Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం

$
0
0

కర్నూలు, జూలై 4: రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేటుచేసుకోకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ కె.రాఘురామిరెడ్డి తెలిపారు. బదిలీపై వెళ్తున్న ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి నుంచి గురువారం జిల్లా కొత్త ఎస్పీగా కె.రఘురామిరెడ్డి ఎస్పీ ఛాంబర్‌లో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ జిల్లాను అవగాహన చేసుకుని దశల వారీగా అసాంఘిక కార్యకలాపాలపై గట్టి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రధానంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తుండటంతో దృష్టి సారించి ఓటర్లు ప్రశాంతంగా ఓట హక్కు వినియోగించుకునేందుకు చర్యలు తీసుకుంటామర్కొన్నారు. జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచి సమూలంగా నివారించాలని ఆదేశించారు. ప్రధానంగా ఫ్యాక్షన్, భూ తగాదాలు, పరుపు హత్యలను నివారించాలన్నారు. జిల్లాలోని పేకాట, మట్కా తదితర కార్యకలాపాలపై ప్రజలు సమాచారం అందించి సహకరించాలని కోరారు. విధుల్లో తప్పు చేసిన సిబ్బందిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సమస్యలతో పోలీసు స్టేషన్‌కు వచ్చే బాధితుల పట్ల మర్యాదగా మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. పెండింగ్ కేసులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఆయ న కర్నూలు రేంజ్ డిఐజి టి.మురళీకృష్ణను మర్యాద పూర్వకంగా కలశారు. అలాగే జిల్లా పోలీసు అధికారుల సంఘం నాయకులు ఎస్పీ రఘురామిరెడ్డికి స్వాగతం పలికి పూలబొకే అందజేశారు. అనంతరం కర్నూలు సబ్‌డివిజన్‌లో ఉన్న పోలీసు అధికారులతో జరిగిన సమావేశంలో నేర సమీక్షపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ ఎన్నికల ముందే రౌడీ షీటర్లకు కౌనె్సలింగ్ చేసి బైండోవర్ చేయాలని ఎస్పీ ఆదేశించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా క్షమించేది లేదని కొత్త ఎస్పీ హెచ్చరించారు.
పిఎసి చైర్మన్‌గా కెఇ కృష్ణమూర్తి
* టిడిపి శ్రేణుల్లో ఆనందం
డోన్, జూలై 4: శాసనసభ ప్రజా పద్దుల సంఘం (పిఎసి) చైర్మన్‌గా టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు, కెయి కృష్ణమూర్తి ఎన్నిక కావడం పట్ల టిడిపి నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేబినేట్ హోదా కలిగిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా కెఇ కృష్ణమూర్తిని ఎన్నిక చేసి చంద్రబాబు టిడిపికి బిసిల పట్ల వున్న మక్కువను కనబరిచారని టిడిపి నేతలు పేర్కొంటున్నారు. 1978లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన కెఇ కృష్ణమూర్తి తొలిసారి డోన్ అసెంబ్లీ నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆ తర్వాత 1983, 1985, 1989, 2009లో డోన్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. డోన్ నియోజక వర్గం నుంచి ఐదుసార్లు గెలిచి ఓటమి ఎరుగని నేతగా మిగిలారు. ఐదుసార్లు డోన్ నుంచి ప్రాతినిథ్యం వహించిన కెఇ ఎన్నో కీలక మంత్రి పదవులు చేపట్టారు. మర్రి చెన్నారెడ్డి మంత్రి వర్గంలో పార్లమెంట్ కార్యదర్శిగా, అంజయ్య మంత్రి వర్గంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా, లఘ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. అంతేగాక కర్నూలు జడ్పీ చైర్మన్‌గా పనిచేసి జిల్లా ప్రజల మన్ననలు పొందారు. ఆ తర్వాత ఎన్టీఆర్ మంత్రి వర్గంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసి రాష్ట్రంలో కెఇ ప్రత్యేక గుర్తింపు పొందారు. 1999లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కరరెడ్డిపై విజయం సాధించి పార్లమెంట్ సభ్యుడిగా పని చేశారు. టిడిపిలో కీలక నేతగా ఎదిగి పొలిట్‌బ్యూరో సభ్యుడిగా వున్నారు. ఎంతో రాజకీయానుభవం కలిగి బిసి నేతగా వున్న కెఇకి పిఎసి చైర్మన్ పదవి దక్కడం పట్ల ఆ పార్టీ నేతలు టిఇ శేషఫణిగౌడ్, వై.నాగేశ్వరయాదవ్, పట్టణ టిడిపి అధ్యక్షులు కొట్రికె ఫణిరాజ్, బిసి సెల్ రాష్ట్ర కార్యదర్శి వెంకటరమణాచారి, తెలుగు యువత నాయకులు టిఇ నాగరాజు గౌడ్, ఎల్లాగౌడు, కన్నపుకుంట గోవిందరెడ్డి, దొరపల్లె నాగరాజు పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కెఇని ఎన్నిక చేయడం పట్ల నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.
