Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

యాత్రికులు...కాకి లెక్కలు

$
0
0
విశాఖపట్నం, జూన్ 28: ఉత్తరాఖండ్ ఛార్‌దామ్ వరదల్లో చిక్కుకొని క్షేమంగా ఇళ్ళకు చేరుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే దీనికి సంబంధించి విశాఖ జిల్లా నుంచి బయలుదేరి వెళ్ళిన యాత్రికుల సంఖ్యలో స్పష్టత లేనేలేదు. జిల్లా యంత్రాంగం మాత్రం 211 మంది వెళ్ళినట్టుగా స్పష్టమైన ప్రకటన చేసేసింది. ఇందులో 150 మంది యాత్రికులు ఇప్పటికే తమ ఇళ్ళకు చేరుకోగా, మరో 45 మంది వేర్వేరు పుణ్యక్షేత్రాల సందర్శనలో ఉన్నారని, ఈ జిల్లాకు సంబంధించి కేవలం ఆరుగురు మాత్రమే మృతి చెందారని పేర్కొంది. మరో పది మంది తప్పిపోగా, నలుగురు ఆచూకీ లభించినట్టు తెలిపింది. ఇది జరిగి మూడు రోజులు కావస్తుంది. అయినా ఇంకా వస్తూనే ఉన్నారు. అయితే అనేక మార్గాల్లో విశాఖకు చేరుకున్న వారి సంఖ్య దీనికి మించిపోయింది. గత వారం రోజుల నుంచి ప్రతిరోజు 50 మందికి తగ్గకుండా విశాఖ నగరానికి చేరుకుంటునే ఉన్నారు. వీరిలో కొంతమంది పాయకరావుపేట, యలమంచిలి, అనకాపల్లి, నర్సీపట్నం తదితర ప్రాంతాల వద్ద దిగి తమ ఇళ్ళకు వెళ్తున్నారు. తొలిసారిగా ఆర్టీసీ విశాఖ రీజియన్ ఆధ్వర్యంలో వాల్వో బస్సు ద్వారా శుక్రవారం ఒక్కరోజే 50మందికి పైగా విశాఖ నగరానికి చేరుకోగలిగారు. ఇందులో విమానం ద్వారా 30 మంది, ఆర్టీసీ వాల్వోలో 16 మంది, సమత ఎక్స్‌ప్రెస్ రైలులో ఇంకో 16 మంది ఇక్కడకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి వాల్వో ద్వారా ఇక్కడకు చేరుకున్న యాత్రికల్లో 16 మంది విజయనగరం జిల్లా ఎస్.కోటకు చెందినవారే. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో మరో 30 మంది ఇక్కడకు చేరుకోగలిగారు. నిజాముద్ధీన్-విశాఖపట్నం (సమత) ఎక్స్‌ప్రెస్ ద్వారా శుక్రవారం రాత్రి 6.30 గంటలకు 16మంది వరకు చేరుకున్నట్టు రైల్వే పోలీసులు తెలిపారు. ఢిల్లీ-విశాఖపట్నం మధ్య దక్షిణమధ్య రైల్వే నిర్వహించిన ప్రత్యేక రైలులో ఈ నెల 24వ తేదీన మధ్యాహ్నాం మూడు గంటలకు 20 మంది యాత్రికులు ఇక్కడకు చేరుకున్నారు. ఇందులో ఇద్దరు విజయవాడలో దిగిపోగా, మిగిలిన 18 మంది దీనిలో వచ్చారు. ఇందులో 15 మంది ఒకే కుటుంబం కాగా, మరో ముగ్గురు నగరంలో వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారే. అయితే అంతా ఒకేసారి కలిసికట్టుగా బయలుదేరి వెళ్ళి తిరుగు ప్రయాణంలోను కలిసే వచ్చారు. అదేరోజు అనకాపల్లి, యలమంచిలి, తుని, పాయకరావుపేట తదితర రైల్వేస్టేషన్లలో నలుగురేసి వంతు దిగిపోయారు. అలాగే ఈమధ్య వరుసగా మూడు రోజులపాటు తెలుగుదేశంపార్టీ నడిపిన ప్రత్యేక విమానంలో 30 నుంచి 50 మంది వరకు ఇక్కడకు రాగలిగారు. ఈ నెల 22న నిజాముద్ధీన్-విశాఖపట్నం (సమత) ఎక్స్‌ప్రెస్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఇక్కడకు చేరుకున్నారు. వీరితోపాటు మరికొంతమంది ఇందులో రాగలిగారు. ఈ నెల 21న సీతమ్మధార బాలయ్యశాస్ర్తీ ప్రాంతానికి చెందిన ఆరుగురు ఛారదామ్ వరదల్లో మృతిచెందినట్టు సంబంధిత కుటుంబీకులు తెలుసుకున్నారు. డిల్లీ నుంచి విశాఖపట్నంనకు ప్రతిరోజు సమత, స్వర్ణజయంతి, లింక్ ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తున్నాయి. వీటి ద్వారా రోజుకీ కనీసం 10 నుం 20 మంది వస్తున్నట్టు తెలిసింది. గత వారం రోజులుగా వీటి ద్వారా వస్తున్న బాధితులు దాదాపు 60మంది అయినా ఉండవచ్చు. రైళ్ళు, విమానాలు, ఆర్టీసీ బస్సుల ద్వారా ఒక్క విశాఖ నగరానికి చేరుకున్న వారే దాదాపు 300 మంది ఉంటుండగా, మార్గ మధ్యలో కనీసం 50 వరకు దిగి ఉండవచ్చనేది స్పష్టమవుతోంది. గత ఆరు రోజులుగా అనేక మార్గాల ద్వారా విశాఖకు చేరుకున్న వారి సంఖ్యకు, జిల్లా యంత్రాంగం చేసిన అధికారిక ప్రకటనకు ఎటువంటి సంబంధం లేకుండా పోయింది. మరో నాలుగు రోజుల వరకు మరికొంతమంది వేర్వేరు మార్గాల్లో వచ్చే అవకాశాలున్నాయి. కొత్త రైల్వే టైంటేబుల్ వచ్చేసింది... * ఒకటవ తేదీ నుంచి అమలు * పట్టాలెక్కనున్న 12 కొత్త రైళ్ళు * మరికొన్ని రైళ్ళ ఫ్రీక్వెన్సీ పెంపు విశాఖపట్నం, జూన్ 28: కొత్త రైల్వే టైంటేబుల్ వచ్చేసింది. వచ్చేనెల ఒకటవ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుంది. పలు రైళ్ళ ఫ్రీక్వెన్సీ పెరిగింది. ప్రధానంగా 12 కొత్త రైళ్ళు పట్టాలెక్కనున్నాయి. భువనేశ్వర్-తిరుపతి (వీక్లీ ఎక్స్‌ప్రెస్), విశాఖపట్నం-గాంధీగామ్, విశాఖపట్నం-జోద్‌పూర్ (వీక్లీ ఎక్స్‌ప్రెస్), విశాఖపట్నం-కొల్లాం (వీక్లీ ఎక్స్‌ప్రెస్), విశాఖపట్నం-టాటా (సూపర్‌ఫాస్ట్, వీక్లీ ఎక్స్‌ప్రెస్), కామాక్య-యశ్వంత్‌పూర్ (వీక్లీ ఎక్స్‌ప్రెస్) హటియా-యశ్వంత్‌పూర్ (వీక్లీ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం-రాయగడ (పాసింజర్)కొత్తగా పట్టాలెక్కుతున్నాయి. ఇవి కాకుండా ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో మరికొన్ని రైళ్ళు కొత్తగా పట్టాలెక్కనున్నాయి. వీటిలో భువనేశ్వర్-న్యూఢిల్లీ (వీక్లీ ఎక్స్‌ప్రెస్) ఉంది. ఇది అంగుల్, సంబల్‌పూర్, జార్స్‌గుడల మీదుగా నడుస్తుంది. అలాగే పూరి-సాయినగర్ సంబల్‌పూర్, టిట్లాఘర్, రాయిపూర్‌ల మీదుగా నడుపుతారు. ఛంత్రగాఛీ-చెన్నై బై వీక్లీ ఏసి సూపర్‌పాస్ట్ ఎక్స్‌ప్రెస్ కెందుఝర్‌ఘర్‌ల మీదుగా నడుస్తుంది. ఛంత్రగాఛీ-చెన్నై బై వీక్లీ ఎక్స్‌ప్రెస్ కటక్, భువనేశ్వర్‌ల మీదుగా నడువనుంది. వీటితోపాటు పూరి-అజమర్ వీక్లీక్స్‌అపెస్ సంబల్‌పూర్, టిట్లాఘర్, రాయిపూర్‌ల