న్యూఢిల్లీ, జూలై 3: ఉత్తరాఖండ్‌లో ఇటీవల వర్షాలు, వరదలకు తీవ్రంగా నష్టపోయిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌కు పూర్వవైభవం తీసుకురానున్నట్టు కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి చంద్రేష్ కుమారి కొట్చ్ స్పష్టం చేశారు. ప్రకృతి సృష్టించిన విలయానికి ప్రముఖ పర్యాటక కేంద్రాలు, పుణ్యక్షేత్రాలు నామరూపాలు లేకుండా పోయాయి. ఉత్తరాండ్‌లో జరిగి నష్టాన్ని అంచనావేయడానికి భారత పురావస్తుశాఖ నిపుణులను పంపినట్టు మంత్రి వెల్లడించారు. అయితే వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో నిపుణులు ఏరియల్ సర్వేతోనే సరిపెట్టాల్సి వచ్చిందని బుధవారం ఇక్కడ మీడియాకు తెలిపారు. ప్రకృతి ప్రళయానికి కేదార్‌నాథ్ ఆలయం పాక్షికంగా దెబ్బతిందని ఆమె అన్నారు. ఆలయానికి జరిగిన నష్టం, దాని పునర్‌నిర్మాణం కోసం తీసుకోవల్సిన చర్యలపై అంచనా వేయడానికి ఎఎస్‌ఐ నిపుణులను పంపితే దురదృష్టవశాత్తు ఘటనా స్థలానికి చేరుకోలేకపోయారని ఆమె చెప్పారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించిన తరువాత మరోసారి పురావస్తు నిపుణులను సంఘటనా స్థలానికి పంపుతామని మంత్రి స్పష్టం చేశారు. సహాయ, పునరావాస పనులతో పాటు రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆమె తెలిపారు. ఆలయ పునర్‌నిర్మాణం, పునరావాస పనులకు ఏ మేరకు నిధులు అవసరమో ఒక అంచనాకు రావల్సి ఉందని చంద్రేష్ కుమారి అన్నారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే తాము పనులు ప్రారంభిస్తామని మంత్రి ప్రకటించారు. వరద ఉద్ధృతికి కేదార్‌నాథ్ ఆలయానికి తీవ్ర నష్టం వాటిల్లిందని ఆమె చెప్పారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కేదార్‌నాథ్ ఆలయాన్ని పునర్ నిర్మిస్తామని ప్రకటించిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకురాగా ‘సారస్వత కట్టడాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మా శాఖపై ఉంది. ఎవరైనా ముందుకొస్తే అది వారి ఇష్టం’ అని ఆమె పేర్కొన్నారు. ‘్భరత పురావస్తుశాఖలో ఎంతో అనుభవజ్ఞులైన నిపుణలున్నారు. వరదలకు మందు ఆలయం ఎలా ఉండేదో అలా తీర్చిదిద్దే నైపుణ్యం ఎఎస్‌ఐకి ఉంది’ అని మంత్రి స్పష్టం చేశారు.
రంగంలోకి పురావస్తు నిపుణులు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి వెల్లడి
english title:
d
Date:
Thursday, July 4, 2013