విశాఖపట్నం, జూన్ 25: గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థలో అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీలు, మరో పది పంచాయతీలను విలీనం చేస్తూ పొందుపరచిన ఫైల్‌పై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సంతకం చేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు బుధవారం వెలువడనున్నాయి. విశాఖను మెట్రో సిటీగా తీర్చిదిద్దేందుకు మంత్రి గంటా శ్రీనివాసరావు చేసిన ప్రతిపాదనకు, ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం జివిఎంసి జనాభా 18.5 లక్షలు. మెట్రో సిటీగా రూపాంతరం చెందాలంటే కనీసం 20 లక్షల జనాభా ఉండాలి. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, విశాఖ జిల్లా మంత్రి కొణతాల రామకృష్ణ ఈ విలీన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అప్పట్లో అనేక అభ్యంతరాలు రావడంతో విలీనాన్ని నిలిపివేశారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు అనకాపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన విలీన ప్రక్రియను ముమ్మరం చేశారు.
* దస్త్రాలపై సిఎం సంతకం
english title:
maha visakha
Date:
Wednesday, June 26, 2013