హైదరాబాద్, జూలై 3: రంగారెడ్డి జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూలును జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి.శ్రీ్ధర్ ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమ నియమావళి అనుసరించి పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 672 గ్రామ పంచాయతీలు, 6,888 వార్డులకు మూడు విడతలుగా ఎన్నికలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసామని ఆయన ప్రకటించారు. డివిజన్ల వారీగా 23న తూర్పు డివిజన్, 27న చేవెళ్ల డివిజన్, 31న వికారాబాద్ డివిజన్ పరిధిలోని గ్రామ పంచాయతీలకు ఉ.గం.7.00ల నుండి మ.గం.1.00ల వరకు పోలింగ్ జరుగుతుందని కలెక్టర్ శ్రీ్ధర్ తెలిపారు. ఈ నెల 9న నామినేషన్ల స్వీకరణ మొదలు 13వ తేదీ సా.గం.5.00ల వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు. 14న నామినేషన్ల పరిశీలన, 15న నామినేషన్ల తిరస్కరణలపై రెవెన్యూ డివిజన్ అధికారి సమక్షంలో అప్పీలు చేసుకునే అవకాశం, 16న అప్పీళ్ల పరిష్కారం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అభ్యర్థిత్వ ఉపసంహరణకు 17న మ.గం.3.00ల లోపు గడువు ముగుస్తుందని ఆయన తెలిపారు. పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా 17వ తేదీ మ.గం.3.00ల తర్వాత ప్రకటిస్తారని ఆయన తెలిపారు. అనంతరం మూడు విడతలుగా నిర్వహించే పోలింగ్ అనంతరం అదేరోజు మ.గం.2.00ల నుండి ఓట్ల లెక్కింపు ప్రక్రియను మొదలుపెట్టి పూర్తయిన వెంటనే గెలిచిన అభ్యర్థుల పేర్లను ప్రకటించడం, ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ పూర్తిచేస్తారని ఆయన తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే ఫిక్స్‌డ్ సింబల్స్‌తో కూడిన బ్యాలెట్ పత్రాలను ముద్రించామని, ఈ ఎన్నికల్లో సింబల్స్ మినహా అభ్యర్థుల పేర్లు బ్యాలెట్ పేపర్‌పై ఉండవని ఆయన తెలిపారు. ఒకేసారి స్థానిక వార్డు సభ్యుని ఎన్నికతోపాటు సర్పంచ్ ఎన్నికకు సంబంధించి ఓటు వేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఎన్నికల నిర్వహణ పరిశీలన కోసం మైక్రో అబ్జర్వర్లను నియమించడంతోపాటు వీడియోగ్రఫీ, వెబ్‌కాస్టింగ్‌లను ఏర్పాటుచేస్తామని కలెక్టర్ శ్రీ్ధర్ చెప్పారు.
15 గ్రామాలకు ఎన్నికలు లేనట్టే!
జిల్లాలో 690 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా 672 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్రీ్ధర్ తెలిపారు. అయితే 690 గ్రామ పంచాయతీలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తిచేసిన ప్రభుత్వం చివరి క్షణంలో 15 గ్రామాలను జిహెచ్‌ఎంసిలో విలీనం చేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. నగర శివరులోని నార్సింగి, వట్టినాగులపల్లి, నెక్నాపూర్, పుప్పాలగూడ, ఖానాపూర్, బండ్లగూడ జాగీర్, కిస్మత్‌పూర్, హిమాయత్‌సాగర్, హైదర్‌షాకోట్, నిజాంపేట్, కుంట్లూరు కల్వంచ, శాతంరాయ్, కొత్తపేట్, కోత్వాల్‌గూడ, పీరమ్ చెరువు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగే పరిస్థితి కనిపించడం లేదు. అలాగే కోర్టు విచారణలో ఉన్న గ్రామ పంచాయతీలకు సంబంధించి న్యాయస్థానం ఆదేశాల మేరకు కలెక్టరే నిర్ణయం తీసుకుని ఎన్నికలు నిర్వహించాలా? వద్దా? అన్న నిర్ణయాన్ని తీసుకోవాలని ఎన్నికల కమిషన్ సూచించినట్లు కలెక్టర్ తెలిపారు. అయితే జిహెచ్‌ఎంసిలో విలీనానికి సంబంధించి 36 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రంగారెడ్డి జిల్లాలో పంచాయతీ ఎన్నికల
english title:
p
Date:
Thursday, July 4, 2013