అటవీశాఖ అధికారులకు
జింక పిల్ల అప్పగింత
మంత్రాలయం, జూలై 4 : మంత్రాలయం మండలం బూదూరు గ్రామంలో గురువారం జింక పిల్ల లభ్యమైంది. అబ్రహంకు చెందిన పొలంలో జింక పిల్లను కుక్కలు వెంట పడి వేటాడుతుండగా అబ్రహం జింక పిల్లను కాపాడి మంత్రాలయం పోలీసులకు అప్పగించారు. అటవీశాఖ అధికారులకు పోలీసులు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారి జాన్ వచ్చి జింక పిల్లను తీసుకుపోయారు.
సమర్థవంతంగా
సాగు, తాగునీటి పంపిణీ
* కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి
కర్నూలురూరల్, జూలై 4: రానున్న ఖరీఫ్ సీజన్‌లో వర్షాభావ పరిస్థితులను దృష్టిలో వుంచుకుని వ్యవసాయానికి సాగునీరు, ప్రజలకు తాగునీరు సమర్థవంతంగా పంపిణీ చేయాలని, ముఖ్యంగా ప్రభుత్వ శాఖల మధ్య చక్కటి సమన్వయంతో అధికారులు వారి సిబ్బంది కలిసి పని చేయాలని కలెక్టర్ సుదర్శన్ రెడ్డి నీటి పారుదల వివిధ శాఖాధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ కార్యాలయంలో నీటి పారుదల శాఖ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మట్లాడుతూ అధికారులు ఎల్‌ఎల్‌సి, కెసి కెనాల్ వెంట కర్నాటక రైతుల జలచౌర్యం జరగకుం డా పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. సంబంధిత ఆర్‌డిఓ, తహశీల్దార్లు బాధ్యులపై కేసులు పెట్టాలని సూచించారు. ఎగువన వున్న టిబి డ్యాంలో ప్రస్తుతం 25 టిఎంసిల నీరు నిల్వ వుందని ఆ నీటిని రైతులకు సంపూర్ణంగా పంటలకు అందించవచ్చన్నా రు. అనంతరం నీటి పారుదల శాఖ ఎస్‌ఇ మట్లాడుతూ గత యేడాది నీరు తక్కువగా వున్నప్పటికీ ఎకరాకు 42 బస్తాలు సగటున రైతులు అధిక దిగుబడి సాధించారని ఈ యేడాది నీరు పుష్కలంగా వున్నాయని మంచి దిగుబడి సాధించాలన్నారు. అభివృద్ధి చెం దిన వివిధ ఆయకట్టులలో నీటి పన్ను రూ. 86 లక్షలు వసూలు చేశామని ఇం కా కొన్ని గ్రామాల్లో తగినంత పన్ను లు రావడంలేదని తెలిపారు. కార్యక్రమంలో నీటి పారుదల శాఖ అధికారులు, ఆర్‌డిఓ పాల్గొన్నారు.
ఓబులంపల్లె సహకార సంఘం
వైకాపాదే..
ఆళ్లగడ్డ, జూలై 4: మండల పరిధిలోని ఓబులంపల్లె సహకార సంఘం ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. సంఘం పరిధిలో 13 వార్డులు వుండగా నామినేషన్‌ల పరిశీలనలో 1, 8 వార్డుల నుంచి పెండేకంటి జ్ఞానమ్మ, గోపిరెడ్డి వెంకటశివారెడ్డి, 3వ వార్డులో నబీసాహెబ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 10 వార్డులకు గురువారం ఎన్నికలు నిర్వహించగా అందులో వైకాపా 5 స్థానాలు, కాంగ్రెస్ 3, టిడిపి 2 స్థానాల్లో విజయం సాధించింది. గెలుపొందిన అభ్యర్థులకు ఎన్నికల అధికారి లక్ష్మీకాంతరెడ్డి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో సిఐ సుధాకర్‌రెడ్డి, ఎస్‌ఐలు రమేష్‌బాబు, విజయలక్ష్మీ బందోబస్తు నిర్వహించారు. ఎన్నికైన గోపిరెడ్డిశివారెడ్డిని అధ్యక్షుడిగా నిర్ణయించారు. ఉపాధ్యక్షుడిగా నాసారి నరసింహప్రసాద్‌ను ఖరారు చేశారు. శుక్రవారం అధ్యక్ష, ఉపాధ్యక్షులతో పాటు సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారని ఎన్నికల అధికారి తెలిపారు.