మీదుగా నడుస్తుంది. * ఇక విశాఖ-ముంబై రోజూ ఇక నుంచి విశాఖ-ముంబై మధ్య నడిచే (లోక్‌మాన్య తిలక్ టెర్మినల్) ప్రతిరోజ నడుస్తుంది. ఇది ఇంతవరకు రెండు రోజులు మాత్రమే నడిచేది. దీనిని ఇపుడు వారంలో ప్రతిరోజు నడపాలని నిర్ణయించింది. ఇంతవరకు దీనికి ఉన్న 22819/20నెంబర్‌ను ఇక నుంచి 18519/18520నెంబర్లగా మార్పు చేసింది. * మరికొన్నింటి రైళ్ళకు ఫ్రీక్వెన్సీ (రోజులు) పెంపు మరికొన్న ముఖ్యమైన రైళ్ళకు సంబంధించిన రోజులు ఇక నుంచి పెరగనున్నాయి. సంబల్-నాందేడ్ (18309/18310) బై వీక్మీ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం-నాందేడ్ (18509/18510) బై వీక్లీ ఎక్స్‌ప్రెస్ ఇక నుంచి మూడు రోజులు నడుస్తుంది. సంబల్‌పూర్-నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ప్రతి ఆది,సోమ,శుక్రవారాల్లో సంబల్‌పూర్ నుంచి, ప్రతి సోమ,మంగళ, శనివారాల్లో నాందేడ్ నుంచి ఇది బయలుదేరుతుంది. అలాగే విశాఖపట్నం-నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ప్రతి మంగళ, బుధ, శనివారాల్లో విశాఖపట్నం నుంచి, ప్రతి బుధ, గురు, ఆదివారాల్లో నాందేడ్ నుంచి బయలుదేరనుంది. అలాగే రోజు నడిచే ఎల్‌టిటి రైలు ఎప్పటి నుంచి ఏ సమయాల్లో నడుస్తుందనేది త్వరలోనే ప్రకటించనుంది. * మరికొన్ని పొడిగింపు భువనేశ్వర్-్భవానీపాట్నా ఎక్స్‌ప్రెస్ (18437/18438) ఎక్స్‌ప్రెస్‌ను జునాఘర్ వరకు పొడిగించింది. అలాగే పూరి-దిబ్రుగర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (18419/18420) జయ్‌నగర్ వరకు పొడిగించారు. వీటితోపాటు భువనేశ్వర్-లోక్‌మాన్య తిలక్ టెర్మినల్ ఎక్స్‌ప్రెస్ (12145/12146) పూరి వరకు పొడిగించబడింది. అయితే ఇది ఏ రోజు నుంచి సమయంలో బయలుదేరింది అధికారికంగా ప్రకటించనున్నట్టు ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్ అధికారులు తెలిపారు. అదేవిధంగా రూర్కెలా-్భవనేశ్వర్ (ఇంటర్‌సిటీ) రూర్కెలా నుంచి ఝార్స్‌గుడ, సంబల్‌పూర్ సిటీ, అంగుల్ మీదుగా భువనేశ్వర్‌కు చేరుకుంటుంది. రూర్కెలా-కోరాపుట్ (18107) ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రూర్కెలా, ఝార్స్‌గూడ, సంబల్‌పూర్, బాలాంగీర్, టిట్లాగర్, రాయగడ, మీదుగా కోరాపుట్‌కు వెళ్తుంది. సంబల్‌పూర్-పూరి ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ (18303) సంబల్‌పూర్, అంగుల్, భువనేశ్వర్ మీదుగా పూరికి వెళ్తుంది. టిట్లాఘర్-హౌరా ఎక్స్‌ప్రెస్ ( 18272) ఝార్స్‌గుడ, సంబల్‌పూర్, సంబల్‌పూర్, బోలంగీర్, టిట్లాగర్ వరకు నడువనుంది. రాయగడ-టిట్లాగర్ ఇంటర్ సిటీ (18302) ఎక్స్‌ప్రెస్ సంబల్‌పూర్, బోలంగీర్ మీదుగా టిట్లాగర్‌కు