హైదరాబాద్, జూలై 6: ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసిన విద్యార్ధులకు అంబేద్కర్ ఓపెన్ వర్శిటీలో రెండు కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నట్టు వర్శిటీ అధికారులు తెలిపారు. బిటెక్, బిఎస్సీ, ఐటిఐ చేసిన వారు కూడా వీటిలో చేరవచ్చని వారు వివరించారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే సెంటర్ ఫర్ కమ్యూనికేషన్ అండ్ ఇంజనీరింగ్ టెస్టు సంస్థతో కుదిరిన అవగాహనా ఒప్పందం మేరకు అడ్వాన్స్‌డ్ సర్ట్ఫికేట్ ప్రోగ్రాం ఇన్ పీఎల్సీస్ స్కాడా సిస్టం, సర్ట్ఫికేట్ కోర్సు ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంటర్ కనెక్షన్ టెక్నిక్స్ అనే ఈ రెండు కోర్సుల్లో చేరేందుకు ఈ నెల 15వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
జెఎన్‌టియుహెచ్ 3/2 ఫలితాలు విడుదల
జెఎన్‌టియుహెచ్ బిటెక్ కోర్సు మూడో సంవత్సరం రెండో సెమిస్టర్ (3/2) ఫలితాలను విడుదల చేసినట్టు ఇవాల్యూయేషన్ డైరెక్టర్ కె. ఈశ్వర్ ప్రసాద్ తెలిపారు. పరీక్షలకు 86107 మంది రిజిస్టర్ చేసుకోగా, అందులో 81,964 మంది హాజరయ్యారని, 44198 మంది ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. రీ వాల్యూయేషన్‌కు ఈ నెల 12వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన వివరించారు.
ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసిన విద్యార్ధులకు అంబేద్కర్ ఓపెన్ వర్శిటీ
english title:
ambedkar open varsity
Date:
Sunday, July 7, 2013