13 డైరెక్టర్ల స్థానాలు వైకాపా కైవసం
రుద్రవరం : మండల పరిధిలోని పెద్దకంబలూరు గ్రామ సహకార సొసైటీకి జరిగిన ఎన్నికల్లో 13 డైరెక్టర్ల స్థానాలు వైకాపా కైవసం చేసుకుంది. నాలుగు డైరెక్టర్లు ఏకగ్రీవంగా వైకాపాకి రాగా గురువారం జరిగిన ఎన్నికల్లో 9 డైరెక్టర్లు వైకాపాకే దక్కాయి. శుక్రవారం రుద్రవరం, పెద్దకంబలూరు సహకార సొసైటీలకు అధ్యక్షలను ఎన్నుకోవాల్సి ఉంది. రుద్రవరం సొసైటీకి పత్తి సత్యనారాయణ, పెద్దకంబలూరు సొసైటీకి ఎర్ర మనోహార్‌రెడ్డిలను ఎన్నుకుంటారు.
సాగునీటి సమీక్షకు
ఎన్నికల కోడ్ ఆటంకం
* జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, జూలై 4: జిల్లా సాగునీటి సమీక్షా సమావేశానికి పంచాయతీ ఎన్నికల కోడ్ ఆటంకంగా మారింది. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహించాల్సి ఉంది. అయితే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ బుధవారం విడుదల కావడంతో ఈ సమావేశంలో ప్రధాన భూమిక పోషించే ప్రజాప్రతినిధులు, నీటి వినియోగదారుల సంఘాల అధ్యక్షులు ఎన్నికల నియమావళి కారణంగా సమావేశానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సలహా మండలి సమావేశాన్ని కలెక్టర్ సుదర్శన్ రెడ్డి రద్దు చేసి సమావేశానికి హాజరైన నీటి పారుదల, రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులతో సాగునీటి సమస్యలపై చర్చించాలని నిర్ణయించుకున్నారు.

ఎన్నికల్లో టిడిపి జెండాలు ఎగురవేస్తాం
* టిడిపి ఇన్‌చార్జి జయనాగేశ్వర్‌రెడ్డి
ఎమ్మిగనూరు, జూలై 4:స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీలలో టిడిపి జెండాలు ఎగురవేయాలని నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి డాక్టర్ జయనాగేశ్వర్‌రెడ్డి గురువారం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. స్థానిక టిడిపి కార్యాలయంలో గోనెగండ్ల, నందవరం, ఎమ్మిగనూరు మండలల టిడిపి నాయకుల విస్త్రృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికలను చాలెంజ్‌గా తీసుకొని టిడిపి నాయకులు ఎన్నికల్లో గెలవాలని పిలుపు నిచ్చారు. ఇందులో భాగంగానే రాష్ట్ర టిడిపి అధ్యక్షులు చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు తిరుపతిలో శుక్రవారం జరుగు ప్రాంతీయ సదస్సుకు 30 వాహనాల్లో బయలు దేరుతున్నట్లు ఆయన వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా చంద్రబాబు ప్రసంగిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
వ్యవసాయంలో మెళకువలపై రైతులకు
అవగాహన కల్పించండి
* వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించిన కలెక్టర్
కర్నూలుఓల్డ్‌సిటీ, జూలై 4: తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించేలా రైతులకు వ్యవసాయంలో మెళకువలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని వ్యవసాయ శాఖ సమావేశ మం దిరంలో వివిధ పంటల్లో పొలంబడి నిర్వహణపై గురువారం కలెక్టర్ క్షేత్రస్థాయి అధికారులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ 20 13-14 సంవత్సరానికి సంబంధించిన వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ఏడాది వర్షపాతం తక్కువగా నమోదైనప్పటికీ కర్నాటక, మహారాష్టల్ల్రో కురిసిన వర్షాల వల్ల తుంగభద్ర దిగువ కాల్వ, కెసి కెనాల్‌కు నీరు వదలడం వల్లనే పంట దిగుబడి వచ్చిందన్నారు. ఈ ఏడాది కూడా వర్షాభావ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా త్వరలోనే తుంగభద్ర కెసి కెనాల్‌కు నీటిని వదులుతామన్నారు. గత సంవత్సరం రూ. 