Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఎన్నాళ్లకెన్నాళ్లకు...

$
0
0
వరంగల్, జూన్ 27: దివంగత మాజీ ప్రధాని పివి.నరసింహరావుకు చాలా సంవత్సరాల తరువాత జిల్లాయంత్రాంగం తగిన గౌరవం, గుర్తింపు కల్పించింది. శుక్రవారం పివి.నరసింహరావు 92వ జయంతి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా మంత్రి పొన్నాల లక్ష్మయ్య సూచనల మేరకు వరంగల్ నగరంలోని నిట్ కళాశాల నుంచి కాకతీయ యూనివర్సిటీ క్రాస్‌రోడ్డు వరకు ఉన్న 100్ఫట్ల రోడ్డుకు పివి మార్గ్‌గా నామకరణం చేస్తూ కలెక్టర్ రాహుల్ బొజ్జా గురువారం ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా హన్మకొండలోని ఇండోర్ స్టేడియానికి పివి స్మారక స్టేడియంగా పేరు పెడుతూ ఉత్తర్వులు జారీ చేశారు. విస్తృతంగా ‘మీ-సేవ’ జూలై ఒకటి నుంచి ప్రజలకు మరో 150 సేవలు * మంత్రి పొన్నాల వెల్లడి వరంగల్, జూన్ 27: రాష్ట్ర ప్రజలకు మీసేవ ద్వారా విస్తృతమైన సేవలను అందిస్తున్నామని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. మీసేవ కార్యక్రమం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం కలెక్టరేట్ కాన్ఫ్‌రెన్స్ హాల్‌లో మీసేవ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ మీసేవ ద్వారా ప్రస్తుతం 135 సదుపాయాలను అందిస్తున్నామని, జూలై ఒకటవ తేదీ నుండి మరో 150 సేవలను, అక్టోబర్ నుండి మరో 300 సేవలను అందిస్తారని చెప్పారు. ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థకు సంబంధించి 12 విద్యుత్ సేవలను మీసేవ ద్వారా ఐదు జిల్లాలలో అందిస్తున్నామని తెలిపారు. ఈ సేవలను రాష్టమ్రంతట విస్తరిస్తామని చెప్పారు. మీసేవ ద్వారా బ్యాంకింగ్ సేవలను అనుసంధానం చేసి ఐదు బిపిఎల్ సెంటర్ల ద్వారా బ్యాంకింగ్ లావాదేవిలను నిర్వహిస్తున్నారని అన్నారు. మీసేవ ద్వారా ఒక సంవత్సరంలో అత్యధికంగా 1223750 లావాదేవీలు నిర్వహించి రాష్ట్రంలో జిల్లా ప్రథమస్థానం సాధించిందని చెప్పారు. దీనికి కారణం కియోస్క్ ఆపరేటర్లు, ప్రభుత్వ అధికారులు కలసికట్టుగా పనిచేయడమని అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వ పథకాలకు అనుసంధానం చేయడంతో ప్రజలకు పారదర్శకమైన సేవలు అవినీతికి అస్కారం లేకుండా లభిస్తున్నాయని అన్నారు. ప్రజలకు అందిస్తున్న సేవల విషయంలో ఇతర రాష్ట్రాలు మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయని తెలిపారు. మీసేవ వలన ప్రజలకు పారదర్శకమైన సేవలు అందటమేకాకుండా నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని అన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రద్యుమ్న మాట్లాడుతూ గత ఏడాది జూన్ 25వ తేదీన మొదటిసారిగా మీసేవ కేంద్రాన్ని రాష్ట్ర ఐటిశాఖ మంత్రి జిల్లాలో ప్రారంభించారని తెలిపారు. సంవత్సరకాలంలో అత్యధిక లావాదేవీలు 1223750 చేసినందుకు రాష్ట్రప్రభుత్వం జిల్లాకు అవార్డు కూడా ఇచ్చిందని తెలిపారు. మీసేవ ద్వారా అందిన దరఖాస్తులను నిర్ణీత గడువులో అత్యధికంగా పరిష్కరించిన ఘనత జిల్లాకు దక్కిందని అన్నారు. మీసేవ సదుపాయం గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతున్నాయని చెప్పారు. మీసేవ ద్వారా మధ్య దళారులను నివారించి నేరుగా ప్రజలకు సేవలను అందిస్తున్నామని అన్నారు. జిల్లాలో మీసేవ సెంటర్ల పనితీరు బాగుందని తెలిపారు. మీసేవపై ప్రత్యేక సంచిక మీసేవపై ప్రత్యేక సంచికను రాష్ట్ర ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య గురువారం కలెక్టరేట్ కాన్ఫ్‌రెన్స్ హాల్‌లో ఆవిష్కరించారు. మీసేవ కేంద్రాలలో విశేష సేవలు చేసిన పలువురు ఆపరేటర్లు, ఉద్యోగులకు మంత్రి ప్రశంసాపత్రాలను అందజేశారు. మీసేవలను ప్రారంభించిన మొదటి 100సెంటర్లకు 10వేల రూపాయల చొప్పున గ్రాంట్‌ను రాష్ట్ర ఐటిశాఖ మంజూరు చేసింది. నిర్వాహక కేంద్రాలకు ఈ మొత్తాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ శేషాద్రి, జిల్లా పౌరసంబంధాల అధికారి కె.