ఏలూరు, జూన్ 28: మళ్లీ పెట్రోల్ ధర భగ్గుమంది. గత కొద్దిరోజులుగా పడిపోతున్న రూపాయి విలువ ప్రభావం ఇప్పుడు పెట్రోల్‌పై కూడా పడింది. దిగుమతులకు చెల్లిస్తున్న మొత్తాలు పెరిగిపోవటంతో ఆయిల్ కంపెనీలు ధర పెంపు దిశగానే కదలటం దానికి కేంద్రం ఆమోదముద్ర వేయటంతో ఈ పరిస్దితి తలెత్తింది. శుక్రవారం సాయంత్రం ధర పెంచాలని కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ధర అర్ధరాత్రి నుంచి అమలుచేస్తున్నట్లు ప్రకటించారు. పన్నులు మినహాయించకుండా లీటరుకు రూ. 1.82 చొప్పున పెట్రోల్ ధర పెంచారు. గత నెల 31న లీటరుకు 75 పైసలు చొప్పున పెంచిన ప్రభుత్వం సరిగ్గా గత శనివారం ఏకంగా లీటరుకు రెండురూపాయల చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తిరిగి వారం గడవకుండానే మరోసారి పెట్రోల్ ధర పెంచటంతో వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాట్‌ను కూడా కలుపుకుంటే లీటరుకు 2.32 రూపాయలు వినియోగదారులపై తాజా పెంపు భారం పడనుంది. జిల్లాలో పరిస్దితిని పరిశీలిస్తే ఐఓసి, హెచ్‌పిసి, బిపిసి, రిలయెన్స్ సంస్ధలకు చెందిన 210 పెట్రోల్ బంకులున్నాయి. వీటిద్వారా రోజుకు 2.30లక్షల లీటర్ల వరకు పెట్రోల్ అమ్మకాలు జరుగుతున్నాయి. ఈలెక్కన చూస్తే రోజుకు జిల్లాలోని వినియోగదారులపై 5.33లక్షల రూపాయలు, నెలకు కోటి 60లక్షల రూపాయల వరకు భారం పడనుంది.
లీటరుకు రూ. 1.82పెంపు అర్ధరాత్రి నుంచి అమలు
english title:
rupee
Date:
Saturday, June 29, 2013