చేరుకుంది. దుర్గ్-జగదల్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (18221) టిట్లాగర్, రాయగడ, కోరాపుట్, కంటాబంజి మీదుగా రాయపూర్‌కు వెళ్తుంది. సంబల్‌పూర్-వారణాసి ఎక్స్‌ప్రెస్ (18311) జార్స్‌గుడ, సంబల్‌పూర్ మీదుగా నడువగా, సంబల్‌పూర్-రాయగడ (18301) ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ సంబల్‌పూర్, సంబల్‌పూర్, బోలంగీర్, టిట్లాగర్ మీదుగా రాయగడగు చేరుకుటుంది. అలాగే విశాఖపట్నం-సికింద్రాబాద్ (12805) విశాఖపట్నం నుంచి బయలుదేరుతుంది. పూరి-కోకా ఎక్స్‌ప్రెస్ (18401) పూరి, ఖుర్దారోడ్డు, బ్రహ్మపూర్, పలాస, విజయనగరం, పలాస మీదుగా నడుస్తుంది. మళ్ళీ పెట్రో భారం విశాఖపట్నం, జూన్ 28: పెట్రోల్ ధర మళ్ళీ పెరిగింది. గడచిన పక్షంలో ఇది రెండవసారి పెరిగినట్టు. పెరిగిద ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. ఈ ఏడాదిలో వరుసగా నాలుగుసార్లు పెట్రోల్ ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వం వాహన చోదకులను లక్ష్యంగా చేరుకుంటుంది. ఈసారి లీటర్ పెట్రోల్‌కు రూ.1.82లు పెంచగా, దీనికి పన్నులు కలుపుకుంటే రూ.2.32 వరకు ఉండవచ్చని వాహనచోదకులు భావిస్తున్నారు. పెరిగిన ధరతో వినియోగదారులు రోజుకీ దాదాపు నాలుగు లక్షల వరకు భారం మోయాల్సి ఉంటుంది. దశలవారీగా పెట్రోల్ ధరలను పెంచుతూ సాధారణ వినియోగదారులపై పెనుభారాన్ని మోపుతుండటంపట్ల సర్వత్రా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. విశాఖ జిల్లా మొత్తంపై వందకు పైగానే పెట్రోల్ బంక్‌లుండగా, ఇందులో ఒక్క విశాఖ నగరంలోనే 69 పెట్రోల్ బంక్‌లున్నాయి. వీటి ద్వారా రోజుకి దాదాపు రెండున్నర లక్షల లీటర్ల పెట్రోల్ అమ్మకాలు సాగుతున్నాయి. పెరిగిన పెట్రోల్ ధర ప్రభావం రవాణాపై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. పెట్రోల్‌తోనే నడిచే ఆటోలు, ఆర్టీసీ, మరికొన్ని వాహనాలపై పెనుభారం పడనుంది. అనేకసార్లు పెరిగిన పెట్రోల్ ధరలపై పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ఆందోళన చేపట్టనున్నాయి. దేవస్థానం ఉద్యోగాల్లో మా వాటా మాకివ్వాల్సిందే! ఎస్సీ శాసనసభా సంఘం చైర్మన్ వెంకటస్వామి స్పష్టీకరణ సింహాచలం, జూన్ 28: శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్‌లను అనుసరించి 30 ఉద్యోగ నియామకాలు, పద్నోతుల్లో ఎస్సీలకు రావాల్సిన వాటా ఇవ్వాల్సిందేనని ఎస్సీ శాసనసభా సంఘం చైర్మన్ లబ్బి వెంకటస్వామి స్పష్టం చేశారు. శుక్రవారం కొండపై ఎస్సీ సభాసంఘ సమావేశం జరిగింది. ముందు ఎస్సీ ఉద్యోగుల నుండి వచ్చిన ఫిర్యాదులను, వినతులను చైర్మన్ స్వీకరించారు. కీలకమైన స్థానాల్లో విధులు నిర్వహిస్తున్నారా లేక అధికారులు వివక్ష చూపిస్తున్నారా