వెంకటరమణ పాల్గొన్నారు. నీతి, నిజాయితీలతోనే గౌరవం * పోలీసు సిబ్బందికి అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్‌రావు పిలుపు వరంగల్, జూన్ 27: నీతి, నిజాయితీతో విధులు నిర్వహిస్తే ప్రజలు పోలీసులను గౌరవిస్తారని వరంగల్ అర్బన్ ఎస్పీ ఎ.వెంకటేశ్వర్‌రావు అన్నారు. గురువారం భీమారంలోని ఎస్‌విఎస్ కళాశాలలో హన్మకొండ, మామునూరు, కాజీపేట పోలీస్ సబ్ డివిజనల్ పరిధిలోని పోలీసు అధికారులకు వృత్తినైపుణ్యతపై రెండురోజుల శిక్షణ తరగతులను అర్బన్ ఎస్పీ ప్రారంభించారు. పోలీసు సిబ్బందికి రెండురోజుల శిక్షణ తరగతులలో పోలీసులకు, ప్రజలకు మధ్య సన్నిహిత సంబంధాలు, బాధితుడు స్టేషన్‌కు వచ్చిన సమయంలో బాధితుడు మనస్తత్వాన్ని గుర్తించి పోలీసులు ఏ విధంగా ప్రవర్తించాలి, పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కౌంటర్లు, ఆ విభాగంలో పనిచేసే సిబ్బంది వ్యవహరించే పద్ధతిపై వివరిస్తారు. ముఖ్యంగా స్ర్తిలు, పిల్లలు, బలహీనవర్గాల ప్రజలతో పోలీసులు వ్యవహరించవలసిన తీరు, ప్రజల చేత ఆదర్శ పోలీసుగా గుర్తించే విధంగా పోలీసుల పనితీరులో తీసుకురావలసిన మార్పులతోపాటు శారీరక ధృడత్వం మొదలైన అంశాలపై సంబంధిత విభాగాల్లో నిపుణులతో శిక్షణ ఇస్తారు. శిక్షణ ప్రారంభ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ ఇటీవలకాలంలో ప్రజలతో సన్నిహిత సంబంధాల కోసం పోలీసులు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ప్రజలతో సన్నిహిత సంబంధాలను ఏర్పాటు చేసుకోవడం ప్రతి పోలీసు బాధ్యత అని చెప్పారు. పోలీసులు ప్రజలు కోరుకునే విధంగా వ్యవహరిస్తూ, ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా పనిచేస్తే ప్రజలు పోలీసులను ఆదరిస్తారని అన్నారు. ప్రజల సహకారం లేకుంటే శాంతిభద్రతలు, ఆర్థిక నేరాలు అదుపు చేయడం సాధ్యంకాదని తెలిపారు. ప్రజలు పోలీసుల నుండి చట్టపరిధిలో సేవలు కోరుకుంటున్నారని, ప్రజలకు సేవలు అందించినప్పుడే ప్రజలు పోలీసులకు సహకరిస్తారని చెప్పారు. పేద, బలహీనవర్గాల ప్రజలకు సకాలంలో న్యాయం చేయడం పోలీసుల బాధ్యతగా గుర్తించాలని, ప్రజల్లో వస్తున్న మార్పును దృష్టిలో పెట్టుకుని పోలీసుల ప్రవర్తనలో మార్పు తప్పనిసరి అని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాజీపేట ఎఎస్పీ కోయ ప్రవీణ్, హన్మకొండ, మామునూరు డిఎస్పీలు శరత్‌బాబు, సురేష్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ చైర్‌పర్సన్ డాక్టర్ మమతా రఘువీర్, మానసిక వైద్య నిపుణులు డాక్టర్ శ్రీ్ధర్, కెయుసి సిఐ దేవేందర్‌రెడ్డి, అర్బన్ డిసిఆర్‌బి సిఐ జనార్థన్‌రెడ్డి, కెయుసి ఎస్సై శ్రీనివాస్ పాల్గొన్నారు. ఉత్తరకాశీలో సహాయ చర్యలు వేగవంతం: మంత్రి బలరాం మహబూబాబాద్, జూన్ 27: ఉత్తరకాశీలో వరదల్లో చిక్కుకున్నవారిని క్షేమంగా తరలించే సహాయ చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి పోరిక బలరాంనాయక్ తెలిపారు. డెహ్రాడూన్‌లో