సమ న్యాయం..
నెదర్లాండ్స్‌కు చెందిన మైకెల్ లాడ్రప్ తన కెరీర్‌లో బార్సిలోనా, రియల్ మాడ్రిడ్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఒకసారి బార్సిలోనా తరఫున అతను ఆడినప్పుడు ఆ జట్టు రియల్ మాడ్రిడ్‌ను 5-0 తేడాతో చిత్తుచేసింది. మరో మ్యాచ్‌లో రియల్ మాడ్రిడ్ తరఫున లాడ్రప్ ఆడాడు. అందులో మాడ్రిడ్ 5-0 తేడాతో బార్సిలోనాపై విజయం సాధించింది. మొత్తం మీద రెండు మ్యాచ్‌ల్లో అతను ప్రాతినిథ్యం వహించిన జట్లు ఒకే ఆధిక్యంతో విజయాలు సాధించాయ. ఈ విధంగా అతను ఎవరినీ నొప్పించకుండా ఇరు జట్లకూ సమన్యాయం చేశాడు.
వరుస విజయాలు
ఇటలీ దేశవాళీ ఫుట్‌బాల్ టోర్నమెంట్స్‌లో ఎసి మిలన్ జట్టు వరుసగా 58 విజయాలను నమోదు చేసుకొని రికార్డు నెలకొల్పింది. యూరోపియన్ కప్‌ను వరుసగా ఐదుసార్లు గెల్చుకున్న ఏకైక జట్టు రియల్ మాడ్రిడ్.
అన్నదమ్ముల సవాల్
ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ వా ఒక దశలో వరుసగా 87 వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. ఆతర్వాత అతనిని జట్టు నుంచి తొలగించారు. ఆ స్థానాన్ని స్టీవ్ వా సోదరుడు మార్క్ వా భర్తీ చేయడం విచిత్రం. 1992లో మార్క్ వా ఐదు వనే్డల్లో నాలుగుసార్లు రనౌట్ అయ్యాడు.
మెరుపు వేగం..
ర్యాకెట్‌తో ఆడే ఆటల్లో అత్యంత వేగవంతమైనది బాడ్మింటన్. ఈ ఆటలో షటిల్ కాక్ చాలా వేగంగా ప్రయాణిస్తుంది. అంతర్జాతీయ బాడ్మింటన్ సమాఖ్య (ఐబిఎఫ్) 1934లో తొమ్మిది సభ్యదేశాలతో ఆరంభమైంది. ఈ సమాఖ్య ప్రకటించిన గణాంకాల ప్రకారం చైనాకు చెందిన డబుల్స్ స్పెషలిస్టు ఫు హైఫెంగ్ అత్యంత బలంగా స్మాష్ చేశాడు. అతను కొట్టిన షటిల్ కాక్ గంటకు 332 కిలోమీటర్లు (206 మైళ్లు) వేగంతో వెళ్లింది. కాగా, ఐబిఎఫ్‌లో 150 సభ్యదేశాలు ఉన్నాయి. వీటిలో అధికశాతం ఆసియా, ఐరోపా ఖండాలకు చెందినవే. ఒలింపిక్స్‌తో సహా మొత్తం తొమ్మిది మేజర్ ఈవెంట్స్‌ను ఐబిఎఫ్ గుర్తించింది. 1992లో ఈ క్రీడ ఒలింపిక్స్‌లో రంగ ప్రవేశం చేసింది.
పాప్ కార్న్
english title:
pop corn
Date:
Sunday, June 30, 2013