అంటూ వారిని ఆరా తీసారు. వారితో మాట్లాడుతున్న సమయంలో ఇఓతో సహా ఎవరూ ఉండరాదని ఆయన ఆదేశించారు. అదే విధంగా మహిళా ఉద్యోగులను అధికారుల నుండి మీకేమైనా వేధింపులు, సమస్యలున్నాయా అంటూ ప్రశ్నించారు. ఒక వేళ చెప్పడానికి అభ్యంతరమైతే లిఖిత పూర్వకంగా ఇవ్వమని చైర్మన్ సూచించారు. వారి విధుల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అప్పారావు, బెనర్జీదేశాయ్ అ ఉద్యోగుల పదోన్నతి విషయంలో కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. తక్షణమే వీరిరువురికి పదోన్నతి కల్పించాలంటూ అధికారులను చైర్మన్ ఆదేశించారు. అదే విధంగా దేవస్థానం ఖర్చుల విషయమై సభాసంఘం అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా పర్మినెంట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వివరాలపై ఆరా తీసారు. ఔట్‌సోర్సింగ్ నియామకాల్లో రిజర్వేషన్ అమలుతీరును ప్రశ్నించారు. ఖచ్చితమైన సమాచారం అందించడంలో అధికారులు తడబడ్డారు. దేవస్థానం భూసమస్య అంశాన్ని కూడా సభాసంఘం అపశ్నించింది. పెందుర్తి శాసనసభ్యుడు పంచకర్ల తన పరిధిలోని కొంత సమాచారాన్ని చైర్మన్‌కు వివరించారు. దేవాలయ సాంప్రదాయ సేవల్లో కూడా ఆసక్తి ఉన్న వారికి అవకాశం కల్పించాలని సభాసంఘం అధికారులను ఆదేశించారు. ఎస్సీలందరికీ పట్టాలిచ్చే విధంగా ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని చైర్మన్ చెప్పారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాల్లో పిఎఫ్, ఇఎస్‌ఐ, గ్రాట్యుటీ మినహాయించాలని దేవస్థానం వాటిని సంబంధిత శాఖలకు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని చైర్మన్ ఆదేశించారు. ఇప్పటి వరకూ వచ్చిన ఏ సభాసంఘాలు ఈ తరహాలో సమీక్ష నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో ఎస్సీ సభాసంఘం వస్తూనే ఇఓ మినహా ఎస్సీ ఉద్యోగులందరినీ సమావేశపరిచి సమస్యలు అడిగి తెలుసుకోవడం ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలించడం సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారాలు చూపారు. ఎస్సీ సంఘం నేత, దేవస్థానం ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు పి.మోహన్‌రావు సభా సంఘానికి సమస్యలపై స్పందించిన ఇఓ రామచంద్రమోహన్‌కి కృతజ్ఞలు తెలిపారు. రానున్నది రాజన్న రాజ్యమే.. బుచ్చెయ్యపేట, జూన్ 28: రానున్నది మళ్లీ రాజన్న రాజ్యమేనని, ప్రజలు భయపడాల్సిన అవసరంలేదని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల ప్రజలకు భరోసా ఇచ్చారు. జిల్లాలో షర్మిల నిర్వహిస్తున్న మరో మహాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం మండలంలోకి ప్రవేశించింది. శుక్రవారం సాయం త్రం ఆరు గంటలకు మండలంలోని కొమ్మళ్లపూడి గ్రామంలో పాదయా త్ర ప్రవేశించింది. కొమ్మళ్లపూడి, బుదిరెడ్ల పాలెం, కొండెంపూడి జంక్షన్, పొట్టిదొరపాలెం, ఎల్.