1400 కోట్ల పంట రుణాల లక్ష్యం కాగా రూ. 1900 కోట్లు రైతులకు మంజూరు చేశామని, ఈ ఏడాది కూడా రూ. 2,500 కోట్ల పంట రుణా లు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇప్పటి వరకూ రూ. 800 కోట్ల పంట రుణాలు రైతులకు మంజూరు చేశామన్నారు. పంట నష్టపరిహారం మొత్తాన్ని రైతులకు బ్యాంకుల ఖాతాలో జమ చేస్తున్నామన్నారు. సమావేశంలో వ్యవసాయ శాఖ జెడి ఠాగూర్‌నాయక్, డిఆర్‌ఓ వేణుగోపాల్‌రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్, టిడిపి కుట్రలను తిప్పికొట్టండి
* వైఎస్ ఆశయ సాధనే వైకాపా లక్ష్యం:మాజీ ఎంపి భూమా
నంద్యాల రూరల్, జూలై 4:కొందరి దుష్టశక్తుల ఆటకట్టించేందుకే నంద్యా ల వైకాపా అభ్యర్థిగా బరిలోకి వచ్చానని కాంగ్రెస్, టిడిపి కుట్రలను ఎదుర్కొనేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో వైకాపా జెండాను ఎగురవేయాలని వైకాపా కేంద్ర పాలకమండలి సభ్యులు మాజీ ఎంపి భూమా నాగిరెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నంద్యాల మండలంలోని అన్ని గ్రామాల వైకాపా నాయకులు, కార్యకర్తల సమావేశం మండల కన్వీనర్ గురునాథరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ ఎంపి భూమా నాగిరెడ్డి మాట్లాడుతూ తండ్రి ఆశయాలను నెరవేర్చేందుకు వైకాపాని జగన్ స్థాపించారన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా జెండా ఎగురవేసి జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలన్నదే ప్రతి ఒక్కరి ధ్యేయమన్నారు. నంద్యాల వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. రాజకీయ చరిత్ర కలిగిన నంద్యాల నాకు తల్లిలాంటిదన్నారు. రాజకీయ లబ్ధికోసమే వస్తున్నానని పుకార్లను నమ్మవద్దని కార్యకర్తలను కోరారు. గతంలో ఎంపిగా ఉన్నప్పుడు తాను ప్రారంభించిన శిలాఫలకాలే తనకు స్వాగతం పలుకుతున్నాయన్నారు. గ్రామాలలో అభివృద్ధి ఎక్కడా లేదని శాశ్వతంగా ఒక్క పని కూడా కాంగ్రెస్ నాయకులు చేయలేదన్నారు. ప్రజలను ఆకర్షించే పథకాలను పెట్టి మభ్యపెడుతున్నారని ఆరోపించారు. నంద్యాల షుగర్ ఫ్యాక్టరీ స్థలాలను అమ్ముకోకుండా కాపాడిన వ్యక్తి అందరికీ తెలుసన్నారు. రైతుల శ్రేయస్సు కోసం ఎనలేని కృషి చేస్తానన్నారు. ప్రస్తుతం వైకాపాలోకి రావాలని కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్‌లో తంటాలు పడుతున్నారన్నారు. 9 సంవత్సరాలు కష్టం అనుభవించానని గ్రూపులకు అండగా ఉంటూ వర్గాలను కాపాడుకుంటానన్నారు. నంద్యాల ఎమ్మెల్యేకు అధికార బలం ఉంటే తనకు ప్రజాబలం ఉంద ని భూమా అన్నారు. రాబోయే రోజు ల్లో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీదే రాజ్యమన్నారు. జగన్మోహన్‌రెడ్డిని ఇబ్బంది పెట్టేందుకే టిడిపి పెద్దలు, ముఖ్యమంత్రి కుట్రపన్నుతున్నారన్నారు. 30 సంవత్సరాల రాజకీయ చరిత్రలో సొసైటీ ఎన్నికల్లో నీచ రాజకీయాలు పాల్పడ్డారని ఆరోపించారు. నాయకు లు, కార్యకర్తలు ఐక్యంగా ఉండి స్థాని క సంస్థల ఎన్నికల్లో వైకాపా జెండాను ఎగురవేసి కాంగ్రెస్ అధిష్టానానికి దిమ్మ తిరిగేలా ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు. సమావేశంలో వైకాపా నాయకులు ఎవి సుబ్బారెడ్డి, మాజీ కౌన్సిలర్ ఎవిఆర్ ప్రసాద్, మిట్నాల రమణారెడ్డి, నాగసుబ్బారెడ్డి, సూర్యచంద్రారెడ్డి, గుంతనాల ఆనంద్, నాగేశ్వరరావు, గురివి రెడ్డి, పుల్లయ్య, తదితర గ్రామా ల నాయకులు పాల్గొన్నారు.
