వర్షం పడగానే గుంటలో నీరు నిలువ ఉండి, మురికి నీరుగా మారిన తరువాత ఆ నీటిలో దోమలు నివాసాలు ఏర్పరచుకుని విపరీతంగా వృద్ధి చెందుతాయి.
దోమకాటువల్ల వచ్చే వ్యాధుల్లో తీవ్రమైనవి డెంగ్యూ, చికున్‌గున్యా, మెదడువాపు, మలేరియా. ఈ వ్యాధులను సకాలంలో నయం చేయకపోతే మరణాలు కూడా సంభవిస్తాయి.
అలాగే వర్షాలు పడిన చోట నీరు కలుషితం కావటంతో అతిసార వ్యాధి సంభవిస్తుంది. ఇటువంటి వ్యాధులకు హోమియో బాగా ఉపయోగపడుతుంది.
డెంగ్యూ.. లక్షణాలు: జ్వరం, ఎముకల నొప్పులు, కళ్లల్లోనుంచి నీరు కారడం, కళ్లు కదలించడం కష్టంగా మారడం ఆకలి తగ్గి, వాంతి అయ్యేట్లు ఉండటం, శరీరంపై దద్దుర్లు, పొక్కులు రావడం, ముక్కులోనుంచి రక్తం పడటం, రక్త విరేచనాలు, తలనొప్పి విపరీతంగా ఉండటం.
కారణం: డెంగ్యూ వైరస్, ఏడిస్ ఈజిప్ట్ దోమలు.
డెంగ్యూ సోకిన వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి చేర్చాలి. రోగికి తరచూ ద్రవ పదార్థాలు ఇవ్వాలి. అవసరమైతే రక్తమార్పిడి చేయాలి.
జాగ్రత్తలు: దోమలు నిలువ ఉండే ఆవాసాలైన నీళ్ల తొట్టిలు, టైర్లు, పాడేపోయిన కూలర్లలోని నీళ్లు నిలువ ఉండకుండా వాటిని తీసివేయాలి.
మందులు: డెంగ్యూ వ్యాధి నివారణకు జల్సీమియం అనే మందునును వ్యాధి రాకముందు ఒక రోజు మూడు మోతాదులు తీసుకుంటే వ్యాధి సోకకుండా ఉంటుంది.
వ్యాధి సోకితే యుఫటోరియం పర్ఫోటం అనే మందును వాడటంవల్ల మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాధి నివారణ కూడా త్వరగా జరుగుతుంది.
చికున్ గున్యా: చికున్ గున్యా ప్రాణాంతక వ్యాధి కానప్పటికీ మనిషిని కదలలేని స్థితికి చేర్చి, శారీరకంగా, మానసికంగా కృంగిపోయేట్లు చేస్తుంది.
లక్షణాలు: వైరస్ సోకిన వెంటనే అధిక జ్వరం, తీవ్రమైన కీళ్లనొప్పులు ఉండి మనిషి కదలలేని స్థితి ఏర్పడుతుంది. తలనొప్పి, నిద్రలేమి బాధిస్తాయి. వ్యాధి తీవ్రత 5 నుంచి 7 రోజులు వరకూ ఉంటుంది.
జాగ్రత్తలు: శరీరంలోని ద్రవాలు, లవణాలు అన్నీ తగ్గిపోతాయి. కనుక ఆహార పానీయాలు సక్రమంగా ఉండే విధంగా చూడాలి. లేకపోతే ప్రాణాపాయానికి దారితీస్తుంది. దోమలు కుట్టకుండా దోమతెరలు వాడాలి. నీళ్లు నిలువ ఉండకుండా జాగ్రత్త వహించాలి.
నివారణ: వ్యాధి సోకకముందు యుఫటోరియం పర్ఫోరేటం అనే మందును వారానికి ఒక రోజు మూడు పూటలు తీసుకోవాలి. ఇలా వ్యాధి ప్రబలి ఉన్నంతకాలం తీసుకోవాలి.
వ్యాధి సోకిన తరువాత ఆయా లక్షణాలను బట్టి రస్టాక్స్, బ్రయోనియా అనే మందులను రోజుకు మూడుసార్లు మూడు రోజులు వాడితే వ్యాధి తీవ్రత తగ్గుతుంది.
మలేరియా.. మలేరియా జ్వరం ప్రతి యేటా ఎక్కువగా వర్షాలు పడిన తరువాత దోమలవల్ల వ్యాధి వ్యాప్తిచెందుతుంది.
కారణాలు: మలేరియా ప్రొటోజోవా జీవి అయి ప్లాస్మోడియం ద్వారా సోకుతుంది. ఆడ ఎనాఫిలిస్ దోమ కుట్టడం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.
లక్షణాలు: జ్వరం తీవ్రంగా ఉండటంతోపాటు చలి ఎక్కువగా ఉంటుంది.
జాగ్రత్తలు: దోమలను నివారించడం ద్వారా ఈ వ్యాధిని అరికట్టవచ్చు. దోమతెరలు వాడాలి. నీళ్లు నిలువ ఉండకుండా చూసుకోవాలి.
నివారణ: చైనా, చినూనమ్ ఆర్స్, మలేరియా అఫిసినాలిస్, సల్ఫర్ అనే మందులు మలేరియా నివారణకు పనిచేస్తాయి.
వర్షం పడగానే గుంటలో నీరు నిలువ ఉండి, మురికి నీరుగా మారిన తరువాత
english title:
seasonal diseases
Date:
Wednesday, June 26, 2013