సింగవరం గ్రామాల మీదుగా సాగిన యాత్ర శుక్రవారం లోపూడి గ్రామానికి చేరుకుంది. మార్గమధ్యలో జనం ఆమెకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలను పలకరిస్తూ, వారి కష్టాలను తెలుసుకుంటూ ముందుకు సాగింది. పలుచోట్ల పెద్ద సంఖ్యలో జనం ఆమెను చూడటానికి ఎగబడినా, సెక్యూరిటీ సిబ్బంది, రోప్ పార్టీ వారిని దూరంగా నెట్టివేశారు. పొట్టిదొరపాలెంవద్ద ఏర్పాటుచేసిన వైఎస్సార్ విగ్రహాన్ని ఆమె శుక్రవా రం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. గొంతు బాగుండక పోవటంతో ఆమె పెద్దగా మాట్లాడకుండా, ప్రజలను పలకరిస్తూ, వారితో కరచాలనం చేస్తూ ముందుకు సాగింది. శుక్రవారం రాత్రి లోపూడిలో బస చేశారు. ఈ కార్యక్రమంలో షర్మిల వెంట వైఎస్సార్‌సిపి సమన్వయ కమిటీ కన్వీనర్ కొణతాల రామకృష్ణ, పార్టీ నియోజకవర్గ కన్వీనర్ బలిరెడ్డి సత్యారావు, విఎస్‌ఎన్ రాజు, మండల కన్వీనర్ తమరాన రామకోటి, యువజన నాయకుడు బోయిన నారాయణమూర్తి పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టంకట్టండి * మంత్రి బాలరాజు గూడెంకొత్తవీధి, జూన్ 28: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థుల గెలుపునకు అందరూ కృషి చేయాలని గిరిజన సంక్షేమ శాఖామంత్రి పసుపులేటి బాలరాజు పిలుపునిచ్చారు. శుక్రవారం గూడెంకొత్తవీధిలో 70లక్షల రూపాయలతో నిర్మించిన సబ్‌స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంత అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందని, ఇది మన అదృష్టమని మంత్రి అన్నారు. మారుమూల గ్రామాలకు రహదారులు వేసి గిరిజనుల సంక్షేమానికి కృషి చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మంత్రి బాలరాజు పేర్కొన్నారు. 1987లో మండల ప్రెసిడెంట్‌గా ఎన్నికైన తాను విద్యుత్ సదుపాయం లేని గ్రామాలకు కరెంట్ సదుపాయం కల్పించామన్నారు. ఈ విద్యా సంవత్సరంలో గూడెంలో బాలికల డిగ్రీ కళాశాల ఏర్పాటుకు, మోడల్ స్కూల్ నిర్మాణానికి అన్ని అనుమతులు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. ప్రతి మండల కేంద్రంలో ఎ.టి.డబ్ల్యు. ఓ.లకు కార్యాలయ నిర్మాణం 13 వేల మంది పి.టి.జి.లకు ప్రభుత్వపరంగా ప్రత్యేక అభివృద్ధి నిధులు విడుదల అయ్యాయని ఆయన తెలిపారు. ఏజెన్సీలో ఉన్న శ్రీలంక కాందిశీకులకు ఎ.పి.ఎఫ్.డి.సి.లో నిత్యం పనిఉండేలా అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. ఎ.పి.ఎఫ్.డి.సి. అధికారులు నివాస గృహాల ఆధునీకరణ చేసే ఆలోచన ఉందని, పి.కొత్తూరులో జి.సి.