హైదరాబాద్, జూలై 3: గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని ప్రవర్తనా నియమావళి నేటినుండి అమలులోకి వచ్చినందున కొత్తపనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించకూడదని, దీనిపై ఏవైనా అనుమానాలుంటే జల్లా యంత్రాంగాన్ని సంప్రదించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ బి.శ్రీ్ధర్ అధికారులకు సూచించారు. బుధవారం కలక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులను తొలుత పరిచయం చేసుకొని తదనంతరం వివిధ శాఖల పనితీరును ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో ప్రారంభించిన పనులకు, మంజూరైన పనులకు ఎలాంటి అంతరాయం లేదని, కొత్తగా ఎటువంటి పనులను చేపట్టకూడదని ఆయన అధికారులను ఆదేశించారు. సంక్షేమ వసతి గృహాల పనితీరును సమీక్షిస్తూ విద్యార్థులకందాల్సిన యూనిఫామ్స్, పాఠ్య, నోటు పుస్తకాలను సత్వరమే అందించాలని ఆయన తెలిపారు. సాంఘిక సంక్షేమం, వెనుకబడిన సంక్షేమం, మహిళా శిశు సంక్షేమం, అంగన్‌వాడి కేంద్రాల పనితీరును అధికారులను అడిగి తెసుకున్నారు. సమావేశానికి హాజరుకాని ఎస్‌సి, బిసి కార్పోరేషన్ల అధికారులతోపాటు ఐసిడిఎస్‌పిడిలపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిఆర్‌ఓను కలెక్టర్ ఆదేశించారు. ఆర్‌డబ్ల్యుఎస్ పనులను మీక్షిస్తూ వర్షాకాలం వచ్చినప్పటికీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో మంచినీటి కొరత లేకున్నా ఇంకా ట్యాంకర్లద్వారా నీటి సరఫరా గావించడంపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా సంబందిత అధికారిని కలెక్టర్ ఆదేశించారు. విద్యాశాఖపై సమీక్షిస్తూ పాఠశాలలకు ఉపాధ్యాయులు సకాలంలో హాజరయ్యే విధంగా విద్యాశాఖాధికారి ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని, అలాగే పాఠశాలల విద్యార్థులకు అందాల్సిన యూనిఫారాలు, పాఠ్యపుస్తకాలు అందించిన వివరాలను వెంటనే తెలియజేయాలని తెలుపగా దానిపై ఆర్‌విఎం పిడి సమాధానమిస్తూ యూనిఫారములను కుట్టించడం జరుగుతుందని పూర్తయిన వెంబడే విద్యార్థులకు అందిస్తామని తెలిపారు. 19 మోడల్ స్కూల్స్ జిల్లాలో మంజూరీ అయ్యాయని వీటిలో 12 మోడల్ స్కూల్స్‌కు అడ్మిషన్లు జరుగుతున్నాయని, 4 మోడల్ స్కూల్స్‌కు పక్కా భవన నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని డిఇఓ తెలుపగా దానిపై కలెక్టర్ మోడల్ స్కూల్స్ పక్కా భవనాల నిర్మాణాల్లో అలసత్వం వహించకూడదని ఆదేశించారు. సమావేశాలకు అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని శాఖల వారీగా సమీక్షలు జరిగినప్పుడు సంబంధిత అధికారులు అట్టి మీటింగ్‌లకు గైర్హాజరైతే వారిపై తీవ్ర చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి డిఆర్‌ఓ రవీందర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని
english title:
code
Date:
Thursday, July 4, 2013