Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

పదవులకు వేలం నిర్వహిస్తే ఓటు హక్కు తొలగిస్తాం

$
0
0

గుంటూరు, జూలై 4: జిల్లాలో పంచాయతీ ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా ఎన్నికల నియమావళిని కఠినంగా అమలు చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ డి మురళీధర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం రెవెన్యూ కల్యాణ మండపంలో అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియమావళి గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయి మొత్తం అమలులో ఉందన్నారు. పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను ఈనెల 5వ తేదీ సాయంత్రానికి తొలగించేలా ఆయా పార్టీల ప్రతినిధులతో చర్చించి చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల షెడ్యూల్డ్ ప్రకటించిన క్షణం నుండీ నియమావళి అమలులోకి వచ్చిందన్నారు. పార్టీలు బ్యానర్లు, హోర్డింగులు, ఫ్లెక్సీలను తొలగించని పక్షంలో అధికారులే తమ సిబ్బందితో వాటిని తొలగించి నాశనం చేయాలని స్పష్టం చేశారు. నూటికి నూరుశాతం నియమావళిని అమలు చేయగలిగితే ఎటువంటి సమస్యలు ఉత్పన్నమవ్వవని పేర్కొన్నారు. నియమావళిని అమలు చేసే విషయంలో ఎన్నికల సంఘం ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని, ఎటువంటి ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లొంగవద్దని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు నియమావళి అమలులో ఉంటుందన్నారు. ఈ సమయంలో మంత్రులు, ఇతర నాయకులు, ప్రభుత్వ కార్యక్రమాలపై సమావేశాలు ఏర్పాటు చేసినా ప్రభుత్వ అధికారులు హాజరు కావాల్సిన అవసరం లేదని, అటువంటి సమావేశాలను పార్టీ సమావేశాలుగా పరిగణించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల ప్రచారాల్లో ప్రభుత్వ అధికారులు గానీ, సిబ్బంది పాల్గొన కూడదని తెలిపారు. ప్రతి ఒక్కరి వద్ద ప్రస్తుతం సెల్‌ఫోన్లు ఉన్నందున వాటి ద్వారా ఫొటోలు, వీడియో తీసే అవకాశం ఉన్నందున అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా ప్రచారంలో పాల్గొన్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. నియమావళిని పకడ్బందీగా అమలు చేసే క్రమంలో జిల్లాలో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటవుతుందని తెలిపారు. ఈ కమిటీలో పట్టణ, గ్రామీణ పోలీసు అధికారులతో పాటు, వివిధ శాఖల అధికారులు కూడా ఉంటారని తెలిపారు. డివిజన్, మండల స్థాయిలలో కూడా కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సిబ్బందికి కేటాయించిన విధులకు, శిక్షణా తరగతులకు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. మినహాయింపులు, సెలవలు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. సర్పంచ్, వార్డు సభ్యులు ఏకగ్రీవంగా గాని, ప్రజలు ఎన్నుకున్న వారై ఉండాలని, వేలం ద్వారా జరిగే ఎంపిక చెల్లదని అన్నారు. ఈ విషయంలో బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాక వారికి భవిష్యత్తులో ఓటు హక్కులేకుండా చేస్తామని స్పష్టం చేశారు. గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో కొత్తగా మంజూరైన వివిధ అభివృద్ధి పనులను ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకూ ప్రారంభించకూడదని ఇన్‌చార్జి కలెక్టర్ మురళీధర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈసమావేశంలో గుంటూరు ఆర్‌డిఒ బి రామమూర్తి, డివిజనల్ పంచాయతీ అధికారి వీరయ్య, డివిజన్‌లోని తహశీల్దార్లు, ఎండిఒలు తదితరులు పాల్గొన్నారు.

అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి
గుంటూరు, జూలై 4: ప్రత్యేక ఆంధ్రా ద్వారా అధికార వికేంద్రీకరణ జరుగుతుందని, దీంతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని బిజెపి రాష్టన్రేత యడ్లపాటి రఘునాథబాబు పేర్కొన్నారు. గురువారం స్థానిక అరండల్‌పేటలోని వైన్‌డీలర్స్ కల్యాణ మండపంలో బిజెపి ఆధ్వర్యంలో సీమాంధ్ర ఉద్యమ కమిటీ నేతృత్వంలో సీమాంధ్ర ప్రాంత ప్రయోజనాల పరిరక్షణపై చర్చావేదిక నిర్వహించారు. చర్చావేదికకు ముఖ్య అతిథిగా హాజరైన రఘునాధబాబు మాట్లాడుతూ సమైక్యాంధ్ర జెఎసి నుండి కాంగ్రెస్, టిడిపి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు తప్పుకోవడంతో సమైక్యాంధ్ర జెఎసి తన అస్తిత్వాన్ని కోల్పోయిందని తెలిపారు. ప్రత్యేకాంధ్ర ఉద్యమం తరువాత అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. మోసం చేయడం, మాయమాటలు చెప్పడం కాంగ్రెస్ సహజ లక్షణమని విమర్శించారు. వెంటనే ఈ ప్రాంత నాయకులు సీమాంధ్ర జెఎసిని ఏర్పాటు చేసి నదీజలాలు, ప్రాజెక్టులను జాతీయ చేసేలా, హైదరాబాద్, తెలంగాణ జిల్లాల్లో నివాసముంటున్న ఆంధ్రుల ఆస్తులు, ప్రాణ రక్షణకు పోరాడాలని కోరారు. సీమాంధ్ర ఉద్యమ కమిటీ అధికార ప్రతినిధి జూపూడి రంగరాజు మాట్లాడుతూ సీమాంధ్ర రాజధాని ఏర్పాటుకు ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వాలని, వెనుకబడి జిల్లాలు, ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికను రూపొందించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు పోట్లూరి పూర్ణచంద్రరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వల్లెపు కృపారావు, సిహెచ్ విజయభాస్కరరెడ్డి, జాతీయ కౌన్సిల్ సభ్యులు రాజా రామ్మోహనరావు, ఆర్ లక్ష్మీపతి, వై స్వరూపరాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి దొప్పలపూడి గోపాలరావు, నగర నాయకులు కాయితి సైదారెడ్డి, ఆలూరి కోటేశ్వరరావు, జగన్మోహన్, కెవి సుబ్బారావు, వనమా పూర్ణచంద్రరావు, చంద్రశేఖర్, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
పారిశుద్ధ్యంపై అవగాహనకు విద్యార్థుల ర్యాలీ
పొన్నూరు, జూలై 4: పారిశుద్ధ్య పక్షోత్సవాల్లో భాగంగా పొన్నూరు మండలం బ్రాహ్మణ కోడూరు గ్రామంలో ప్రజలకు అవగాహన కల్గించేందుకు విద్యార్థులు ర్యాలీ జరిపారు. పారిశుద్ధ్య పరిరక్షణకై చేపట్టాల్సిన చర్యల విషయమై ప్రజల్లో ప్రచారం చేయడంతో పాటు, మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసి అంజయ్యతో పాటు, రిసోర్స్‌పర్సన్ డి దాసు, ఎఎన్‌ఎం వి లియమ్‌కుమారి, అంగన్‌వాడీ సిబ్బం ది, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
7న జిల్లా స్థాయి
చదరంగం పోటీలు
గుంటూరు (స్పోర్ట్స్), జూలై 4: జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక బిఆర్ స్టేడియంలో ఈనెల 7వ తేదీన అండర్-15 బాల బాలికలకు చదరంగం పోటీలను నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి ఎం సాంబశివరావు తెలిపారు. పోటీలలో మొదటి నాలుగు స్థానాలు సాధించిన బాల బాలికలను శ్రీకాకుళంలో ఈనెల 12 నుండి 14 వరకు జరగనున్న రాష్టస్థ్రాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల బాల బాలికలు 7వ తేదీన ఉదయం 8 గంటలకు నిర్వాహకుల ను సంప్రదించి, తమ పేర్లను నమో దు చేయించుకోవాలని కోరారు.
వైఎస్సార్ సీపీ ఎన్నికల
పరిశీలకునిగా ఉప్పుటూరి
తాడికొండ, జూలై 4: వైఎస్‌ఆర్ సిపి తాడికొండ మండల ఎన్నికల పరిశీలకుడిగా విద్యార్థి విభాగం నుండి ఉప్పుటూరి నర్సిరెడ్డి నియామకం జరిగినట్లు నియోజకవర్గ కన్వీనర్ మందపాటి శేషగిరిరావు తెలిపారు. గురువారం తాడికొండ సాయిబాబా కల్యాణ మండపంలో విలేఖర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మందపాటి శేషగిరిరావు మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో, వార్డుల్లో వైఎస్‌ఆర్ సిపి అభ్యర్థులు ఏ పార్టీతో పొత్తులు లేకుండా బరిలో ఉంటారని స్పష్టం చేశారు. గ్రామ కోఆర్డినేటర్లు, అభిమానులు వైఎస్‌ఆర్ సిపి విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు అనూఫ్, రవికుమార్, వెంకటరెడ్డి, టి శ్రీనివాసరెడ్డి, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆర్‌టిసి కార్మికుల ధర్నా
మంగళగిరి, జూలై 4: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎంప్లారుూస్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక బస్‌స్టేషన్ ప్రాంగణంలో ఆర్‌టిసి కార్మికులు ధర్నా నిర్వహించారు. శుక్రవారం నుంచి జరుప తలపెట్టిన నిరవధిక బంద్‌ను జయప్రదం చేయాలని, ఇయు అధ్యక్షుడు డి నాగేంద్రం కోరారు. ఎంప్లారుూస్ యూనియన్ నాయకులు కెపి శేఖర్, వి శ్రీనివాసరావు, పిఎస్‌ఎస్‌కె ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

జయరామిరెడ్డికి ‘అవగాహన’ అభినందన