తప్పుల తడకగా ఓటరు జాబితా!
* కోడుమూరు జాబితాలో కోట్ల హర్ష పేరు
కోడుమూరు, జూలై 4: ఈ నెల 23వ తేదీ కోడుమూరు పంచాయతీకి ఎన్నికలు జరుగుతుండడంతో బరిలో ఉన్న పలు రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులు ఓటర్ల జాబితాలు తెప్పించుకుని ఓటర్లను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగానే గురువారం కోడుమూరు సర్పంచ్ స్థానానికి పోటీ చేస్తున్న ఒక అభ్యర్థి ఇంటిలో వారి అనుచరులంతా ఓటర్ల జాబితాను గుర్తించే పనిలో ఉండగా వీటిలో 15వ వార్డుకు సంబంధించిన జాబితాలో ఒక ఓటరుకు రెండు ఓట్లు ఉన్నట్లు బయటపడ్డాయి. అలాగే ఇదే వార్డులోని మాజీ సర్పంచ్ సిబి లత, ఆమె కుమారుడు సిద్దార్థ పేర్లు మీద రెండేసి ఓట్లు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. దీనికితోడు మరో రాజకీయ నాయకుడు మాజీ సర్పంచ్ కెయి రాంబాబు కుమారుడు కెఇ హర్షవర్ధన్‌గౌడ్, రాఘవేంద్రగౌడ్ పేర్లు ఉండటం గమనార్హం. ఇది ఇలా ఉండగా మరో విచిత్రం ఏమిటంటే రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి సోదరుడు కోట్లహర్షవర్ధన్‌రెడ్డి పేరు మీద ఓటరుగా నమోదు అయిన విషయం ఇక్కడ చర్చనీయాంశమైంది. అంతే గాక ఆ నేత స్థానిక మండల పరిషత్ కార్యాలయంలోని 18-141 నెంబర్ గల ఒక క్వార్టర్‌లో నివాసం ఉంటున్నట్లు జాబితాలో కనపడటం విశేషం. లద్దగిరిలో ఓటరుగా ఉన్న కోట్ల హర్షవర్ధన్‌రెడ్డిని కోడుమూరులో ఓటరుగా ఎలా నమోదు చేశారన్న విషయమై పలు రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఈ తప్పిదం తెలిసే జరిగిందా, లేదా పొరపాటుగా నమోదైందా అనే విషయాన్ని స్థానిక ఎన్నికల అధికారులు తేల్చాల్సి ఉందని ఆయా పార్టీల నాయకులు రాష్ట్ర ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. అలాగే ఇదే క్వార్టర్‌లోని 18-139 నెంబర్‌లో గత పదేళ్ల కిందట వ్యవసాయ కార్యాలయంలో విస్తరణాధికారిగా పని చేస్తున్న జి.నారాయణ ఉండేవాడు. ప్రస్తుతం ఆ ఉద్యోగి కర్నూలులో నివాసం ఏర్పరుచుకున్నప్పటికీ ఆయన పేరు ఇంకా ఓటరు జాబితాలో ఉండటం విశేషం. ఇలా పట్టణంలో ఉన్న 20 వార్డుల్లోనూ ఓటర్ల జాబితాలో తప్పులు కనపడటం శోచనీయం. ఈ తప్పిదాలను అధికారులు పోలింగ్ సమయానికైనా సరి చేస్తారా లేదా అని రాజకీయ పార్టీల నాయకులు ప్రశ్నిస్తున్నారు. పట్టణంలోని ఆయా వార్డుల్లోని ఓటర్ల జాబితాలో జరిగిన తప్పుల తడకలపై కోడుమూరు అదనపు ఎన్నికల అధికారి ఆంటోని సరైన సమాధానం చెప్పలేకపోవడం గమనార్హం. అలాగే లద్దగిరికి చెందిన కాంగ్రెస్ నేత కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి కోడుమూరులో ఉంటున్నట్లు ఓటరు జాబితాలో నమోదయ్యారన్న విషయంపై కూడా ఆ అధికారి పెదవివిప్పక పోవడం శోచనీయం.
