వేములవాడ,జూన్ 25: సుప్రసిద్ద పుణ్యక్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మంగళవారం మెరుపుదాడులు నిర్వహించారు.సుమారుగా ఒకలక్షా రెండువందల రూపాయాల విలువ గల లడ్డూ రీసెల్ నిర్వహిస్తున్న టికెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆలయంలో ప్రధానంగా ఐదుశాఖలపై వచ్చిన ఫిర్యాదులపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ మర్తాండ,సిఐలు రఘుచందర్,సుబ్బారావు,శశిధర్‌రెడ్డి, ఎంపిడివో శ్రీనివాస్, అసిసెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆనంద్‌లతోపాటు 17మంది సిబ్బంది నాలుగు బృందాలుగా విడిపోయి లడ్డూ ప్రసాదాలయ తమారి విభాగం,గోదాం,్ధర్మశాలలు, ఇంజనీరింగ్ టెండర్ నిర్వహణ విభాగం,లీజియస్,విభాగాలలలో తనిఖీ నిర్వహించారు. ఉదయం 9గంటలకు ఆలయానికి వచ్చిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం ముందుగా లడ్డూ అమ్మకాల కౌంటర్‌కు వెళ్లి లడ్డూ విక్రయాలపై టికెట్లను పరిశీలించగా ఒక వెయ్యి రెండు లడ్డూ టికెట్లు రిసేల్ చేస్తున్న స్వయంగా పరిశీలించి పట్టుకొని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. పదిరూపాయాలకోకటి చోప్పున విక్రయించే లడ్డూల టికెట్లను అక్రమంగా అమ్ముతున్నట్లు గుర్తించారు. సుమారు ఒకలక్షరూపాయాలమేర ఆలయ ఆదాయానికి గండికోట్టారన్న విషయాన్ని విజిలెన్స్ అధికారులు గుర్తించి నివ్వెరపోయారు. మిగితా విభాగాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.
సుప్రసిద్ద పుణ్యక్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో విజిలెన్స్
english title:
enforcement
Date:
Wednesday, June 26, 2013