గుంటూరు (పట్నంబజారు), జూలై 4: ఎన్‌జి వ్యవసాయ విశ్వవిద్యాలయం పిజి స్టడీస్ డీన్‌గా పదోన్నతి పొందిన పి జయరామిరెడ్డిని గురువారం అవగాహన సంస్థ పక్షాన రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యలమంచలి శివాజీ, స్వాతంత్య్ర సమరయోధుడు పావులూరి శివరామకృష్ణయ్య అభినందించారు. అరండల్‌పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ యలమంచలి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా సీనియర్ శాస్తవ్రేత్తగా ప్రభుత్వ వ్యవసాయరంగంలో పనిచేస్తూ నిబద్ధత గల అధికారిగా గుర్తింపు తెచ్చుకున్న జయరామిరెడ్డి పదోన్నతి పొందడం ఆనందదాయకమన్నారు. సమరయోధుడు పావులూరి మాట్లాడుతూ తన గురువైన ఆచార్య ఎన్‌జి రంగా పేరున ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయానికి మంచిపేరు తేవడానికి జయరామిరెడ్డి వంటి శాస్తవ్రేత్తల కృషి అవసరమన్నారు. అనంతరం జయరామిరెడ్డిని యలమంచలి, పావులూరి తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి, దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి, సంస్థ ఉపాధ్యక్షులు పిఎస్ మూర్తి, సహాయ కార్యదర్శి అచ్యుత ఇందుశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

వినుకొండలో 66 గుడిసెలు దగ్ధం
వినుకొండ, జూలై 4: వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ సమీపంలో బాబు జగ్జీవన్‌రాం కాలనీలో బుధవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో 66 గుడిసెలు అగ్నికి ఆహుతై సుమారు రూ. 7లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. నిద్ర సమయంలో వున్న గుడిసె వాసులు ఈ అగ్నిప్రమాదాన్ని గమనించి హాహాకారాలతో పిల్లాపాపతో, కట్టుబట్టలతో నిరాశ్రయులయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారి జైపాల్ తమ సిబ్బందితో హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఆ సమయంలో నూజండ్ల వైపు నుండి తిరిగివస్తున్న వైఎస్సార్ సిపి కన్వీనర్ డా నన్నపనేని సుధ, డాక్టర్ లతీష్ రెడ్డి సంఘటనా సమయంలో అక్కడే ఉండి బాధితులకు సహాయ సహకారాలు అందించారు. గురువారం ఉదయం తహశీల్దార్ సిహెచ్ కృష్ణమూర్తి కాలనీకి చేరుకుని కాలనీని సందర్శించి బాధితులను పరామర్శించారు. అగ్నిప్రమాద విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్లి బాధితులకు న్యాయం చేస్తామన్నారు. డిసిసి అధ్యక్షుడు మక్కెన మల్లిఖార్జునరావు అగ్నిబాధితులను పరామర్శించి ప్రభుత్వపరంగా బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు శివశక్తి నీలా అండ్ అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాలనీ వాసులకు మంచినీళ్ళు ట్యాంకు సరఫరా చేసి భోజనాలు ఏర్పాటు చేశారు. అగ్నిప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.
రాష్ట్ర ప్రజల ధైర్య, పౌరుష, ప్రతాపాలకు ప్రతీక అల్లూరి
గుంటూరు (కల్చరల్), జూలై 4: అచంచలమైన దేశభక్తి, నిస్వార్థమైన త్యాగనిరతి, వీటన్నింటికీ తోడు నిరుపమాన పోరాట పటిమతో బ్రిటీష్ వారి గుండెల్లో నిద్రపోయిన మన్య వీరుడు అల్లూరి సీతారామరాజు రాష్ట్ర ప్రజల ధైర్య, పౌరుష, ప్రతాపాలకు ప్రతీక అని అరసం రాష్ట్ర అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ శ్లాఘించారు. గురువారం రాత్రి నగరంలోని అరండల్‌పేట అవగాహన కార్యాలయంలో భారతజాతి గర్వించదగ్గ వీరుడు అల్లూరి సీతారామరాజు 116వ జయంతి సభను సీతారామరాజు విగ్రహ కమిటీ, అవగాహన సంయుక్త ఆధ్వర్యంలో జరిగింది. ఈ సభకు విగ్రహ ప్రతిష్ఠాపన కమిటీ అధ్యక్షుడు ఎంవి రమణరావు అధ్యక్షత వహించారు. ప్రధానవక్తగా విచ్చేసిన లక్ష్మీనారాయణ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ సీతారామరాజు పౌరుషం, ఆయన పోరాట పటిమ వేలాది మంది యువతీ, యువకుల్లో చైతన్యాన్ని కల్గించిందన్నారు. అధ్యక్షత వహించిన రమణరావు మాట్లాడుతూ యువకుడుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి మన్యం ప్రాంత జనావళిని స్వాతంత్య్ర పథంవైపు నడిపించి వారందరికీ అండదండగా నిలిచి బ్రిటీషు పాలకులను తిప్పికొట్టిన ధీశాలి అన్నారు. పాఠ్యాంశాల్లో అల్లూరి పోరాట దృక్పథాన్ని, స్వాతంత్య్రోద్యమంలో ఆయన పాత్రను పొందుపర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మరో వక్త, జర్నలిస్ట్ బండారు సురేష్ మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల పాటు బ్రిటీష్ యంత్రాంగానికి కంటిమీద కునుకు లేకుండా చేసిన యోధుడు అల్లూరి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు విగ్రహ ప్రతిష్టాపన కమిటి కార్యదర్శి ఎం సుబ్రహ్మణ్యం, అవగాహన సంస్థ ఉపాధ్యక్షుడు పిఎస్‌ఆర్ మూర్తి, కె రోశయ్య, స్వాగతోపన్యాసం చేసిన పాశం రవీంద్రయాదవ్, అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి తదితరులు అల్లూరి పోరాటాలను స్మరించుకుంటూ మనఃపూర్వక నివాళులర్పించారు. సభా ప్రారంభానికి ముందు సీతారామరాజు చిత్రపటానికి అతిథులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు.

