కావలసినవి
పనీర్ .............................................................................. 200 గ్రా.
ఉల్లిపాయ ....................................................................... 2
టమాటాలు ..................................................................... 2
కాప్సికమ్ ........................................................................ 1
పచ్చిమిర్చి ....................................................................... 3
క్యారట్ .............................................................................. 2
నిమ్మరసం ........................................................................ 2 టీ.స్పూ.
జీలకర్ర ............................................................................. 1/4 టీ.స్పూ.
పసుపు ............................................................................. చిటికెడు
కారం పొడి ...................................................................... 1/4 టీ.స్పూ.
మిరియాల పొడి .............................................................. 1/4 టీ.స్పూ.
ఉప్పు ............................................................................... తగినంత
నూనె ................................................................................ 3 టీ.స్పూ.
ఇలా వండాలి
ఉల్లిపాయ, టమాటా, క్యారెట్, కాప్సికంలను నిలువుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. పనీర్‌ని రెండు అంగుళాల పొడవుగా ముక్కలుగా కట్ చేసుకుని గోరువెచ్చని నీళ్లలో వేయాలి. ఐదు నిమిషాల తర్వాత తీసి ఆరనివ్వాలి. పనీర్ ముక్కలపై నిమ్మరసం, మిరియాల పొడి వేసి కలిపి అరగంట నాననివ్వాలి. పాన్‌లో నూనె వేడి చేసి జీలకర్ర వేసి చిటపటలాడాక ఉల్లిపాయ, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి మెత్తబడేవరకు వేపాలి. ఇందులో క్యారట్, కాప్సికం, టమాటా ముక్కలు వేసి కొద్దిగా మెత్తబడేవరకు వేయించాలి. తర్వాత పనీర్ ముక్కలు, పసుపు, కారం పొడి, తగినంత ఉప్పు వేసి కలుపుతూ వేయించాలి. తడి అంతా ఇగిరిపోయాక దింపేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి.
ఉల్లిపాయ, టమాటా, క్యారెట్, కాప్సికంలను నిలువుగా
english title:
veg paneer fry
Date:
Sunday, June 30, 2013