ఆ అధికారులపై చర్యలు తీసుకోండి
* నివాసాల కూల్చివేతపై ఎమ్మెల్సీ గేయానంద్ ఆగ్రహం
కల్లూరు, జూలై 4: నగరంలో పేదలు నివసిస్తున్న అమీర్ హైదర్ కాలనీలో నివాసాల కూల్చివేతకు కారణమైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ గేయానంద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక మీడియా పాయింట్‌లో గురువారం ఆయన విలేఖరుల సమావేశంలో మట్లాడుతూ పేదలకు అందాల్సిన రాజ్యాంగ హక్కులను వారికి దక్కకుండా కాలరాస్తున్న ప్రజాప్రతినిధులు, పోలీసు యంత్రాంగంపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. పేద ప్రజలకు జీవించే హక్కు లేదా అని ప్రశ్నించారు. నదీ పరివాహక ప్రాంతంలో కొన్ని వేల మంది నివసిస్తున్నారని, అయితే అధికారులు కేవలం పేద ప్రజలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం దారుణమన్నారు. రాజకీయ నాయకులు తమ వ్యాపార ప్రయోజనాల కోసం ప్రజలను అక్కడి నుంచి గెంటి వేయడం దారుణమన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయ విచారణ జరిపించి అందుకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో
అధిక స్థానాలు టిడిపివే..
* జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి
ఆళ్లగడ్డ, జూలై 4: త్వరలో జరగను న్న పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలో అధిక స్థానాలను టిడిపి మద్దతుదారు లు కైవసం చేసుకుంటారని, 2014 ఎన్నికల్లో కూడా టిడిపి అభ్యర్థులు అధిక స్థానాల్లో విజయఢంకా మోగిస్తారని జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ధీమా వ్యక్తం చేశారు. పట్టణంలోని టిడిపి కార్యాలయంలో గురువా రం ఆయన విలేఖరులతో మాట్లాడు తూ గతంలో ఉప ఎన్నిక సందర్భంగా నాయకులు ప్రజలకు పలు హామీలు ఇచ్చారని, అయితే ఇప్పటి వరకూ వా టిని నెరవేర్చలేదన్నారు. కావున పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వచ్చే ఆయా పార్టీల నాయకులను ప్ర జలు నిలదీయాలన్నారు. పంచాయతీ ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో టిడిపి మద్దతుదారులు పోటీ చేసి గెలవడం ఖా యమన్నారు. నమ్మించి ఓట్లు వేయించుకుని, మోసం చేసిన వారికి బుద్ధి చెప్పే సువర్ణావకాశం ఇప్పుడు ఓటర్ల చేతిలో వుందన్నారు. కులం పేరుతో దూషించే వారికి ప్రజలు పట్టం కట్టరన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు చేసిన పాదయాత్ర ప్రజల్లో టిడిపి ఇమేజిని పెంచిందన్నారు. ఉత్తరాఖండ్ వరదల్లో రాష్ట్రానికి చెందిన అనేక మంది ప్రాణాలు కోల్పోయినా కాంగ్రెస్‌పార్టీ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. దీంతో చంద్రబాబు వారి కష్టాలను తెలుసుకునేందుకు స్వయంగా అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారన్నారు. ఆళ్లగడ్డ టిడిపి ఇన్‌చార్జి ఇరిగెల రాంపుల్లారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో 97 గ్రామ పంచాయతీలు వున్నాయని, అన్ని స్థానాల్లో టిడిపి మద్దతుదారులు పోటీ చేసి, గెలవడం ఖాయమన్నారు. రైతు రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతుల గురించి ఆలోచించిన పాపాన పోలేదన్నారు. నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అది టిడిపితోనే సాధ్యమన్నారు. ఏరువాక ప్రారంభమైనా ఇంత వరకూ ప్రభుత్వం రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సరఫరా చేయడం లేదన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలతో ప్రజల్లో టిడిపిపై నమ్మకం పెరిగిందని, తద్వారా రానున్న కాలంలో టిడిపితోనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు బలంగా నమ్ముతున్నారన్నారు.

* పకడ్బందీగా పంచాయతీ ఎన్నికలు * బాధ్యతలు చేపట్టిన ఎస్పీ కె.రఘురామిరెడ్డి
english title: 
sp

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>