గంటి ప్రసాదంపై దాడి గర్హనీయం
గుంటూరు (పట్నంబజారు), జూలై 4: అమరుల బంధుమిత్రుల సంఘ రాష్ట్ర నాయకులు గంటి ప్రసాదంపై దాడి గర్హనీయమని, దీన్ని నిరసిస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారం స్థానిక లాడ్జిసెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నానుద్దేశించి పిడిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విరసం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లాలో జరిగిన అమరుల సంస్మరణ సభలో పాల్గొని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో ఉన్న మిత్రుడ్ని పరామర్శించేందుకు వెళ్లిన ప్రసాదంపై కొందరు దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడటం దారుణమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా ఉద్యమాలను అణచి వేసే కుట్రలో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నాయన్నారు. పికెఎస్ రాష్ట్ర కార్యదర్శి కొండారెడ్డి మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం కోమర్తి గ్రామానికి చెందిన ప్రసాదం నాలుగు దశాబ్దాలకు పైగా పలు ప్రజా సంఘాల్లో పనిచేశారన్నారు. అంతేకాక అమరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర నాయకునిగా ఉండి పలు ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
నృసింహుని సన్నిధిలో రైల్వే ఎజిఎం
మంగళగిరి, జూలై 4: దక్షిణమధ్య రైల్వే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఎజిఎం) ఎకె పాండే గురువారం సతీసమేతంగా మంగళగిరి విచ్చేసి పానకాల లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. కొండపై పానకాలస్వామిని, దిగువ సన్నిధిలోని లక్ష్మీ నరసింహ స్వామిని, రాజ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఉపప్రధాన అర్చకులు దివి అనంత పద్మనాభాచార్యులు పాండే దంపతులను ఆశీర్వదించారు. తొలుత ఆలయ ముఖద్వారం వద్ద వీరికి ఆలయ ఇఓ నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి సంప్రదాయ బద్ధంగా ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
ఎన్నికల నిబంధనావళికి బద్ధులై మసలుకోవాలి

తెనాలి, జూలై 4: ఎన్నికల నియమావళికి బద్ధులై విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని బూత్ లెవల్ సిబ్బందితో జెసి మురళీధర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక జెఎమ్‌జె కళాశాలలో పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహించే సిబ్బందికి ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో జెసి, మురళీధర్‌రెడ్డి పాల్గొని ఎన్నికల నియమావళిపై పలు సూచనలు చేశారు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన క్రమంలో జిల్లాలో తొలి విడత పోలింగ్ ఈ నెల 23న తెనాలి డివిజన్ నిర్వహించనున్నందున పోలింగ్ స్టేషన్లలో విధి విధానాలు వివరించారు. మొదటి ఫేజ్ ఎన్నికల్లో డివిజన్‌లో 18 మండలాలకుగాను 349 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్న క్రమంలో కోడ్ అమలులోకి వచ్చిందన్నారు. ఎన్నికల కోడ్ కేవలం గ్రామాలకే అనుకోవద్దని, రాష్ట్రం మొత్తం ఎన్నికల కోడ్ అమలులో ఉందన్నారు. జిల్లాలోని అర్బన్ ప్రాంతాల్లో కూడా ఎన్నికల కోడ్ అమలులో ఉందన్నారు. నిబంధనావళికి లోబడి పట్టణాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పోలింగ్ సమయంలో సమస్యాత్మక గ్రామాల విషయంలోను పూర్తి స్థాయి ముందు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఆర్డీఓ ఎస్.శ్రీనివాసమూర్తి అధ్యక్షత వహించిన సదస్సులో డిఎల్‌పిఒ సుబ్రహ్మణ్యం, మండల స్థాయి అధికారులు, బూత్‌లెవల్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం విలేఖర్లతో జెసి మాట్లాడుతూ ఎన్నికల నిబంధనావళిని పటిష్టమైన విధి విధానాలతో అమలుచేస్తున్నామన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న నాయకుల విగ్రహాలు, ఫోటోప్రేమ్‌లపై కూడా ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ముసుగులు వేయాలని సూచించామన్నారు. పోలింగ్ సమయంలో సమస్యాత్మక గ్రా మాలుగా గుర్తించిన చోట్ల, పోలీస్ నిఘాతోపాటు, తమ వంతు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగించుకుంటామన్నారు. అన్ని రాజకీయ పార్టీల వారు ఎన్నికల నియమావళిని గౌరవించి తమ కార్యక్రమాలను నిర్వహించుకోవాల్సి ఉంటుందన్నారు.
