విశాఖపట్నం, జూన్ 28: నగర పరిధిలో యుజిడి పనులు జరుగుతుండగా ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడిన ఘటనపై జాతీయ మానవహక్కుల కమిషన్ ఫిర్యాదు నమోదు చేసింది. ఈమేరకు జరిగిన ఘటనపై పూర్తి నివేదికను కోరుతూ కమిషన్ జివిఎంసిని కోరింది. దీనిపై ఇప్పటికే శాఖా పరంగా దర్యాప్తు జరిపి ఒక సూపరింటిండెంట్ ఇంజనీర్, మరో ఎగ్జిక్యుటివ్ ఇంజనీర్, మరో సహాయ ఇంజనీర్‌లపై చర్యలకు సిఫార్సు చేసినట్టు కమిషనర్ ఎంవి సత్యనారాయణ శుక్రవారం తనను కలిసిన విలేఖరులకు తెలిపారు. ఇప్పటికే జివిఎంసి ఈ సంఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపిందని, హక్కుల కమిషన్‌కు నివేదిక పంపనున్నట్టు తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లో ఆశీల్‌మెట్ట ఫ్లైఓవర్ ట్రయల్ రన్ నిర్వహించనున్నట్టు తెలిపారు. జివిఎంసి ప్రస్తుత ఆదాయం 160 కోట్ల రూపాయలుండగా, దీన్ని 300 కోట్ల రూపాయలకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.
ప్రాజెక్టుల బాధ్యతలు జానకికి
విశాఖపట్నం, జూన్ 28: జివిఎంసిలో అదనపు కమిషనర్‌గా చేరిన ఐఎఎస్ అధికారిణి జానకికి ప్రాజెక్టు నిర్వాహణ బాధ్యతలు అప్పగించారు. ఈమేరకు కమిషనర్ ఎంవి సత్యనారాయణ ఆమెకు వివరించారు. ఇప్పటి వరకూ ప్రాజెక్ట్సు బాధ్యతలను చూస్తున్న నాగేంద్రకుమార్‌కు రెవెన్యూ విభాగాన్ని అప్పగించారు. అలాగే జోన్ 6 జెడ్సీగా పనిచేస్తూ శెలవుపై వెళ్లిన సాయిశ్రీకాంత్ స్థానంలో జివిఎంసి కార్యదర్శి సన్యాసి నాయుడుకు బాధ్యతలు అప్పగించారు.
* నివేదిక కోరిన కమిషన్
english title:
human rights
Date:
Saturday, June 29, 2013