సి. డిపో ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రి బాలరాజు తెలిపారు. కుంకుంపూడి రహదారికి ఆరు కోట్ల నిధులు మంజూరు అయ్యాయని, అలాగే నిర్మాణానికి నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తానని గిరిజన మంత్రి బాలరాజు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎం.పి.డి. ఓ. ప్రేమాకర్, ఎం.ఇ.ఓ.నూకరాజు, ప్రధానాచార్యులు సన్యాసిరావు, కాంగ్రెస్ నాయకులు మత్స్యరాజు, రామకృష్ణ, రామారావు, వీరన్నపడాల్ పాల్గొన్నారు. సరిహద్దుల్లో మావోయిస్టుల సమావేశం? గూడెంకొత్తవీధి, జూన్ 28: గూడెంకొత్తవీధి- కొ య్యూరు మండలాల సరిహద్దు ప్రాంతంలో సి.పి.ఐ. మావోయిస్టు పార్టీ ఆయా ప్రాంత గిరిజనులతో ప్రత్యే క సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో ఇద్దరు కార్యదర్శు లు, ఒక మండల స్థాయి అధికారిపై గిరిజనులు మావోయిస్టులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాల్లోకి వెళితే . గత కొంతకాలంగా అడపాదడపా విధ్వంసాలకు పాల్పడిన మావోయిస్టులు కొద్దిరోజులుగా తమ కదలికలను సరిహద్దు ప్రాంతంలో పెంచుకున్నారు. మారుమూల గ్రామాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేసి వారివద్ద నుండి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. గత రెండు రోజుల క్రితం రెండు మండలాల సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుండి అధికసంఖ్య గిరిజనులు హాజరయ్యారు. మండల కేంద్రానికి వచ్చినప్పుడు తాము ఎదుర్కొంటున్న సమస్యలను మావోయిస్టులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వీరి కోసం మావోయిస్టులు పలువురు గిరిజనులను పిలిపించుకుని వారి స్థితిగతులను చర్చించినట్లు సమాచారం. మారుమూల గ్రామాల్లో మొబైల్‌ఫోన్లు వాడే గిరిజనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మండల కేంద్రాలకు వెళ్ళేటప్పుడు కమిటీలకు తెలియకుండా వెళితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించినట్లు సమాచారం. మావోయిస్టు పార్టీలో అధిక శాతం గిరిజనులు చేరి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మావోయిస్టులు పిలుపునిచ్చినట్లు తెలిసింది. మావోయిస్టులు కదలికలు ఎక్కువగా ఉన్నాయని తెలుసుకున్న పోలీస్ యంత్రాంగం చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలంలో నాలుగు బెటాలియన్ల గ్రేహౌండ్స్ బలగాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని గిరిజనులు భయాందోళనలు చెందుతున్నారు.
* జిల్లా యంత్రాంగం చెప్పేది 211మందే * ఇప్పటికే చేరిన 300 మంది * వారం రోజులుగా వస్తూనే ఉన్నారు
english title: 
yathris

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>