అవసరం లేదని, తన జాతికి ఉన్నతంగా రాణించేందుకు వర్గీకరణ అవసరమని, అదే జరగకుంటే కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యే కోటి మంది మాదిగల్లో తాను ఒకడినని కేంద్ర జాతీయ రహదారుల సహాయ మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలి జెఎమ్‌జె కళాశాలలో ఆదివారం సాయంత్రం జరిగిన ఎంఆర్‌పిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర మహాసభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన తరువాత మాదిగల్లో తొలి కేంద్ర మంత్రిని తానేనని, ఆ అవకాశం సోనియా ద్వారానే లభించిందని అన్నారు. కృష్ణమాదిగ నాయకత్వంలో ఉప్పెనలా వర్గీకరణ కోసం ఉద్యమిస్తున్న మాదిగ జాతి అన్ని రంగాల్లో రాణించాలనే ఆకాంక్ష తనకు ఉందన్నారు. అమ్మను ఒప్పిస్తా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్‌లో పెట్టించే ప్రయత్నం చేస్తానని మాదిగ ఉద్యోగులకు హామీ ఇచ్చారు.
తుంగభద్రకు పెరిగిన వరద
బళ్ళారి, జూన్ 23: శివమొగ్గ, తీర్థహళ్ళి, హాగుంబే తదితర ప్రాంతాలలోకురుస్తున్న వర్షాలతో తుంగభద్ర జలాశయానికి ఇన్‌ఫ్లో రోజు రోజుకూ పెరుగుతోంది. ఆదివారం డ్యాంలోకి 13, 585 క్యూసెక్‌లు నీరు చేరింది. వర్షాలు ఇలాగే కొనసాగితే ఇన్‌ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం డ్యాంలో నీటి మట్టం 1,589.48 అడుగులు ఉండగా, 8.490 టీఎంసీల నీరు నిల్వ ఉందని తుంగభద్ర బోర్డు అధికారులుతెలిపారు. గత ఏడాది ఇదే సమయానికి డ్యాంలో నీటి మట్టం 1580.35అడుగులు 4.302 క్యూసెక్కులుగా ఉండేదని తెలిపారు.
రేపటి నుంచి ‘ఇంటర్‌సిటీ’ పరుగు నంద్యాల ప్యాసింజర్‌కూ గ్రీన్‌సిగ్నల్
english title:
g
Date:
Monday, June 24, 2013