ఏడు పర్యాయాలు వింబుల్డన్ టైటిళ్లు సాధించిన మాజీ ప్రపంచ నంబర్‌వన్ రోజర్ ఫెదరర్‌కు నిబంధనల గురించి తెలియవని అనుకోవడానికి వీలులేదు. కానీ, తాజా వింబుల్డన్‌లో అతను ఉద్దేశపూర్వకంగానే నిబంధనలకు నీళ్లొదిలాడు. గ్రాండ్ శ్లామ్ టోర్నీల్లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ పోటీల్లో క్రీడాకారులంతా ఖచ్చితంగా తెల్లదుస్తులనే వేసుకోవాలి. బూట్లు, రిస్ట్ బ్యాండ్స్, హెయిర్ బ్యాండ్స్ కూడా తెల్ల రంగులోనే ఉండాలి. ఫెదరర్ తెల్ల బూట్లు వేసుకున్నప్పటికీ వాటి అడుగుభాగం నారింజ రంగులో ఉండడాన్ని నిర్వాహకులు తప్పుపట్టారు. వెంటనే వాటిని మార్చాలంటూ ఆదేశాలు జారీ చేశారు. వింబుల్డన్‌లో స్టార్లు నిబంధనలను లక్షపెట్టకపోవడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది మహిళల సింగిల్స్ చాంపియన్ సెరెనా విలియమ్స్ రంగురంగుల షార్ట్స్ చేసుకోవడం వివాదానికి కారణమైంది. 2007లో ఫ్రాన్స్ క్రీడాకారిణి తతియానా గొలొవిన్ కూడా ఇలాంటి లోదుస్తులతోనే కనిపించింది. అమెరికాకు చెందిన బెథానీ మాటెక్ సాండ్స్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో గూగుల్ గ్లాస్ ధరించడం కూడా వివాదం రేపింది. నల్ల కళ్లద్దాలను పెట్టుకోవడం నిబంధనలకు విరుద్ధమా? కాదా? అన్న విషయాన్ని వింబుల్డన్ అధికారులు ఇంకా నిర్ణయించలేదు. కొంత మంది క్రీడాకారిణులు రకరకాల హెయిర్ బ్యాండ్స్‌తో దర్శనమిస్తున్నారు. సంప్రదాయానికి పెద్దపీట వేసే ఇలాంటి టోర్నీల్లో నిబంధనలను పట్టించుకోవకపోవడాన్ని అంతా తప్పుపడుతున్నారు.
ఏడు పర్యాయాలు వింబుల్డన్ టైటిళ్లు సాధించిన మాజీ
english title:
rules
Date:
Sunday, June 30, 2013