నిధుల వినియోగంలో జిల్లాకు ప్రాధాన్యమివ్వాలి
గుంటూరు (పట్నంబజారు), జూలై 4: ఉడా చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన వణుకూరి శ్రీనివాసరెడ్డి గురువారం ఎంపి రాయపాటి సాంబశివరావును స్థానిక లక్ష్మీపురంలోని ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపి రాయపాటి మాట్లాడుతూ ఇప్పటి వరకు ఉన్న విజిటిఎం ఉడా విస్తీర్ణంలో అధికభాగం గుంటూరు జిల్లాలో ఉన్నప్పటికీ నిధుల వ్యయం పరిశీలిస్తే సరైన న్యాయం జరగడం లేదన్నారు. జిల్లాలో ఉడా ప్రచారా ఆర్భాటాలుగా మిగిలిపోయిన అమరావతి టౌన్‌షిప్‌లో ఎటువంటి అభివృద్ధి లేదని, అదేవిధంగా సీతానగరం వద్ద శిలాఫలకంగా మిగిలిపోయిన బోధిశ్రీ ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని సూచించారు. ఉడా ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతున్న గుంటూరు ఇన్నర్ రింగురోడ్డు మూడవ దశ పనులు కూడా త్వరగా ప్రారంభించేలా చూడాలని కోరారు. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలలో ఉడాకు ఎంపి ల్యాడ్స్ నుండి తాను 30 శాతం నిధులిస్తానని దానికి 70 శాతం ఉడా నిధులు జత చేసి రోడ్లు తదితర వౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. వణుకూరి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఉడా చేపట్టిన డ్రీమ్ ప్రాజెక్టు నిధుల వ్యయంపై తాను అవగాహనకు వచ్చిన వెంటనే అభివృద్ధి కార్యక్రమాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, మాజీ జడ్పీటిసి సభ్యులు మొగిలి భరత్‌కుమార్, మోహన్‌రెడ్డి, సూర్యదేవర రవి తదితరులు పాల్గొని వణుకూరిని అభినందించారు.
చెత్తను వేరు చేయడం అన్ని విధాల లాభదాయకం
గుంటూరు, జూలై 4: గృహాలలో పోగయ్యే చెత్తను తడి, పొడి చెత్తలుగా వేరు చేయడం వల్ల ఆరోగ్యపరంగా, పర్యావరణపరంగా, సామాజికంగా, ఆర్థికంగా చూస్తే అన్ని విధాల లాభదాయకమేనని ప్రముఖ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి పేర్కొన్నారు. సంపూర్ణ పారిశుద్ధ్య అమలులో భాగంగా నగరపాలక సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఊరంటే గుంటూరే కార్యక్రమం రెండోరోజైన గురువారం స్థానిక అరండల్‌పేటలోని సాయిభాస్కర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అరండల్‌పేటలో ప్రారంభమైన ర్యాలి పిచ్చుకలగుంట, భారత్‌పేట, మల్లిఖార్జునపేట, శారదా కాలనీల మీదుగా తిరిగి ఆసుపత్రి వరకు జరిగింది. ర్యాలీలో ఆసుపత్రి సిబ్బంది తడి, పొడి చెత్తలను వేరు చేయడం, దీని వల్ల కలిగే లాభాలతో ఆసుపత్రి రూపొందించిన కరపత్రాలను ఆయా ప్రాంత వాసులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బూసిరెడ్డి నరేంద్రరెడ్డి మాట్లాడుతూ గృహ పరిసరాలను పరిశుభ్రంగా తయారు చేసుకోవడం వల్ల డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా వంటి వ్యాధులకు దూరంగా ఉండవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిఇ, నోడల్ అధికారి నగేష్‌బాబు, స్పెషల్ టీమ్ సభ్యులు సురేష్ భండారి, బషీర్, సాయిభాస్కర్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ టివి రావు, డాక్టర్ యరగూటి సాంబశివారెడ్డి, డాక్టర్ లీలాకాంత్, మేనేజర్ చంద్రశేఖర్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నాలుగున్నర దశాబ్దాల పాటు సర్పంచ్‌గా పనిచేసిన జమిందార్
నరసరావుపేట, జూలై 4: రాష్ట్రంలో నాలుగున్నర దశాబ్దాల పాటు గ్రామ సర్పంచ్‌గా పనిచేసిన ఏకైక వ్యక్తి పెట్లూరివారిపాలెం జమిందార్ కటికినేని వెంకటరమణ సుబ్బారావు అని గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ యన్నం వెంకటనర్సిరెడ్డి కొనియాడారు. గురువారం స్థానిక షాలేంనగర్‌లో కటికినేని వెంకటరమణ సుబ్బారావు సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. జమిందార్ వెంకటరమణ మాజీ ముఖ్యమంత్రి దివంగత కాసు బ్రహ్మనందరెడ్డి, కాసు వెంగళరెడ్డితో సహచర్యం చేశారని తెలిపారు. పేద ప్రజల సంక్షేమం కోసం, గ్రామాభ్యుదయం కోసం పాటుపడిన వ్యక్తి అన్నారు.
