హైదరాబాద్, జూలై 3: పదవులు శాశ్వతం కాదు, వాటి కన్నా మనుషులే ముఖ్యం..పదవులు ఉన్నా, లేకపోయినా చూస్తే పలకరించుకునే కనీస మర్యాద, ప్రేమాభిమానాలుండాలి. కానీ మన ప్రభుత్వాధికారులు పదవులున్నపుడే గౌరవించి, అవి పోయిన తర్వాత కనీసం మానవత్వంతో కూడా పట్టించుకోవటం లేదనేందుకు బుధవారం కౌన్సిల్‌లో మాజీ మేయర్ కార్తీకరెడ్డి వ్యక్తం చేసిన ఆవేదనే ఓ నిదర్శనం. నేను మేయర్‌గా ఉన్నపుడు పిలిస్తే ఆగమేఘాలపై వచ్చే బల్దియా అధికారులు డబుల్ రోల్ చేస్తుంటారు.. నా తార్నాక డివిజన్‌లో ఏళ్ల క్రితం మంజూరు చేయించుకున్న పలు పనులు నేటికీ పూర్తికాలేదు.. ఎందుకో తెల్సుకుందామని ఫోన్ చేస్తే కనీసం అధికారులు ఫోన్ కూడా తీయని పరిస్థితి. నేను ఇక్కడ నా ఆవేదన చెప్పుకుంటూ ఢిల్లీలోని మా సోనియాగాంధీ అయినా వింటారేమో గానీ, అక్కడి అధికారులకు విన్పించదు..పదవీ నుంచి తప్పుకున్న తర్వాత నేటికీ కూడా నేను ఫోన్ చేస్తే సిఎస్ నుంచి సిఎం వరకు చక్కటి స్పందన ఇస్తారు గానీ మన అధికారులే కనీసం ఫోన్ కూడా తీయకుండా అవమానిస్తుంటారు. ఇది కంటతడి పెట్టుకోవల్సిన దుస్థితి అంటూ గ్రేటర్ మొట్టమొదటి మేయర్ బండకార్తీకచంద్రారెడ్డి బుధవారం నాటి కౌన్సిల్‌లో తన ఆవేదనను వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం లాలాపేట అమ్మవారి దేవాలయానికి సుమారు 150 మంది పోలీసుల బందోబస్తు మధ్య బల్దియా అధికారులు ఆలయానికి ప్రహరీగోడ నిర్మించారని, తాను చెప్పిన ఒక్క మాటను కూడా పరిగణలోకి తీసుకోని దుస్థితి అంటూ మేయర్ మాజీద్ హుస్సేన్‌కు విన్నవించారు.
* కౌన్సిల్‌లో ఆవేదన వ్యక్తం చేసిన మాజీ మేయర్ కార్తీకరెడ్డి
english title:
p
Date:
Thursday, July 4, 2013