మకాం వేసిన ఆయన గురువారం సాయంత్రం టెలిఫోన్‌లో ఆంధ్రభూమితో మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చొరవ తీసుకుని రాష్ట్రంనుండి ప్రత్యేకంగా పంపించిన విమానాల్లో యాత్రికులను సురక్షితంగా పంపిస్తున్నామని చెప్పారు. బుధ, గురువారాల్లో ఇలా వెయ్యమందికి పైగా యాత్రికులను రాష్ట్రానికి పంపించగలిగామని వివరించారు. దీనికి అదనంగా ప్రత్యేకంగా టూరిస్టు బస్సులను ఢిల్లీనుండి తెప్పించి యాత్రికులను తరలిస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి చెందిన మంత్రి శ్రీ్ధర్‌బాబు, తాను కలసి యాత్రికులకు కావలసిన సహాయాన్ని పర్యవేక్షిస్తున్నామని అన్నారు. డెహ్రాడూన్‌లో సహాయ శిబిరాలు ఏర్పాటుచేశామని తెలిపారు. వరదల్లో చిక్కిన వారికి ఉచితంగా భోజన వసతి, వైద్య సదుపాయం కల్పిస్తున్నామని వివరించారు. తమవారి ఆచూకీ తెలియడంలేదని ఆందోళన పడవద్దని, ఎక్కడ చిక్కిపోయినట్లు సమాచారం అందినా స్థానిక ప్రభుత్వ అధికారులకు తెలియచేయాలని కోరారు. సహకరించండి వరదల్లో చిక్కుపడిన వారిని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న సహాయ చర్యలకు తోడుగా ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు విరివిగా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి సహాయనిధిలకు విరాళాలు ఇవ్వాలని బలరాంనాయక్ విజ్ఞప్తి చేశారు. 29న కెయు డిగ్రీ ఇన్‌స్టంట్ పరీక్ష వరంగల్, జూన్ 29: కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ ఇన్‌స్టంట్ పరీక్ష ఈనెల 29వ తేదీన నిర్వహిస్తున్నామని పరీక్షల నియంత్రణాధికారులు ప్రొఫెసర్ ఎం.వి.రంగారావు, డాక్టర్ బి.వెంకట్రాంరెడ్డి గురువారం తెలిపారు. 29వ తేదీ శనివారం మధ్యాహ్నం రెండుగంటల నుండి ఐదుగంటల వరకు ఈ పరీక్ష జరుగుతుందని, 6901మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతారని చెప్పారు. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో మూడు సెంటర్ల చొప్పున, వరంగల్‌లో నాలుగు సెంటర్లు, కరీంనగర్‌లో రెండు సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎం.కాం కోర్సులో ప్రవేశాలకు కౌనె్సలింగ్ ప్రారంభం కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలోని ఆయా పిజి కళాశాలల్లో ఎం.కాం కోర్సులో ప్రవేశాలకు గురువారం ఉదయం కాకతీయ యూనివర్సిటీ హ్యుమానిటీస్ భవనంలో కౌన్సిలింగ్ ప్రారంభమయింది. 72 కళాశాలలో 2780 సీట్లకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని యూనివర్సిటీ అడ్మిషన్ల విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ పి.సాంబయ్య తెలిపారు. ఎం.కాం కౌన్సిలింగ్ జూలై ఐదవ తేదీ వరకు జరుగుతుంది. ఎం.కాం ప్రవేశపరీక్షలో 80మార్కులతో మొదటి ర్యాంక్ సాధించిన జమ్మికుంటకు చెందిన ఎ.అర్చనకు యూనివర్సిటీ కామర్స్ కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.ఓంప్రకాశ్, కామర్స్ విభాగం డీన్ ప్రొఫెసర్ కృష్ణమాచారి అడ్మిషన్ పత్రాలు అందజేశారు. కౌన్సిలింగ్‌లో జాయింట్ డైరెక్టర్ డాక్టర్ నర్సింహచారి, ప్రొఫెసర్ గడ్డం భాస్కర్, డాక్టర్ హరిప్రసాద్, డాక్టర్ రాజేందర్ పాల్గొన్నారు. ఉద్ధృతంగా జీడివాగు ఏటూరునాగారం, జూన్ 27: మండలంలోని రాంనగర్ వంతెనపై జీడివాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జీడివాగు ఉద్ధృతి పెరిగి రాంనగర్ వంతెనపై నుండి ప్రవహిస్తోంది. అలాగే, గోదావరి నీరు క్రమంగా పెరగడంతో