కావలసినవి
సేమ్యా ................................................. 1 కప్పు
చిక్కటి పాలు ...................................... 5 కప్పులు
నెయ్యి ................................................. 4 టీ.స్పూ.
పంచదార ............................................ 1/2 కప్పు
యాలకుల పొడి .................................. 1 టీ.స్పూ.
జీడిపప్పు ............................................. 10
బాదం ................................................. 10
పిస్తా ...................................................... 5
కిస్‌మిస్ ................................................. 20
ఇలా చేద్దాం
పాన్‌లో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, బాదం, పిస్తా, కిస్మిస్ వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో సేమ్యాను దోరగా లేత బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక గినె్నలో పాలు పోసి రెండు కప్పులు అయ్యేవరకు మరిగించాలి. ఇందులో సేమ్యా వేసి ఉడికించాలి. తర్వాత వేయించిన జీడిపప్పు, బాదం, పిస్తా, కిస్‌మిస్, యాలకుల పొడి వేసి మరో రెండు నిమిషాలు ఉడికించి దింపేయాలి. ఇది పాయసంలా పల్చగా కాకుండా కాస్త చిక్కగానే ఉంటుంది. ఈ రబడీ వేడిగా లేదా చల్లగా సర్వ్ చేయొచ్చు.
పాన్‌లో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, బాదం, పిస్తా, కిస్మిస్
english title:
rabadi
Date:
Sunday, June 30, 2013