సీలేరు, జూన్ 30: ఆంధ్రా - ఒడిషా సరిహద్దుల్లో బి. ఎస్. ఎఫ్. పోలీస్ బలగాలు , గ్రేహౌండ్స్ పోలీస్ బలగాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మావోయిస్టు ఫ్రభావిత ప్రాంతమైన సరిహద్దులో అణువణువుగా గాలింపులు చేపడుతున్నారు. ఆంధ్రాలో స్థానిక ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్న నేపధ్యంలో సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల కార్యకలాపాలు ఎటువంటివి జరుగకుండా అడ్డుకట్ట వేసేందుకు ఇప్పటి నుంచే పటిష్టమైన చర్యలు పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీస్ బలగాలు చేపడుతున్నాయి. ఈనేపధ్యంలోనే సరిహద్దు ప్రాంతమైన చిత్రకొండ,ఝాన్‌బాయ్, బలిమెల ప్రాంతాల్లో పోలీస్ బలగాలను మోహరించి గాలింపు చర్యలు చేపడుతున్నారు. బి. ఎస్. ఎప్. అవుట్ పోస్టుల వద్ద అదనంగా బలగాలు సమకూర్చి మావోయిస్టుల నుంచి ఏ క్షణంలో దాడి జరిగినా సమర్ధవంతంగా తిప్పికొట్టేందుకు నిమగ్నమయ్యారు. ఎ. ఓ.బి.లో పోలీసులు పాగా కొనసాగుతూనే ఉంది. స్థానిక ఎన్నికలు సమీపిస్తుండడంతో సరిహద్దు ప్రాంతం అంతా పోలీసుల మయంగా మారింది.
ఆంధ్రా - ఒడిషా సరిహద్దుల్లో బి. ఎస్. ఎఫ్. పోలీస్
english title:
aob
Date:
Monday, July 1, 2013