జీడివాగు పోటెత్తింది. దీంతో రాంనగర్, లంబాడీతండా, కోయగూడ ఎల్లాపురం గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. గత ఏడాది వరద ఉద్ధృతితో వారం రోజులపాటు పైగ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకుపోయాయి. ప్రస్తుత వర్షాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిస్తే గత ఏడాది జరిగిన అనుభవాలే మళ్లీ పునరావృతం కానున్నాయని ప్రజలు, రైతులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వరద ఉద్ధృతి పెరిగినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. చదువుకునే విద్యార్థులు వంతెన దాటలాంటే భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నాటుపడవను ఏర్పాటుచేసి రాకపోకలకు అంతరాయం కలగకుండా చూడాలని పైగ్రామాల ప్రజలు అధికారులను కోరుతున్నారు. అడ్డుపడే పార్టీలను తరిమివేయాలి జఫర్‌గడ్, జూన్ 27: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడుతున్న పార్టీలను గ్రామాలలోకి రాకుండా తరిమికొట్టాలని మాజీ మంత్రి, టిఆర్‌ఎస్ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి అన్నారు. గురువారం మండలకేంద్రంలోని వాసవి కల్యాణ మండపంలో టిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కడియం శ్రీహరి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం గత 50సంవత్సరాలుగా ఎన్నో ఉద్యమాలు చేస్తున్నారని తెలిపారు. అప్పటి నుండి నేటి వరకు ఎంతోమంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం బలిదానాలు చేసుకున్నారని చెప్పారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలమని చెప్పి గెలిచిన తరువాత పూర్తిగా మరచిపోయిందని పేర్కొన్నారు. తెలంగాణకు అడ్డుపడుతున్నది కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు. చంద్రబాబు వచ్చిన తెలంగాణను అడ్డుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. ఎస్టీఓ కార్యాలయంలో అవినీతి చేప జనగామ, జూన్ 27: జనగామ ఎస్టీఓ కార్యాలయంలో ఎసిబి అధికారులు గురువారం దాడులు జరిపారు. ఎస్టీఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న తిరుపతి రెడ్డి బాధితుని నుండి రూ. 5వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండ్‌గా పట్టుబడ్డాడు. ఎసిబి డిఎస్పీ సాయిబాబా కథనం ప్రకారం.. జనగామ ఫైర్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రంగు రవీందర్ అతనికి రావాల్సిన రూ. 1.34 లక్షల మెడికల్ బిల్లు, పిఆర్ బిల్లుల కోసం ఎస్టీవో కార్యాలయానికి వెళ్లాడు. ఎస్టీఓ కార్యాలయంలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ తిరుపతి రెడ్డి ముందుగా రెండు విడతలుగా బిల్లులు చెల్లించి మరో విడత బిల్లు చెల్లించేందుకు పర్సంటేజ్ ఇస్తేనే బిల్లు మంజూరు అవుతుందని చెప్పారు. అందుకు రూ. 8వేలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో బాధితుడు రవీందర్ అడ్వాన్స్‌గా రూ. 5వేలు ఇచ్చేందుకు ఒప్పుకొని ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. ఎసిబి అధికారుల సూచన మేరకు రూ. 