చీమకుర్తి, జూన్ 30:మండలంలోని కెవి పాలెంలో శివ పార్వతి హత్యకు గురైన సంగతి పాఠకులకు విధితమే. శనివారం పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు. ఆదివారం ఉదయం రూరల్ సిఐ భూషణం ఆధ్వర్యంలో శవపంచనామా నిర్వహించారు. తదుపరి ఒంగోలు రిమ్స్‌కు చెందిన ప్రొఫెసర్, ఫోరెన్సిక్ నిపుణులు జివి రాజ్‌కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె శ్రీరాములు ఆధ్వర్యంలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. తదుపరి తహశీల్దార్ సమక్షంలో శివపార్వతి బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు. ఒంగోలు డిఎస్‌పి జాషువా ఆధ్వర్యంలో నిందితులను అరెస్టు చేశారు. మొదటి నిందితుడు బ్రహ్మంను ఆదివారం సాయంత్రం కోర్టుకు హాజరుపరిచారు. వెంకయ్య, వాసు, రాజాలను కూడా అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితులకు సహకరించారంటూ మండల వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షులు పమిడి వెంకటేశ్వర్లు, మాజీ ఎంపిటిసి పుట్టా బ్రహ్మయ్యను, కొల్లూరి శింగయ్యను ముగ్గురిని 5,6, 7వ నిందితులుగా చేర్చి అరెస్టు చేశారు. వీరిని సోమవారం కోర్టులో హాజరుపర్చనున్నట్లు డిఎస్‌పి తెలిపారు. కేసును త్వరితగతిన దర్యాప్తు పూర్తిచేసిన సిఐ భూషణం, ఎస్‌ఐలు భక్తవత్సల్‌రెడ్డి, ఆరోగ్యరాజ్, సిబ్బందికి రివార్డుల కోసం సిఫార్సు చేయనున్నట్లు డిఎస్‌పి తెలిపారు.
నిందితుల అరెస్టు
english title:
shiva parvathi
Date:
Monday, July 1, 2013