ఏలూరు, జూన్ 28: జిల్లా రెవిన్యూ అధికారిగా కె ప్రభాకరరావును నియమిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని సెక్రటేరియట్లో అసిస్టెంటు సెక్రటరీ(అసైన్మెంట్స్)గా పనిచేస్తున్నారు. గతంలో తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం, విశాఖపట్నం ఆర్డీవోగా పనిచేసిన ప్రభాకరరావు అనంతరం పదోన్నతిపై సెక్రటేరియట్‌కు బదిలీ అయ్యారు. జూలై 3వ తేదీన ఆయన ఇక్కడ డిఆర్వోగా బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా ప్రస్తుతం డిఆర్వోగా ఉన్న ఎం మోహనరాజు ఈనెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్నారు. మూడేళ్ల క్రితం డిఆర్వోగా బాధ్యతలు స్వీకరించిన మోహనరాజు సమర్ధుడైన అధికారిగా పేరుపొందారు. పలు కీలకాంశాల్లో కలెక్టరు, జాయింట్ కలెక్టరుకు అవసరమైన సహాయసహకారాలు అందిస్తూ వారి మన్ననలు కూడా అందుకున్నారు. ఈనెల 30వ తేదీ ఆదివారం స్ధానిక ఎన్ఎన్ఆర్ కళ్యాణమండపంలో వివిధ ప్రభుత్వశాఖల అధికారులు, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఏలూరులో మోహనరాజుకు వీడ్కోలు సభ ఏర్పాటుచేశారు.
-జూలై 3న బాధ్యతల స్వీకరణ
english title:
dro
Date:
Saturday, June 29, 2013