రెండో రోజుకు ఎమ్మార్పీఎస్ రిలే నిరాహార దీక్షలు
వినుకొండ, జూలై 4: వృద్ధులు, వితంతువుల పింఛన్‌ను వెయ్యి రూపాయలకు పెంచాలని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం నాటికి రెండో రోజుకు చేరుకున్నాయి. ఎంఆర్పీఎస్ నియోజకవర్గ అధ్యక్షుడు రెడ్డిబోయిన ప్రసన్నకుమార్ మాదిగ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 200 రూపాయల పింఛన్‌ను వెయ్యి రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు.

ఆరోగ్యంపట్ల ప్రతి ఒక్కరు శ్రద్ధ చూపాలి
భట్టిప్రోలు, జూలై 4: తమ చిన్నారుల ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరు శ్రద్ధ చూపాలని రాజీవ్ విద్యా మిషన్ జిల్లా సిఎంఓ రాజకుమారి అన్నారు. విద్యా పక్షోత్సవాల్లో భాగంగా మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో గురువారం ఆరోగ్య, పారిశుద్ధ్య దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వెల్లటూరు జెడ్పీ పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు గ్రామంలో ర్యాలీ నిర్వహించి ఆరోగ్య సూత్రాలు తెలియజేస్తూ నినాదాలు చేశారు. అద్దేపల్లిలోని హెచ్‌సి, ఉర్దూ, యుపి పాఠశాలల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం యుపి పాఠశాలలో జరిగిన సభకు ఎంఇఓ జాన్సన్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి సిఎంఓ రాజకుమారి మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి ఆరోగ్యంగా ఉంటేనే చదువుల్లో రాణిస్తారన్నారు. పిహెచ్‌సి వైద్యులు రవిబాబు, శివకామేశ్వరావు ఆరోగ్య సూత్రాలు వివరించారు. అనంతరం చిన్నారులకు బహుమతులు, దుస్తులు పంపిణీ చేశారు. ఆర్‌విఎం అందించిన వినికిడి యంత్రాన్ని లక్ష్మీనరసింహారావు అనే మూగ విద్యార్థికి సిఎంఓ అందజేశారు.
జాతీయ అథ్లెటిక్స్‌లో సీతారామమూర్తికి నాల్గవ స్థానం
తెనాలి రూరల్, జూలై 4: విశ్రాంత ఉపాధ్యాయుడు, జాతీయ అథ్లెటిక్ క్రీడాకారుడు దీవి సీతారామమూర్తి జూన్ 27 నుండి జూలై 1వ తేదీ వరకు బెంగుళూరులోని కంఠీరవ స్టేడియంలో జరిగిన 34వ జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరఫున లాంగ్‌జంప్‌లో పాల్గొని 4వ స్థానం కైవశం చేసుకున్నారు. తెనాలిలోని గంగానమ్మపేటకు చెందిన ఈయన గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పతకం సాధించిన తను ఎపి కార్యదర్శి దేవదర్శన్ ద్వారా జ్ఞాపిక, ప్రసంశాపత్రం అందుకున్నట్లు చెప్పారు.
రైతు శ్రేయస్సే ధ్యేయంగా పని చేయాలి
* ఎంపి రాయపాటి
గుంటూరు (కార్పొరేషన్), జూలై 4: పొన్నూరు వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్‌గా నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన బొనిగల వేణుప్రసాద్ గురువారం స్థానిక లక్ష్మీపురంలోని ఎంపి రాయపాటి సాంబశివరావును ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపి రాయపాటి మాట్లాడుతూ మార్కెట్‌యార్డు రైతులకు అవసరమైన సదుపాయాలను కల్పించి రైతు శ్రేయస్సే ధ్యేయంగా పని చేయాలన్నారు.