5వేలు తీసుకొని తిరుపతిరెడ్డికి ఇస్తుండగా మాటువేసిన ఎసిబి అధికారులు రంగంలోకి దిగి సీనియర్ అసిస్టెంట్ తిరుపతి రెడ్డిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రూ.5వేలు నగదు స్వాధీనం చేసుకొని అతన్ని అరెస్టు చేసి హైద్రాబాద్ కార్యాలయానికి తరలించారు. వివాహిత ఆత్మహత్య రాయపర్తి, జూన్ 27: ఆర్థిక ఇబ్బందులను తాళలేక ఒంటిపై కిరోసిన్ పోసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని మైలారం గ్రామంలో గురువారం జరిగింది. మృతురాలి బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. గౌరి హైమావతి (34), శ్రీనివాస్ దంపతులకు 15సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు కలిగారు. కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో తరచు భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో శ్రీనివాస్ తల్లి ఎనిమిదిరోజుల క్రితం మృతిచెందింది. ఆమె మృతికి శనివారం దశదినకర్మ చేయవలసి ఉండగా దానికి కావలసిన ఖర్చుల గురించి భార్యాభర్తల మధ్య బుధవారం రాత్రి గొడవ జరిగింది. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున హైమావతి క్షణికావేశంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యులు వెంటనే వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రాయపర్తి పోలీసులు తెలిపారు. పిపిజి దళ సభ్యుడు లొంగుబాటు వరంగల్, జూన్ 27: ప్రజాప్రతిఘటన మోహనన్న దళం సభ్యుడు మాడిపెద్ది బాలయ్య అలియాస్ అంజన్న గురువారం అర్బన్ ఎస్పీ ఎ.వెంకటేశ్వర్‌రావు ఎదుట లొంగిపోయారు. కొత్తగూడ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన బాలయ్య వ్యవసాయం చేసేవాడు. 1984లో అప్పటి ప్రజాపంథ పార్టీతో పరిచయం ఏర్పడి కొంతకాలం కొరియర్‌గా పనిచేశాడు. 1990 సంవత్సరం వరకు వరంగల్, ఖమ్మం ప్రాంతాలలో దళసభ్యునిగా పనిచేశాడు. అనంతరం అదే సంవత్సరం ప్రజాపంథ పార్టీతో విభేదించి ప్రజాప్రతిఘటన చలమన్న గ్రూపులో చేరి దళసభ్యునిగా 10సంవత్సరాలు చలమన్న, సుబ్బన్న, మంగన్న, మోహనన్న నాయకత్వంలో పనిచేశాడు. పార్టీ ఆదేశాల మేరకు దళసభ్యురాలు లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన ఐదునెలలకే భార్యాభర్తలు ఇరువురు 2000 సంవత్సరంలో అప్పటి ఎస్పీ వినాయక్ ప్రభాకర్ ఆప్టే ఎదుట లొంగిపోయి హైదరాబాద్‌లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం గడిపారు. 2005 సంవత్సరంలో ఎఎల్‌టి విప్లవ గ్రూపునకు సహకరిస్తున్నారనే ఆరోపణతో హైదరాబాద్ పోలీసులు బాలయ్యను అరెస్టు చేసి వరంగల్ సెంట్రల్‌జైలుకు తరలించారు. రెండు సంవత్సరాలు జైలుశిక్ష అనుభవించిన బాలయ్య తిరిగి తన భార్యతో కలసి హైదరాబాద్ వెళ్లి సెక్యూరిటీగార్డుగా 2012 సంవత్సరం వరకు పనిచేశాడు. తనకున్న రెండు ఎకరాల పొలం సాగు చేసుకునేందుకు బాలయ్య తిరిగి తన గ్రామానికి చేరుకోగా అప్పటికే తన వ్యవసాయ పొలాన్ని కబ్జా చేసినట్లు గ్రహించి గ్రామపెద్దల ముందు పంచాయితీ పెట్టారు. కానీ తనకు న్యాయం జరగలేదనే అభిప్రాయంతో బాలయ్య ప్రజాప్రతిఘటన రాష్ట్ర కార్యదర్శి మోహనన్నను కలుసుకుని తన పొలం తగాదాను తీర్చమని కోరాడు. మోహనన్న పార్టీలో పనిచేయమని చెప్పడంతో బాలయ్య గత ఏడాది డిసెంబర్‌లో పార్టీలో చేరాడు. ఇప్పటి వరకు తనకు పొలం సమస్యను మోహనన్న తీర్చకపోవడంతో మనస్తాపం చెందిన బాలయ్య అర్బన్ స్పెషల్ బ్రాంచ్ సిఐ రాజరత్నంకు సమాచారం అందించి గురువారం అర్బన్ ఎస్పీ ఎ.వెంకటేశ్వర్‌రావు ఎదుట లొంగిపోయాడు. పలు ప్రాంతాలలో జరిగిన ఎన్‌కౌంటర్ల సందర్భంగా పోలీసులపై కాల్పులు జరిపిన సంఘటనల్లో బాలయ్యపై కేసులు నమోదై ఉన్నాయి.
100 అడుగుల రోడ్డుకు, స్టేడియంకు పివి పేరు * కలెక్టర్ ఉత్తర్వులు జారీ
english title: 
pv marg

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>