కావలసినవి
రాజ్మా గింజలు ............................... 1/2 కప్పు
ఉల్లిపాయ ........................................ 2
టమాటా ........................................... 2
పసుపు ............................................. 1/4 టీ.స్పూ.
కారం పొడి ........................................ 1 టీ.స్పూ.
అల్లం వెల్లుల్లి ముద్ద ......................... 1 టీ.స్పూ.
ధనియాల పొడి ............................... 1 టీ.స్పూ.
గరం మసాలా పొడి ........................ 1/4 టీ.స్పూ.
కొబ్బరిపొడి ...................................... 2 టీ.స్పూ.
ఉప్పు ............................................... తగినంత
నూనె ................................................ 3 టీ.స్పూ.
చేయండి ఇలా
రాజ్మా గింజలను నీళ్లు పోసి నాలుగు గంటలు నానబెట్టాలి. తర్వాత కుక్కర్లో వేసి కాస్త పసుపు, ఉప్పువేసి ఉడికించి జల్లెట్లో వేసి ఉంచాలి. పాన్‌లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఇందులో పసుపు, అల్లంవెల్లుల్లి ముద్ద, కారం పొడి, సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసి అవి మెత్తబడేవరకు వేపాలి. తర్వాత రాజ్మా గింజలు వేసి కలిపి మూత పెట్టాలి. రెండు నిమిషాలు మగ్గిన తర్వాత కొబ్బరి పొడి, ధనియాల పొడి వేసి కలిపి ఉప్పు సరిచూసుకుని అరకప్పు నీళ్లు పోసి ఉడికించాలి. మసాలా కలిసి ఉడికి నూనె తేలుతున్నప్పుడు గరం మసాలా వేసి కలిపి దింపేయాలి. ఈ కూర చపాతీలకు బావుంటుంది. ఇందులో కొంచెం పెరుగు కూడా వేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది.
రాజ్మా గింజలను నీళ్లు పోసి నాలుగు గంటలు నానబెట్టాలి
english title:
rajma curry
Date:
Sunday, June 30, 2013