దొంగ పెళ్ళిళ్ళ ముఠాపై చర్యలు తీసుకోవాలి
నరసరావుపేట, జూలై 4: ప్రతి గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించే డయల్ యువర్ స్పెషలాఫీసర్ కార్యక్రమానికి పట్టణ ప్రజల నుంచి ఎనిమిది ఫిర్యాదులు వచ్చాయి. మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ఎవివి భద్రరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తొలి ఫిర్యాదుగా వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఫిర్యాదు చేస్తూ పట్టణంలో దొంగ పెళ్ళిళ్లు చేసే ముఠా ఉందని, ఆ ముఠా నరసరావుపేట, గుంటూరు, విజయవాడ, హైదరాబాదు తదితర ప్రాంతాల్లో దొంగ పెళ్ళిళ్లు నిర్వహిస్తున్నారని అన్నారు. వీరిలో కొందరు పాత్రికేయులతోపాటు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్లు, మరి కొంతమంది వ్యక్తులు ఉన్నారని, వారి పేర్లతో సహా వెల్లడించారు. ఈ ఫిర్యాదుపై మున్సిపల్ కమిషనర్ స్పందిస్తూ తాము ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని, మీరు కూడా ఎస్పీకి ఫిర్యాదు చేయాలని సమాధానం ఇచ్చారు. అంతేకాక, పట్టణంలోని అన్ని పోలీస్టేషన్లలో వీరే దందాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. దీనిపై కమిషనర్ మాట్లాడుతూ స్థానిక పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. చంద్రబాబుకాలనీకి చెందిన సీతారామ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేస్తూ తమ కాలనీలో పందులు స్వైరవిహారం చేస్తున్నాయని, వాటిని నిర్మూలించే చర్యలు చేపట్టాలని కోరారు. చిలకలూరిపేట రోడ్డులోని జయపాల్ అనే వ్యక్తి ఫిర్యాదు చేస్తూ డాక్టర్ అనె్న రామమోహనరావు ఆసుపత్రి పక్క బజారులో డ్రైనేజి వ్యవస్థ సరిగాలేకపోవడంతో మురుగు అక్కడే నిలిచి తీవ్ర అసౌర్యానికి గురవుతున్నామని అన్నారు. బాపనయ్యనగర్‌కు చెందిన ఎస్‌కె ఫరీద్ ఫిర్యాదు చేస్తూ 60 అడుగుల రోడ్డు వద్ద నాలుగు రోడ్లు ఉన్న చోట నుండి ఒకే డ్రేనేజిలోకి మురుగు ప్రవహిస్తుందని, ఆ డ్రైనేజీలో చెత్త చెదారం అడ్డుపడి మురుగు ప్రవహించడం లేదని, వెంటనే చెత్త చెదారాన్ని తొలగించాలని కోరారు. మాలమహానాడు అధ్యక్షుడు అన్నవరపుకిషోర్ ఫిర్యాదు చేస్తూ మున్సిపల్ పన్నులు చెల్లించేందుకు వెళ్తే ఈసేవాలో సమయం వృధా అవుతుందని, అందుకోసం మున్సిపల్ కార్యాలయంలోనే కౌంటర్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.

‘పంచాయతీ’ గోదాలో బస్తీమే సవాల్
తెనాలి రూరల్, జూలై 4: పంచాయతీ ఎన్నికలకు అభ్యర్థుల నుండి నామినేషన్లు ఈ నెల 9 నుంచి స్వీకరించనున్న నేపథ్యంలో గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. సర్పంచ్, వార్డు అభ్యర్థుల ఎంపికలో వివిధ రాజకీయ పార్టీల నేతలు తలమునకలౌతున్నారు. తాము బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకునేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. మండలంలో మేజర్ పంచాయతీలైన నందివెలుగు, కొలకలూరు, అంగలకుదురు, సంగంజాగర్లమూడి, పెదరావూరు, కఠెవరం గ్రామాల్లో వాతావరణం వేడెక్కింది. అధిక సంఖ్యలో ఓటర్లు, వార్డు ఉన్నందున అన్ని పార్టీల దృష్టి ఆయా గ్రామాలపై పడింది. నందివెలుగులో 2443 మంది పురుషులు, 2526 మంది మహిళలు ఉన్నారు. కొలకలూరులో 5310 మంది పురుషులు, 5520 మహిళలు, అంగలకుదురులో 3100 మంది పురుషులు, 3247 మంది మహిళలు, సంగం జాగర్లమూడిలో 1971 మంది పురుషులు, 2080 మంది మహిళలు, పెదరావూరులో 2622 మంది పురుషులు, 2758 మంది మహిళలు, కఠెవరంలో 2367 మంది పురుషులు, 2513 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మండలం మొత్తంమీద 18 గ్రామ పంచాయతీలకుగాను 55563 మంది ఓటర్లు ఉండగా అందులో 27296 మంది పురుషులు, 28267 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మండలంలోనే అతిపెద్ద పంచాయతీ కొలకలూరులో అత్యధికంగా 10830 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామంపై అన్ని పార్టీల దృష్టి మళ్లింది. ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన సొసైటీ ఎన్నికల్లో మండలంలోని ఆరు సొసైటీలకుగాను నాలుగింటిని తెలుగుదేశం పార్టీ కైవశం చేసుకోగా కాంగ్రెస్ రెండింటితో సరిపెట్టుకుంది. వైఎస్‌ఆర్ సిపికి ఒక్క సొసైటీకి దక్కలేదు.
