కావలసినవి
మటన్ కీమా - 250 గ్రా.
బాస్మతి బియ్యం - 250 గ్రా.
ఉల్లిపాయ - 2
పచ్చిమిర్చి - 3
కరివేపాకు - 2 రెబ్బలు
అల్లం వెల్లుల్లి ముద్ద
- 1 టీ.స్పూ.
పసుపు - 1/4 టీ.స్పూ.
కారం పొడి - 1 టీ.స్పూ.
ధనియాల పొడి - 2 టీ.స్పూ.
మిరియాల పొడి - 1/2 టీ.స్పూ.
గరం మసాలాపొడి
- 1/4 టీ.స్పూ.
ఉప్పు - తగినంత
నూనె - 3 టీ.స్పూ.
ఇలా చేయాలి
ముందుగా బాస్మతి బియ్యం కడిగి తగినన్ని నీళ్లు పోసి పది నిమిషాలు నాననివ్వాలి. కీమాని శు భ్రంగా కడిగి జల్లెట్లో వేయాలి. నానిన బాస్మతి బియ్యాన్ని పొడి పొడిగా ఉండేలా వండి వెడల్పాటి గినె్నలో వేసి చల్లారనివ్వాలి. బాణలి లేదా పాన్‌లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు వేసి కొద్దిగా వేపి కీమా వేసి బాగా వేపాలి. ఇందులో కారం పొడి, దానికి తగినంత ఉప్పు, ధనియాల పొడి, మిరియాల పొడి వేసి కలిపి అరకప్పు నీళ్ళుపోసి మూత పెట్టి ఉడికించాలి. కీమా ఉడికి బాగా వేగిన తర్వాత గరం మసాలా పొడి వేసి కలిపి మరో రెండు నిమిషాల తరువాత అన్నం, తగినంత ఉప్పు వేసి కలుపుతూ ఐదు నిమిషాలు వేపి దింపేయాలి. ఈ కీమా ఫ్రైడ్ రైస్ పెరుగు పచ్చడి కుర్మాతో సర్వ్ చేయాలి.
ముందుగా బాస్మతి బియ్యం కడిగి తగినన్ని నీళ్లు పోసి
english title:
kheema masala rice
Date:
Sunday, June 30, 2013