కావలసినవి
వంకాయలు ......................... 1/4 కిలో
చింతపండు పులుసు ............. 1 కప్పు
బెల్లం ................................... చిన్న ముక్క
శనగపిండి ............................ 1 టీ.స్పూ.
నూనె ................................... 3 టీ.స్పూ.
పొడి చేసుకోవడానికి
శనగపప్పు ........................... 3 టీ.స్పూ.
మినప్పప్పు ........................... 2 టీ.స్పూ.
ధనియాలు ........................... 1/2 టీ.స్పూ.
ఎండుమిర్చి .......................... 4
నువ్వులు .............................. 2 టీ.స్పూ.
జీలకర్ర ................................ 1/2 టీ.స్పూ.
ఉప్పు ................................... తగినంత
పోపునకు:
నూనె ................................... 1 టీ.స్పూ.
ఎండుమిర్చి .......................... 1
మినప్పప్పు ............................ 1/2 టీ.స్పూ.
ఇంగువ ................................ చిటికెడు
ఆవాలు, జీలకర్ర .................... 1/4 టీ.స్పూ.
కరివేపాకు .............................. 2 రెబ్బలు
వండండి ఇలా
ముందుగా పెనం వేడి చేసి శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, ధనియాలు, నువ్వులు, జీలకర్ర విడివిడిగా వేయించాలి. చల్లారిన తర్వాత అన్నీ కలిపి ఉప్పు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. చిన్న వంకాయలైతే గుత్తులుగా నాలుగు భాగాలుగా కట్ చేసి (పెద్దవంకాయలైతే ముక్కలుగా కట్ చేసి ఉపయోగించుకోవాలి) ఈ పొడిని లోపల కూరాలి. మిగిలిన పొడి పక్కన పెట్టుకోవాలి. పాన్‌లో నూనె వేడి చేసి మసాలా పొడి కూరిన వంకాయలు వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. వంకాయలు కొద్దిగా మగ్గిన తర్వాత పసుపు, పలుచటి చింతపండు పులుసు, కప్పుడు నీళ్ళు పోసి నిదానంగా ఉడికించాలి. వంకాయలు ఉడికి పులుసు చిక్కబడుతున్నప్పుడు శనగపిండి, మిగిలిన మసాలా పొడి, బెల్లం వేసి మరో రెండు నిమిషాలు మరిగించాలి. చిన్న గినె్నలో నూనె వేడి చేసి ఇంగువ వేయాలి. అది కరిగిన తర్వాత ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసి దోరగా వేగిన తర్వాత వంకాయ పులుసులో వేసి కలపాలి.
ముందుగా పెనం వేడి చేసి శనగపప్పు, మినప్పప్పు
english title:
pulusu
Date:
Sunday, June 30, 2013