ఈ క్రమంలో అన్ని పార్టీల అధ్యక్షులు పంచాయతీ ఎన్నికలను చాలెంజ్‌గా తీసుకోవటంతో స్థానిక నాయకులు గ్రామాల్లో తాము బలపరిచిన అభ్యర్థులను గెలిపించి అధిష్టానం దృష్టిలో పడేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే 2006 పంచాయతీ ఎన్నికల మాదిరిగా కాకుండా ఈసారి ఎక్కువ మొత్తంలో అభ్యర్థులు ఖర్చు చేయనిదే విజయం కష్టమన్న వార్తలు వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు పార్టీల నాయకులు గురువారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి రిజర్వేషన్ల వారీగా అభ్యర్థుల ఎంపికను ఖరారు చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే, శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో కాంగ్రెస్ నాయకులు, వైఎస్‌ఆర్ సిపి నాయకులు గుదిబండి వెంకటరెడ్డి, చినవెంకటరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అభ్యర్థుల ఎంపికలు జరుగుతున్నారు. ఎవరు విజయం సాధించాలన్నా మహిళా ఓటర్లే కీలకం కానున్నాయి. ఇది గ్రహించిన నేతలు వారివైపు దృష్టి సారించారు. ‘పంచాయతీ’ గోదాలో బస్తీమే సవాల్
తెనాలి రూరల్, జూలై 4: పంచాయతీ ఎన్నికలకు అభ్యర్థుల నుండి నామినేషన్లు ఈ నెల 9 నుంచి స్వీకరించనున్న నేపథ్యంలో గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. సర్పంచ్, వార్డు అభ్యర్థుల ఎంపికలో వివిధ రాజకీయ పార్టీల నేతలు తలమునకలౌతున్నారు. తాము బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకునేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. మండలంలో మేజర్ పంచాయతీలైన నందివెలుగు, కొలకలూరు, అంగలకుదురు, సంగంజాగర్లమూడి, పెదరావూరు, కఠెవరం గ్రామాల్లో వాతావరణం వేడెక్కింది. అధిక సంఖ్యలో ఓటర్లు, వార్డు ఉన్నందున అన్ని పార్టీల దృష్టి ఆయా గ్రామాలపై పడింది. నందివెలుగులో 2443 మంది పురుషులు, 2526 మంది మహిళలు ఉన్నారు. కొలకలూరులో 5310 మంది పురుషులు, 5520 మహిళలు, అంగలకుదురులో 3100 మంది పురుషులు, 3247 మంది మహిళలు, సంగం జాగర్లమూడిలో 1971 మంది పురుషులు, 2080 మంది మహిళలు, పెదరావూరులో 2622 మంది పురుషులు, 2758 మంది మహిళలు, కఠెవరంలో 2367 మంది పురుషులు, 2513 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మండలం మొత్తంమీద 18 గ్రామ పంచాయతీలకుగాను 55563 మంది ఓటర్లు ఉండగా అందులో 27296 మంది పురుషులు, 28267 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మండలంలోనే అతిపెద్ద పంచాయతీ కొలకలూరులో అత్యధికంగా 10830 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామంపై అన్ని పార్టీల దృష్టి మళ్లింది. ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన సొసైటీ ఎన్నికల్లో మండలంలోని ఆరు సొసైటీలకుగాను నాలుగింటిని తెలుగుదేశం పార్టీ కైవశం చేసుకోగా కాంగ్రెస్ రెండింటితో సరిపెట్టుకుంది. వైఎస్‌ఆర్ సిపికి ఒక్క సొసైటీకి దక్కలేదు.
ఈ క్రమంలో అన్ని పార్టీల అధ్యక్షులు పంచాయతీ ఎన్నికలను చాలెంజ్‌గా తీసుకోవటంతో స్థానిక నాయకులు గ్రామాల్లో తాము బలపరిచిన అభ్యర్థులను గెలిపించి అధిష్టానం దృష్టిలో పడేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే 2006 పంచాయతీ ఎన్నికల మాదిరిగా కాకుండా ఈసారి ఎక్కువ మొత్తంలో అభ్యర్థులు ఖర్చు చేయనిదే విజయం కష్టమన్న వార్తలు వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు పార్టీల నాయకులు గురువారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి రిజర్వేషన్ల వారీగా అభ్యర్థుల ఎంపికను ఖరారు చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే, శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో కాంగ్రెస్ నాయకులు, వైఎస్‌ఆర్ సిపి నాయకులు గుదిబండి వెంకటరెడ్డి, చినవెంకటరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అభ్యర్థుల ఎంపికలు జరుగుతున్నారు. ఎవరు విజయం సాధించాలన్నా మహిళా ఓటర్లే కీలకం కానున్నాయి. ఇది గ్రహించిన నేతలు వారివైపు దృష్టి సారించారు.

జిల్లాలో పంచాయతీ ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా ఎన్నికల
english title: 
auction

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>