* 1903లో ప్రారంభమైన టూర్ డి ఫ్రాన్స్ 110 ఏళ్లు పూర్తి చేసుకుంది. కానీ, ఇప్పుడు జరుగుతున్నది 111వ రేస్ కాదు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల కారణంగా మొత్తం 11 పర్యాయాలు ఈ రేస్‌ను నిర్వహించలేదు. ఆ రకంగా చూసుకుంటే, ఇది 100వ రేస్. 2007లో ఫ్లాయిడ్ లాండిస్ (2006 విజేత) టైటిల్‌ను రద్దు చేశారు. అతను విచారణలో బయటపెట్టిన సమాచారం ప్రకారమే ఆర్మ్‌స్ట్రాంగ్‌పై విచారణ కొనసాగింది. ఏడు పర్యాయాలు టైటిల్ సాధించిన ఆర్మ్‌స్ట్రాంగ్‌పై సస్పెన్షన్ వేటు పడేందుకు కారణమైంది. కాగా, అతను టైటిళ్లు సాధించిన 1999-2005 కాలానికి ద్వితీయ స్థానంలో ఉన్న రైడర్లను విజేతలుగా ప్రకటించడానికి యుసిఐ నిరాకరించింది. ఆ సంవత్సరాల్లో టైటిల్ ఎవరికీ దక్కదని స్పష్టం చేసింది.
* ఇప్పటి వరకూ టూర్ డి ఫ్రాన్స్ రేస్‌లో పాల్గొన్న వారిలో పొడవైన రైడర్‌గా జొహా వాన్ సమ్మెరెన్ రికార్డు సృష్టించాడు. అతని పొడవు 6 అడుగులా, ఐదున్నర అంగుళాలు. ఇక పొట్టివాడిగా సామ్యూల్ డువౌలిన్ పేరు చరిత్ర పుటల్లో నిలిచింది. అతని ఎత్తు 5 అడుగులా రెండు అంగుళాలు. ఇక అతి బరులైన రైడర్ మాగ్నసన్ బాక్‌స్టెడ్. అతని బరువు అక్షరాలా 95 కిలోలు. లియోనార్డో పీపొలి 57 కిలోల బరువుతూ, టూర్ డి ఫ్రాన్స్‌లో పాల్గొన్న బక్కపల్చని రైడర్‌గా గుర్తింపు పొందాడు. ఇప్పటి వరకూ నలుగురు రేస్ మధ్యలో మృతి చెందారు.
1903లో ప్రారంభమైన టూర్ డి ఫ్రాన్స్ 110 ఏళ్లు
english title:
110the year
Date:
Sunday, June 30, 2013